తెలంగాణ

జిహెచ్‌ఎంసి డిఇ ఇంట్లో ఏసిబి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రూ. 7కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించిన ఏసిబి

హైదరాబాద్/గచ్చిబౌలి, మార్చి 10: మహానగర పాలక సంస్థలో పనిచేస్తున్న ఓ డిప్యూటీ ఇంజనీర్ గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ ఏసిబి అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేశారు. పలు విలువైన డాక్యుమెంట్లతోపాటు రూ. 1.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పీర్ సింగ్ ఇప్పటి వరకు రూ. 7 కోట్లకు పైగా ఆస్తులు కలిగివున్నట్టు అధికారులు గుర్తించారు. శేరిలింగంపల్లి-2 సర్కిల్, చందానగర్ మున్సిపల్ కార్యాలయంలో పీర్‌సింగ్ డిప్యూటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. సాంకేతిక విభాగంలో విధులు నిర్వహిస్తున్న పీర్ సింగ్ మాదాపూర్‌లోని గుట్టల బేగంపేట్‌లో నివాసముంటున్నారు. ఎసిబి అధికారులు ఆరు బృందాలుగా ఏర్పడి గురువారం ఉదయం ఆరుగంటల నుంచే ఏకకాలంలో ఐదు చోట్ల సోదాలు నిర్వహించారు. పీర్ సింగ్ ఇంటితోపాటు ఆయన కుమారుడు, బంధువుల ఇళ్లపై దాడులు నిర్వహించి సోదాలు చేశారు. హైదరాబాద్‌లోనే కాకుండా నిజామాబాద్‌లోని పీర్‌సింగ్ ఆస్తులపైనా దాడులు కొనసాగుతున్నట్టు ఎసిబి డిఎస్పీ రవీందర్‌రెడ్డి తెలిపారు. మాదాపూర్, మల్కాజ్‌గిరిలలో 450 చ.గ. 800 చ.గ. 500 చ.గజాల ఇళ్ల స్థలాలను, నిజామాబాద్‌లో 4ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 7 కోట్లు ఉండొచ్చని డిఎస్పీ నరేందర్ రెడ్డి తెలిపారు. శేరిలింగంపల్లిలో అసిస్టెంట్ ఇంజనీర్‌గావున్న పీర్‌సింగ్ ప్రమోషన్ పొంది డిఇగా చందానగర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. నిజామామాద్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడి డిఎస్పీ మధుసూదన్‌రెడ్డి, సిఐ వెంకటరెడ్డి, అంజిరెడ్డిలు సోదాలు నిర్వహించారని డిఎస్పీ తెలిపారు.
అవినీతికి పాల్పడలేదు: పీర్‌సింగ్
తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని డిప్యూటీ ఇంజనీర్ పీర్‌సింగ్ తెలిపారు. ఒక సంవత్సర కాలంలో తాను ఇంత సంపాదించాననడం అవాస్తవమన్నారు. తన కొడుకు, కుమార్తె మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ఇదంతా వారి ఆస్తేనని ఆయన స్పష్టం చేశారు. తాను అవినీతికి పాల్పడినట్టు రుజవైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని డిఇ పీర్ సింగ్ స్పష్టం చేశారు.