తెలంగాణ

అన్ని ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవిందరావుపేట, ఫిబ్రవరి 15: సమ్మక్క-సారలమ్మ తల్లుల జాతరకు తెలంగాణా ప్రభుత్వం అన్ని ఎర్పాట్లు పూర్తి చేసిందని దేవాదాయ, గృహనిర్మాణశాఖ మాత్యులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన, పర్యాటకశాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అన్నారు. సోమవారం మేడారంలోని జంపన్నవాగు వద్ద భక్తులతో మాట్లాడిన ఇంధ్రకరణ్‌రెడ్డి జాతర ప్రాంగణాలను పరిశీలించారు. మేడారంలో వాటర్ ప్లాంటును ప్రారంభించడంతోపాటు మేడారం సమ్మక్క ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. స్దానిక చిరు హోటల్లలో నాణ్యమైన వంటనూనెలలనే వాడాలని సూచించారు. జాతర పరిసరాల ప్రాంతాలను పరిశీలించిన అనంతరం మంత్రి చందూలాల్‌తో కలిసి మేడారం లోని ఐటిడిఎ విశ్రాంతి గృహాంలో సోమవారం వారు విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఎర్పాటు అయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి మేడారం జాతరను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంధ్రశేఖర్‌రావు ప్రత్యేక శ్రద్ద చూపి 181 కోట్ల రూపాయలను నిధులను మంజూరీ చేసిందని అన్నారు. ఈనెల 17 నుండి 20 వరకూ జరగనున్న మేడారం జాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తారనే అంచనాలతో ప్రభుత్వం ఎర్పాట్లను పూర్తి చేసిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విదంగా 4వేల బస్సులతో భక్తులను క్షేమంగా చేరవేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. 1996లోనే స్టేట్‌ఫెస్టివల్‌గా మేడారం జాతరను ప్రభుత్వం గుర్తించినా ఆ మేరకు నిధులు విడుదల కాకపోవడం వల్ల జాతరలో అభివృద్ది కుంటుపడిందని అన్నారు. రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో 29 కోట్లతో అభివృద్ది పనులను పూర్తిచేసామని, 3500మీట్లర పోడవుతో కోట్ల నిధులతో స్నానఘట్టాలను అభివృద్ది చేసామని అన్నారు. దీంతో ఎంత మంది భక్తులైనా జంపన్నవాగులో చిరుజల్లుల కింద స్నానాలు చేయవచ్చని మంత్రులు తెలిపారు. భక్తులు అమ్మలను దర్శించుకొని క్షేమంగా గమ్యస్దానాలకు చేరేందుకు అన్ని ఎర్పాట్లను పూర్తిచేసినట్టు మంత్రులు తెలిపారు. ఈ సమావేశంలో మేడారం పునరుద్దరణ కమిటి అధ్యక్షులు కాకలింగయ్య, శాసనసభ్యులు కొండప్ప,జడ్‌పి ఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్ తదితరులు పాల్గొన్నారు.