ఆంధ్ర గాథాలహరి

సహజమైన ఎఱ్ఱదనం-111

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె ఎఱ్ఱమట్టి త్రవ్వి ఇంట చెట్లకు పోసి
చేతులెఱ్ఱబడగ చెఱుపనెంచి
రుద్దిరుద్ది కడుగు ముద్దియన్ పతియనె
పల్లవంబులెట్లు తెల్లనౌను
‘‘వెఱ్ఱిదానా! చేతికి అంటుకున్న ఎఱ్ఱరంగు పోలేదని ఎందుకలా పదే పదే కడుగుతున్నావు. అంటిన రంగు ఎప్పుడో పోయింది. ఇప్పుడు కనిపించే ఎఱ్ఱదనం లేత పగడపు రంగులో సహజంగా మెరిసిపోయే నీ అరచేతుల అందం అన్నాడు నాయిక అమాయకత్వానికి నవ్వుకుంటూ నాయకుడు.
ఆమె చేతులకు ఎందుకు ఎర్రరంగు అంటుకుందో మూలగాథలో చెప్పబడలేదు. కానీ ఎర్రమట్టితో పనిచేయడంవల్ల అయి ఉంటుందని పెద్దలు తిరుమల రామచంద్రగారు తమ ప్రాచీనాంధ్ర గాథలు గ్రంథంలో ఊహించారు. వారి ఊహ సమంజసంగా ఉండంవల్ల నేనూ దానే్న స్వీకరించాను. నాయిక అరచేతులు మామిడి చివుళ్ళలా పగడపు కాంతిలో ఎఱ్ఱగా మెరిసిపోతున్నాయని ఈ గాథలోని చమత్కారం.
ప్రాకృతమూలం..
ముద్ధే అపత్తిఅన్తీ పవాల అంకుర అవణ్ణ లోహి అఏ
ణిద్ధో అధాఉరాఏ కీస సహత్థే పుణోధు అసి
సంస్కృతచ్ఛాయ...
ముగ్థే ప్రత్యన్తీ ప్రవాలాంకుర వర్ణలోహితౌ
నిర్దౌత ధాతు రాగౌ కిమితి స్వహస్తౌ పునర్థావయసి
- ఇంకావుంది

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949