ఆంధ్రప్రదేశ్‌

అంతర్జాతీయ స్థాయిలో లేపాక్షి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, ఫిబ్రవరి 12: లేపాక్షి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. లేపాక్షికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ఉత్సవాలు నిర్వహిస్తామని,తెలిపారు. లేపాక్షి ఉత్సవాల ఏర్పాట్లను శుక్రవారం టూరిజం అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో బాలకృష్ణ శుక్రవారం సమీక్షించారు. బాలయ్య మీడియాతో మాట్లాడుతూ, శిల్ప కళలకు నిలయమైన లేపాక్షి కీర్తిప్రతిష్టలను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పేందుకు ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించే ఉత్సవాలను వేదికగా చేసుకుంటున్నామన్నారు. శ్రీకృష్ణదేవరాయల వైభవానికి చిహ్నంగా ఉన్న లేపాక్షిని అన్నివిధాలా అభివృద్ధి పరిచేందుకు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక అందచేశామన్నారు. లేపాక్షి ఉత్సవాలు నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యేగా తనకు అవకాశం లభించడం గర్వకారణంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ సినీనటీనటులతోపాటు కర్నాటక తదితర ప్రాంతాలకు చెందిన సినీ ప్రముఖులు హాజరవుతారని బాలకృష్ణ వివరించారు.రాయలనాటి చరిత్రను ఇనుమడింప చేస్తూ ప్రత్యేకంగా కళాకారులచే నాటక ప్రదర్శన ఉంటుందన్నారు. తనతో పాటు ప్రముఖ రచయితలు పరుచూరి సోదరులు, ప్రముఖ కవి జొన్నవిత్తుల, ప్రముఖ సినీనటులు ప్రకాష్‌రెడ్డి తదితరులు నటిస్తారన్నారు. ప్రముఖ సినీ సంగీత దర్శకులు కీరవాణి ఆధ్వర్యంలో లేపాక్షి ఉత్సవాల సందర్భంగా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తామన్నారు. తెలుగుభాషకు వనె్న తెచ్చిన రాయల వైభవాన్ని నేటి తరాలకు సాక్షాత్కరింపజేసేందుకు ఇదొక అద్భుత అవకాశమని బాలకృష్ణ అభిప్రాయ పడ్డారు.