ఆంధ్రప్రదేశ్‌

8ఆలయాల ఉద్యోగుల సర్వీసును 60 ఏళ్ల వరకు కొనసాగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: ఏపిలో ఎనిమిది దేవాలయాల్లో పనిచేసే సిబ్బంది పదవీవిరణమపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సర్వీసుల్లో కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. దేవాలయాల్లో పనిచేసే సిబ్బంది పదవీవిరమణ వయస్సు 58 సంవత్సరాలే నంటూ సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ శ్రీశైలం, అన్నవరం తదితర దేవాలయాల ఉద్యోగులు ధర్మాసనం వద్ద పిటిషన్ దాఖలు చేశారు. ఏపి పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ సూపర్ యేన్యుయేషన్ సవరణ చట్టం 2014 కింద ఎనిమిది దేవాలయాల దరఖాస్తులను చేర్చారని హైకోర్టు బెంచి పేర్కొంది. అందుకే ఇప్పటికే ఈ దేవాలయాల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను చట్టానికి లోబడి సర్వీసులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది పి గంగయ్యనాయుడు వాదనలు వినిపిస్తూ ఎనిమిది దేవాలయాల సిబ్బంది పదవీవిరమణ వయస్సు 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచేందుకు అర్హత కలిగి ఉన్నారని పేర్కొన్నారు. 2014లో సవరణ చేసిన నాల్గవ చట్టం కింద ఎనిమిది దేవాలయాల సిబ్బంది పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు ఉంటుందని ఆయన కోర్టుకు తెలిపారు.