S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

05/27/2018 - 00:21

జాతికైనా, దేశానికైనా కంటికి కనబడని సాంస్కృతిక రూపాలు చాలా ఉంటాయి. సంగీతం, భాష, వౌఖిక సాహిత్యం, నమ్మకాలు, విశ్వాసాలు, క్రతుకర్మకాండలు వంటివి ఒకవైపు, కనబడే సాంస్కృతిక రూపాలు మరోవైపు దేశ ఔన్నత్యానికి ప్రతిరూపాలుగా ఉంటాయి. వీటిలో చారిత్రక కట్టడాలు, నిర్మాణాలు, గుడులు, శిల్పసంపద, చిత్రలేఖనం వంటివి ముఖ్యమైనవి.

04/29/2018 - 00:09

పొట్లపల్లి రామారావు (1917-2001) రచనల కన్నా ఆయన జీవితం చాలా గొప్పది. ఆయన గొప్ప మానవతావాది, ఇతరుల కష్టాలను చూసి కన్నీ టి పర్యంతం అవుతాడు. భూస్వామ్య కుటుంబం నుండి వచ్చినా ఇసుమంత గర్వం లేదు. నిరాడంబరుడు. ఏ రకమైన ప్రలోభాలకు లోనుకాలేదు. రచనల ద్వారా కీర్తిప్రతిష్టలు వచ్చినా వాటిని అటు పక్కగా పెట్టి, తాను తనలాగే జీవించాడు. అతనొక గొప్ప కథకుడు. లభించినవి పదహారు కథలే అయినా ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం.

04/22/2018 - 00:03

దశాబ్దాల సమస్య, ఆధిపత్యం ఒక్క ప్రశ్నతో దోషిగా నిలబడక తప్పదు. ఐతే ప్రశ్నించే వారిని చూసి, అసలు ప్రశ్నని దాటవేసేదే నిజమైన ఆధిపత్యం. ప్రశ్న కిందివర్గాల నుండి వస్తే దానిని ప్రశ్నకాకుండా చేస్తారు. ఆ ప్రశ్నని నొక్కిపెట్టడానికి, పక్కదారి పట్టించడానికి నిస్సిగ్గుగా ప్రయత్నాలు మొదలవుతాయి. అలాంటి ఒక ప్రశ్న గురించి మనమైనా మాట్లాడుకుందాం. మాట్లాడేవారు తగ్గిపోతున్నకాలం ఇది. కాబట్టి మాట్లాడక తప్పదు.

04/15/2018 - 00:30

మధ్య లాల్‌జెండా నీలజెండాతో దోస్తీ చేస్తున్నది. రెంటి మేళవింపుతో కొత్త ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నాలు హెచ్చయ్యాయి. ఐతే లాల్‌జెండా వైపునుండి ఈ ప్రయత్నాలు ముమ్మరం కావడం విశేషం. ప్రజల కోసం పనిచేసే ఈ పార్టీలు ప్రజల మన్నన చూరగొనడంలో విఫలమయ్యాయా? ఎందుకు ఏ ఎన్నికల్లోనూ రాణించలేకపోతున్నాయి. ప్రజాభిమానం చూరగొనలేకపోతున్నాయి.

04/08/2018 - 00:08

రెండు వారాల క్రితం జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలోని ఏటూరు నాగారం ఐటిడిఏ కార్యాలయంలో ఆదివాసీ భూ సమస్యలపై బహిరంగ విచారణ (ఇండియన్ పీపుల్స్ ట్రిబ్యునల్) జరిగింది. దీనిని ‘హ్యూమన్ రైట్స్ లా నెట్‌వర్క్’ (హెచ్‌ఆర్‌ఎల్‌ఎన్), ఆదివాసీ సంఘాల జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆనాడు విన్న, కన్న విషయాలే ఈవారం ము చ్చట్లు.. ఆదివాసీలు తమ భూములను కాపాడుకునేందుకు ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్నారు.

03/25/2018 - 01:20

కుల నిర్మూలన జరిగే క్రమంలోనే ప్రజలపై ఇతర
రాజకీయ పార్టీలు, ప్రాబల్యం తగ్గిపోతూ ఉంటుంది. కొత్త మనిషికి నిర్వచనం ఇస్తూ, అలాంటి మానవుడిని రూపొందించేందుకు ‘చీరాల అనుభవం’ పనికి వస్తుందని నాకు నేను ఆశ్వాసన ఇచ్చుకున్నాను.

03/18/2018 - 00:18

ఉగాది వేడుకల్ని వారం రోజుల ముందే హోసూరు ‘బస్తీ యువక బృందం’ ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమాల నిర్వాహకుడు అగరం వసంత్. అతను వృత్తిరీత్యా వైద్యుడు. గోళీలు, సూదులతోనే కాదు, అక్షరాలతో వైద్యం చేస్తాడు. సాహిత్య సేద్యం చేస్తాడు. అక్కడ తెలుగుమీద మక్కువ ఎక్కువ. తెలుగుకోసం ఏమైనా చేస్తారు. తెలుగు బడులు నిలుపుకోవడం కోసం ఉద్యమాలు చేశారు. తమ ప్రాంతీయ తెలుగు భాష (మొరసనాడు భాష) కోసం జైళ్ళకు కూడా వెళ్లి వచ్చారు.

03/10/2018 - 23:41

ఒక రచయిత ఎలా ప్రభావితుడవుతాడనే విషయంపై అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఈ అభిప్రాయాలను రచయిత కూడా చెబుతాడు. లేదా అతని అభిమానులు, సమీక్షకులు, విమర్శకులు, పరిశోధకులు వ్యక్తం చేస్తారు. సాంప్రదాయ వర్గాలకు, కులాలకు చెం దిన వారు సరస్వతీదేవి కటాక్ష వీక్షణాల వల్లే రచనలు చేయగలిగారని చెప్పడం ఆనవాయితీ. ఇలాంటి కల్పనలు ఆపాదించడానికి చాలామంది వెనుకాడరు.

02/25/2018 - 01:45

తేమ ఉండాల్సిన గాలిలో తాపం పెరిగింది. ఉష్ణం తాకాల్సిన కాలంలో శీతలం వీస్తోంది. ఎడారిలో మంచు. మంచు పొరలు కమ్మాల్సిన పైన్ వృక్షాల పరిసరాల్లో కమురు వాసన.
నీరు నాటాల్సిన మేఘంలో శూన్యం. శూన్యంలో నీటి భగభగ. రుతువులు తారుమారయ్యాయి. ఖండాలు దాటి, ధృవాలు దాటి బదిలీ అయ్యాయి.

02/17/2018 - 23:32

ఎక్కడైనా సమస్య ఉంటే పత్రికల ద్వారా నలుగురికీ తెలుస్తుంది. కాని నలుగురి సమస్యను ఒక్క పత్రిక కూడా పట్టించుకోకపోతే ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితి గతంలో ఏనాడూ దాపురించలేదు. రాష్ట్ర విభజన తరువాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన పరిస్థితి విచిత్రంగా ఉంది.

Pages