S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/20/2019 - 20:46

ఓ రోజు రామకృష్ణ-చంద్రకళ నటించిన ‘నోము’ చిత్రం చూశారు గోపాలకృష్ణ. అందులో కనిపించింది జయసుధ. తన పాత్రకోసం అమాయకమైన అమ్మాయిలా కనిపించే హీరోయిన్ కావాలి. జయసుధ అయితే బాగుంటుందని నిర్మాతలకు చెప్పారు గోపాలకృష్ణ.

07/13/2019 - 20:55

ప్రతిభ ఎవరి సొత్తూ కాదు. అదున్న వ్యక్తి ఏ రంగంలోనైనా రాణిస్తాడు. ఒక రంగానికే అంకితమైతే మరింత
రాణించగలడు. తన లోపం తాను తెలుసుకుని, ఎంతవరకు ఏ పనికి న్యాయం చేయగలడో
తెలుసుకోవడం ప్రతి వ్యక్తికి అవసరం. అటువంటి అరుదైన వ్యక్తులలో నిట్టల గోపాలకృష్ణ, అదే.. లక్ష్మణరేఖ
గోపాలకృష్ణ ఒకరు.

07/06/2019 - 20:36

కొన్ని జ్ఞాపకాలు -ఊపిరాడనివ్వవు. ఇంకొన్ని
జ్ఞాపకాలు -ఊపిరాగనివ్వవు. సుదూరానికి
ప్రయాణిస్తూ, తీరిక దొరికినపుడు వెనక్కి తిరిగి చూస్తే కనిపించే ప్రతి అడుగూ -ఓ జ్ఞాపకమే. కాని అవి ఓ పద్ధతిలో క్రమబద్ధంగా కనిపిస్తే, ఆ జీవితానికెంతో హాయి. అవే అడుగులు చిందరవందరగా
అగుపిస్తే -ఆ బతుకు బండరాయి. లక్ష్మీకాంత్
అదృష్టవంతుడు. అడుగులో అడుగేస్తూ..

06/29/2019 - 20:17

మహావృక్షాలు కూడా రాత్రికి రాత్రి పుట్టవు. మట్టిని ఎగదన్నుకుంటూ విత్తనం నుంచి బయటికొచ్చిన మొలక -ఏళ్ల తరబడి ప్రయాణాన్ని కొనసాగిస్తే తప్ప మహావృక్షంగా సాక్షాత్కరించదు. ఎదిగే క్రమంలో ఏ మొలకా గమనాన్ని, గమ్యాన్ని నిర్దేశించుకోకపోవచ్చు. కాని -ఎదిగిన తరువాత ఆ రెండూ దాని నీడలో కనిపిస్తుంటాయి.

06/22/2019 - 20:42

తల్లిని మించిన దైవం లేదంటారు అంతా. నాకు మాత్రం మా అమ్మ దేవమే కాదు, సైన్యం.. ధైర్యం కూడా.
**

06/15/2019 - 21:19

నటుడిగా ఒదగడం -గొప్ప ఆనందం. సహాధ్యాయుడు -ఆకాశానికెదగడం అనిర్వచనీయ ఆనందం. ఇది -వందలో ఏ ఒక్కరికో లభించే అనుభవం. ఆ ఒక్కడు -గుళ్లాపల్లి నారాయణరావు.

06/08/2019 - 21:06

ప్రతిభ, కళ.. రెండూ ఒక్కచోట చేరడం దైవదత్తమైన వరం. ఆ వరాన్ని అందిపుచ్చుకుని అనేకమందికి సేవచేస్తూ తరించడమూ పుణ్యఫలమే. నిరంతర కృషికి మూలసాధనమైన ప్రతిభ -జీవితానికి ఓ పరమార్థత చేకూరుస్తుంది. కూచిపూడి నృత్యాన్ని తెలుగు రాష్ట్రాల్లోనేకాక దేశ విదేశాల్లో ప్రదర్శించి.. శిష్యపరంపరను ప్రపంచానికి పరిచయం చేస్తోన్న నాట్యబ్రహ్మ ఆమె.

05/25/2019 - 21:30

ఏ పాత్ర చేసినా దానికొక బాణీని ఆపాదించగల నటుడు మిశ్రో. పాటకు బాణీగానీ, పాత్రకేంటని అనుకోవచ్చు. కానీ, మిశ్రోని తడిమి చూస్తే -ఔను పాత్రకూ బాణీ ఉంటుందంటాం. నలుగుర్ని కూడేస్తే నాటకమనుకునే అనుభవం నుంచి మొదలైన నట ప్రస్థానం -గొప్ప దర్శకుల నుంచి ప్రశంసలు అందుకునేంత వరకూ సాగింది. కత్తి.. బ్లేడు..

05/18/2019 - 22:09

సజ్జ చేలో -సజ్జలే పండుతాయి. ఇది సద్దిమూటలాంటి పెద్దల మాట.

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులోని పోలాప్రగడ సుబ్బారావు, లక్ష్మీదేవమ్మల ఇంటా అదే జరిగింది. తోబుట్టువులకు నటన పట్ల ఆసక్తి ఉండటంతో వాళ్ల మధ్య పెరిగిన కుర్రాడు మాత్రం ముఖానికి రంగేసుకోవాలన్న ఆలోచనలతో పెరిగాడు. -పసి వయసునుంచే వేషాలకు ఆకర్షితుడయ్యాడు. అతనే -జనార్దనరావు. కళారంగానికి మాత్రం సింపుల్‌గా జెన్నీ.

05/11/2019 - 21:08

ప్రకృతి రమణీయత ఆస్వాదనకు రెక్కలల్లార్చి ఎగిరే సీతాకోకచిలక -పువ్వు పువ్వునూ పకలరిస్తుంది. తన అందాన్ని పరిచయం చేస్తుంది. మకరందాన్ని గ్రోలుతుంది. మొత్తంగా -ప్రకృతితో మమేకమై చూసే కళ్లకు ఒకింత ఆనందాన్నిస్తుంది. ఈ వారం వెనె్నల అతిథి కూడా అలాంటి -సీతాకోకచిలుకే. ఎక్కడో పుట్టింది. ఎక్కడెక్కడికో ఎగిరింది. తనెలా ఉండాలో అలాగే ఉంది. ఎలా ఉండాలనుకుందో అలాగే ఉండటానికి ప్రయత్నించింది.

Pages