ఆంధ్రప్రదేశ్‌

మధ్యంతర ఆదేశాల జారీ సాధ్యంకాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచిన విధానాన్ని ఇతర కేటగిరీ ఉద్యోగులకు వర్తింప చేసే విషయమై కూలంకషంగా విచారించాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ కేసును సంపూర్ణంగా విచారించకుండా పిటిషనర్లు కోరినట్లుగా కార్పొరేషన్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై పిటిషనర్లు లేదా రాష్ట్రప్రభుత్వం తాము కోరిన వివరాలు సమర్పించలేదని హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యపడదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో పిటిషనర్లు, ప్రభుత్వం పూర్తి వివరాలను జూలై 15వ తేదీనాటికి సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆ లోపల చాలా మంది కార్పోరేషన్ ఉద్యోగులు పదవీవిరమణ చేస్తారని పిటిషనర్ల తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్లు పదవీ విరమణ చేసేటట్లుంటే వారి సర్వీసులను జూలై 20 వరకు కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంది. సర్వీసు కండిషన్ల వివరాలను జూలై 15వ తేదీలోపల తెలియచేయని పక్షంలో మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వమని స్పష్టం చేస్తూ కేసు విచారణను జూలై 20వ తేదీకి వాయిదా వేసింది.