తెలంగాణ

ఎసిబికి చిక్కిన సింగరేణి సివిల్ డిజిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ కాంట్రాక్టర్ వద్ద 20వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం

యైటింక్లైన్‌కాలనీ, డిసెంబర్ 29: సింగరేణి ఆర్జీ-2 జియం కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా సివిల్ డిజిఎం బి. మధుసూదన్ ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఎసిబి డిఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. ముక్కెర మొగిలి అనే సబ్ కాంట్రాక్టర్ వద్ద 20వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. సదరు కాంట్రాక్టర్ పనులు పూర్తి చేసి 4.60లక్షల రూపాయల బిల్లుల కోసం దరఖాస్తు చేసుకోగా అట్టి బిల్లులకు 50వేల రూపాయలు లంచంగా చెల్లిస్తేనే బిల్లులు వస్తాయని డిజియం అనడంతో సదరు కాంట్రాక్టర్ 20వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికి నేను చెప్పిన డబ్బులు ఇవ్వకపోతే బిల్లులమీద సంతకం చేసేదే లేదని అధికారి దబాయించడంతో సదరు కాంట్రాక్టర్ కరీంనగర్ ఎసిబి డిఎస్పీని ఆశ్రయించగా మంగళవారం మరొక 20వేల రూపాయలను కాంట్రాక్టర్ నేరుగా డిజియం చాంబార్‌లోకి వెళ్లి ఇస్తుండగా ఎసిబి అధికారులు అక్కడికి చేరుకొని డబ్బులను, అధికారిని పట్టుకున్నారు. ఎసిబికి అధికారి చిక్కడంతో ఆర్జీ-2లో ఒకేసారి కలకలం చెలరేగింది. కాగా డిజియం మధుసుదన్ ప్రతీ పనికి కాంట్రాక్టర్‌లను కమీషన్ల పేరిట వేదిస్తున్నాడని, అనేక మంది కాంట్రాక్టర్లు ఫోన్లు చేసి తెలిపారని అలాగే సింగరేణిలో ఎలాంటి అవినీతికి పాల్పడుతున్న వ్యక్తుల గురించి సమాచారం లేదా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని డిఎస్పీ సుదర్శన్ గౌడ్ తెలిపారు. నిందితుని చాంబార్‌ను సోదాచేయగా మరో 9వేల రూపాయలు ఉన్నట్లుగా గుర్తించారు. కాంట్రాక్టర్ ముక్కెర మొగిలి మాట్లాడుతూ తనను మానసికంగా వేదిస్తూ ఆర్థికంగా నష్టం వాటిళ్లే విదంగా సదరు అధికారి అనేక ఇబ్బందులకు గురిచేశాడని తన కాంట్రాక్టు పనులకు సంబంధించిన లక్షలాది రూపాయల బిల్లులను ఆపివేయడంతో గత్యంత్రం లేక ఎసిబి ఆశ్రయించడం జరిగినట్లు వివరించారు. నిందితుడు మధుసుదన్‌ను అరెస్టు చేసి కరీంనగర్‌కు తరలించారు. ఏది ఏమైనా సింగరేణిలో అవినీతి ఉన్నదని దీనిపై సింగరేణి విజిలెన్స్ ఇప్పటికైనా కల్లు తెరిచి మధుసుదన్ లాంటి అధికారులపై దృష్టిపెట్టాలని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నారు. అలాగే సింగరేణిలో 15సంవత్సరాల క్రితం విశ్వనాథ్ అనే అధికారి లంచం తీసుకుంటుండగా పట్టుబడగా ఎసిబికి ఈ తరహాలో పట్టుబడడం రెండవ సారి. ఈ సంఘటనపై సంస్థ సి అండ్ ఎండి ఏ విదంగా కఠిన చర్యలు తీసుకోనున్నాడో వేచి చూడాలి.