S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం కథ

12/09/2016 - 22:12

శనివారం సంత జరిగే ఊరని పొరబాటు పడుతుంటారు విన్నవారు. అది కాదు.
ఆ ఊరి కొండమీద నిలువుగా పాతిపెట్టిన ఎత్తయిన శిల ఉంది. శనిగ్రహ దోషాలున్నవారు ఆ శిలను శనివారంనాడు నువ్వుల నూనెతో అభిషేకిస్తే గ్రహదోషం తొలగిపోతుందని పురాతన కాలంనించీ నమ్మకం ఉంది.
ఆదిమానవుల నివాసాలు ఇక్కడ ఉండేవనీ, మరణించినవారిని పూడ్చిపెట్టి తలవైపున పెద్ద శిలను స్థాపించేవారని- ఈ శిల అటువంటిదేనని కొందరి అభిప్రాయం.

12/02/2016 - 22:45

‘‘డాడీ.. డాడీ.. ఈ రోజు మా స్కూల్‌లో ఓ కొత్త కాంపిటీషన్ పెట్టారు తెలుసా?’’
ఆ రోజే ఆఫీసులో ఇంక్రిమెంట్ అందుకున్న ఆనందంలో సాయంత్రం ఇంట్లోకి అడుగుపెట్టిన వెంకట్రావుతో అన్నారు.. అతని పుత్ర, పుత్రికారత్నాలు. ఈలోగా కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చింది కామేశ్వరి.

11/25/2016 - 22:50

బుగ్గలోడు.. పేరుకు తగ్గట్టే ఎర్రగా, బుర్రగా, బూరెల్లాంటి బుగ్గలతో, పాల వనె్నతో మెరిసిపోతున్నాడు.. పేరూ, గీరూ లేదు వాడికి.. ఒక రోజు అర్ధరాత్రి ఎవరో పసిగుడ్డును తెచ్చి ఊరి మధ్యలో వదిలేశారు.. తెలతెలవారుతుండగా చంటిబిడ్డ గుక్కపెట్టి ఏడుస్తుండగా అది విని ఊరు ఊరంతా మేల్కొని ఆడి చుట్టూ చేరింది.

11/18/2016 - 22:01

మనసు బాగాలేనప్పుడు ముందు రాజేష్ గుర్తుకొస్తాడు. ఆ తర్వాత ఇండియా గేట్. పెళ్ళైన కొత్తలో ఇద్దరం ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న మారుతి 800ను ఇండియా గేట్ వైపు పోనిచ్చింది విశారద. దూరమెక్కువైనా కావాలనే ఏపీ భవన్, చిన్మయ మిషన్, లోథీ రోడ్డు, పార్కు, జంతర్‌మంతర్, ఆంధ్రా స్కూల్, పాటియాలా హౌస్, సుప్రీంకోర్టుమీదుగా ఇండియా గేట్ చేరుకుంది. ఆ ప్రాంతాల్లో రాజేష్‌తో విశారద గడిపిన జ్ఞాపకాల వయస్సు పాతికేళ్ల పైమాటే.

11/12/2016 - 05:21

రఘురాం తన కొడుకు సాకేత్ పెళ్లికోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు..
సాకేత్ చదువుకోసం బోలెడు పెట్టుబడి పెట్టడంతో అదంతా కట్నం రూపంలో రాబట్టాలన్న నిర్ణయానికి వచ్చాడు. మ్యారేజ్ బ్యూరో నడిపే నాగకుమారిని కలిశాడు.

11/04/2016 - 22:56

‘షీట్.. ఏంటిది.. త్దీక ఘూళ క్యఖ ఘ్జశ ఇళ్దజశజూ ళ్పళూక ఛ్యిఆశజదఆ’ అరుస్తున్నాఢు బాస్. ఎప్పుడు మెప్పుకోలే వినడం అలవాటయిన సిద్ధార్ధకు ఈ మధ్య తరచుగా వినిపించే ఈ మాటలు తలకొట్టేసినట్లుంటున్నాయి.

10/28/2016 - 21:09

అందమైన డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్.. ఎక్కడి వస్తువులు అక్కడ నీట్‌గా సర్దివున్నాయి. కిటికీలకు, ద్వారాలకు లేత నీలిరంగు డిజైన్‌లో కర్టెన్స్ వేలాడుతున్నాయి. ఓ పక్కగా అమర్చబడిన అక్వేరియంలో రంగు రంగుల చేపలు చురుగ్గా కదులుతున్నాయి. అది మధ్యగా సీలింగ్‌కు వేళ్లాడుతూన్న చిన్న షాండ్లియర్ గదికే ఓ కొత్త అందాన్ని తెస్తోంది. అక్కడ ప్రతి వస్తువూ గది అందాన్ని మరింతగా పెంచుతున్నాయి. ఆ ఒక్క గదే కాదు ఇల్లంతా చక్కగా..

10/22/2016 - 00:28

‘‘ఒరేయ్ రాజా!.. గదిలో ఫేను వృధాగా తిరుగుతోంది’’ అంటూ మా ఆవిడ మా అబ్బాయిని గట్టిగా కేకేసింది. వాష్‌బేసిన్ ముందు నిలబడి పళ్ళు తోముకుంటున్న రాజా గబగబా పరుగెత్తాడు ఫేను తిరుగుతున్న గదిలోనికి..

10/15/2016 - 02:44

ప్రసాద్ ఆఫీసును నుంచి ఇంటికొచ్చి తలుపుకొట్టాడు. వెంటనే అతడి ఎడమ కన్ను అదిరింది. దూరంగా ఎక్కడో తీతువు అరిచినట్టు, నక్క ఊళలు వేసినట్టు భ్రమకలిగింది.
‘‘అయ్యబాబాయ్ నాకేదో మూడింది. బతుకు బస్టాండు అయిపోతుందేమో..’’ అనుకున్నాడు.
అతడి శ్రీమతి తలుపు తీసింది. ఆమెను చూసి జడుసుకున్నాడు. కళ్ళు ఎర్రగా వున్నాయి. జుట్టు విరబోసుకుంది. నుదుటిమీద ఎర్రబొట్టు. ఏమీ మాట్లాడకుండా అక్కడనుంచి కదిలింది.

10/07/2016 - 21:02

ఉత్తమకుమార్‌కు ఉత్సాహం ఉరకలేస్తోంది. కారణం అతను రాసిన కథల్ని, పుస్తకంగా తీసుకువచ్చాడు. ఆ పుస్తకాల ఆవిష్కరణకు అతను అమితంగా ఇష్టపడే ఆముదాలవలసలో జరగడంతో ఆ ఉత్సాహం రెట్టింపయ్యింది. ఉత్తమకుమార్ సొంతపేరు కాదు కలం పేరు. అతని అసలు పేరు కుమార్. దానికి ఉత్తమ తగిలించాడు. దానికి కారణం సంఖ్య శాస్త్ర, జ్యోతిషం మీద అతనికి గల అమిత నమ్మకం.

Pages