S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/16/2016 - 21:54

దాదాపు పాతికేళ్ళ క్రితం వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సుందరకాండ’లో నేటికీ ఫ్రెష్‌నెస్ కనిపిస్తుంది. అందుకే బుల్లితెరపై వేసినా -ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 1992 అక్టోబర్ 15న మార్నింగ్‌షో చూశాను. ఇప్పటికీ ‘అపర్ణ’ (కళ్ళద్దాల హీరోయిన్)ను, డాబామీద కనిపించే ‘మేఫ్లవర్’ను మర్చిపోలేం. పాటలు ఎప్పటికీ సతతహరితమే. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. ఇప్పుడు లెక్చరర్‌గా పని చేస్తున్నా.

05/16/2016 - 21:50

జగ్గయ్య, జానకి జంటగా 1959లో విడుదలైన చిత్రం ‘ఆలుమగలు’. దీనికి సంగీత దర్శకులు కెవి మహదేవన్. ఆచార్య ఆత్రేయ కలంనుండి జాలువారిన పదిసూత్రాల పాట సరళమైన పదజాలంతో, సుశీల గళ మాధుర్యంతో అందరూ మెచ్చే పాటగా ప్రసిద్ధిపొందింది. ‘ఒకటి ఒకటి ఒకటి మానవులందరు ఒకటి’ అనే గీతం ప్రబోధ గీతంలా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచ నీతినంతా పది వాక్యాల్లో, పాటలో, ఇమడ్చగలగడం ఆత్రేయకే చెల్లింది. పాట విషయానికి వస్తే..

05/16/2016 - 21:25

కథ, మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
నృత్యం: పసుమర్తి, చిన్ని, సంపత్, తంగప్ప, కెఎస్ రెడ్డి
సంగీతం: కోదండపాణి
కళ: బిఎన్ కృష్ణ
ఎడిటింగ్: ఎంఎస్‌ఎన్ మూర్తి
కెమెరా: ఎంజి సింగ్
స్టంట్స్: రాఘవులు అండ్ పార్టీ
నిర్మాత: బి పురుషోత్తం
(పద్మనాభం తమ్ముడు)
దర్శకత్వం: కె హేమాంబరధరరావు.

05/16/2016 - 21:22

రెజీనా తెరంగేట్రం చేసినప్పుడు చేతిలో ఫటాఫటా రెండు హిట్లు పడిపోయాయి. వెంటనే ఒక్కసారిగా రెజీనా ఖాతాలో అవకాశాలు కూడా అంతే వేగంగా పడిపోయాయి. కానీ రోజురోజుకి చిత్రాల విజయాల శాతం మాత్రం రెజీనా అకౌంట్‌లో తగ్గిపోవడంతో ఆమె పారితోషికం కూడా రూపాయి రూపాయి తగ్గిపోతోంది. తన అందం, నటనతో మంచి అవకాశాలు దక్కించుకున్నా హిట్లు లేకపోవడంతో డిమాండ్ కూడా పడిపోయింది.

05/16/2016 - 21:07

పెద్ద సినిమాల రాకతో చిన్న సినిమాలు చిన్నబోయినా, ఈ వారం ధైర్యంగా డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ వారం విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా ‘బిచ్చగాడు’, సంగీత దర్శకుడు జివి ప్రకాష్‌కుమార్ కథానాయకుడిగా రూపొందిన ‘పెన్సిల్’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండూ తమిళంలో నిర్మించినవే కావడం విశేషం. ఈవారం ‘ఓ మల్లి’ చిత్రం తెలంగాణలో విడుదలైంది. ఈ చిత్రాలలో బిచ్చగాడు, పెన్సిల్ వౌత్ టాక్‌తో ఫర్వాలేదనిపించుకుంటున్నాయి.

05/16/2016 - 21:06

సొట్టబుగ్గల అందాల భామ తాప్సీకి అన్నీ అందినట్లే అంది చేజారిపోతాయి. తొలి సినిమా కె.రాఘవేంద్రరావుతో చేసినప్పుడే తాప్సీ కెరీర్ టాప్‌మోస్ట్‌గా వెలిగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ సీన్ సితార అయి ఆమెకు అవకాశాలే లేకుండా పోయాయి. అయినా కానీ పట్టువదలకుండా ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆమె పట్టించుకున్నా ఎవరూ ఆమెను పట్టించుకున్న పాపాన పోలేదు.

05/09/2016 - 22:52

సినిమా రంగంలో నిర్మాత బి నాగిరెడ్డి గురించి తెలియనివారు ఉండరు. దక్షిణ భారతదేశంలోనే కాదు హిందీ చిత్రాల నిర్మాతగా యావత్ భారతదేశానికి ఆయన తెలుసనటం సత్యదూరం కాదు. విజయా ప్రొడక్షన్స్ అధినేతగా, విజయ హాస్పటల్ రూపకర్తగా, విజయచిత్ర, చందమామలాంటి పత్రికల స్థాపకుడిగా, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడిగా నాగిరెడ్డి సేవలు అందరికీ తెలిసిందే.

05/09/2016 - 22:45

(ఫ్లాష్‌బ్యాక్ @50)

కథ, రచన: తాండ్ర సుబ్రమణ్యం
కెమెరా: రామచంద్రన్
ఎడిటింగ్: జిడి జోషి
కళ: కుదురువల్లి నాగేశ్వరరావు
నృత్యం: చిన్ని, సంపత్
సంగీతం: టివి రాజు
స్పెషల్ ఎఫెక్ట్స్: ఎస్‌ఎస్ లాల్
దర్శకత్వం: ఎస్‌డి లాల్

05/09/2016 - 22:01

సంచలనాల దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ.. ఇప్పుడు మళ్లీ బాలీవుడ్‌ని ఊపుఊపేందుకు సిద్ధమవుతున్నాడు. అప్పట్లో కంపెనీ సినిమాలో ఖల్లాస్ అంటూ రూపొందించిన సాంగ్ దుమ్మురేపింది.. ఆ సాంగ్‌లో హాట్ హాట్ చిందులువేసి మంచి పాపులర్ అయింది ఇషా కొప్పికర్. ఇప్పుడు ఆ పాటలు మళ్లీ రిమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు వర్మ. ఆయన రూపొందిస్తున్న వీరప్పన్ సినిమాలో ఈ సాంగ్ ఉంటుందట.

05/09/2016 - 22:00

బ్రహ్మోత్సవం సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా తర్వాత మహేష్‌బాబు హీరోగా నటించే తదుపరి చిత్రానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్‌లో ప్రారంభం కానుందట. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో హీరోయిన్ కోసం అనే్వషణ జరుగుతోంది. ఇప్పటికే పరిణితి చోప్రా నటిస్తుందంటూ వార్తలు వచ్చాయి.

Pages