S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

12/18/2017 - 18:46

‘వెనె్నల’లో ప్రచురించిన ‘వివాదాల్లో పద్మావతి’ వ్యాసం సినీ నిర్మాతలకు కనువిప్పు కలిగించేదిగా వుంది. కానీ వారు కనులు తెరుస్తారా? అనేది సందేహమే! కాసుల కోసం చారిత్రక వ్యక్తుల జీవితాలను తమ ఇష్టం వచ్చినట్లు మార్చి చిత్రాలు తీసే నీచ నిర్మాతలున్నంత వరకు చరిత్ర పరిశోధకులకు, చిత్ర ప్రియులకు ఈ మనోవేదన తప్పదు.

12/18/2017 - 18:45

పోలీసులకు కూడా సాధ్యంకాని కేసులను సులభంగా పరిష్కరించే డిటెక్టివ్ పాత్ర ప్రధానాంశంగా విశాల్ నటించిన ‘డిటెక్టివ్’ సినిమా బాగుంది. ఇంటిలిజెంట్ స్క్రీన్‌ప్లేతో కూడిన ఇనె్వస్టిగేషన్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా చక్కని అనుభూతిని ఇస్తుంది. ఊహించని విధంగా మలుపులు తిరుగుతూ సాగే ఈ సినిమా ఆప్‌బీట్ సినిమాల పట్టికలో అగ్రస్థానంలో వుంటుంది.

12/18/2017 - 18:45

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రం మంచి ఫీల్‌గుడ్ మూవీగా నిలిచింది. తన బాల్యమిత్రుని కోసం, ప్రేమను సైతం వదులుకునే అభి పాత్రలో రామ్ నటన సూపర్బ్. ఈ సినిమా చూసిన తర్వాత స్నేహితులు ఒకరినొకరు మరింత అర్థం చేసుకునేట్లుగా వుంది ఈ చిత్రం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చాలా బాగుంది. రామ్‌కు స్నేహితుడిగా నటించిన శ్రీవిష్ణు సింపుల్‌గా నటించాడు.

12/11/2017 - 17:51

హీరో రాజశేఖర్ నటించిన పిఎస్‌వి గరుడవేగ చిత్రం వెండితెర వేగాన్ని పెంచింది. ట్రెండ్ మారినా రాజశేఖర్ స్టయల్ మారలేదని ఈ చిత్రం రుజు వు చేసింది. ముఖ్యం గా దర్శకుడి స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంది. సన్నీలియోన్ అందా లు ఆరబోసింది. మరీ ము ఖ్యంగా విశ్రాంతి ముందు ఛేజింగ్ సీన్ అభిమానులను అలరిస్తుందనుటలో అతిశయోక్తి లేదు. పతాక సన్నివేశాలు చిత్రానికే హైలెట్. హీరోయిన్ పూజాకుమార్ తన కళ్ళతో భావాలు పలికించింది.

12/11/2017 - 17:47

ముక్కామల కృష్ణమూర్తిగారు ప్రముఖ క్యారక్టర్, విలన్, నటునిగా రాణించిన మహానటుడు. వీరు 1952లో ‘మరదలు’ చిత్రంతో ఆరంభమై తదుపరి రాజుగా జగదేకవీరుని కథ, గుళేబకాళి కథ, నర్తనశాల చిత్రాలలో నటించారు. విశ్వామిత్రునిగా, దూర్వాస మహామునిగా పాత్రలు పోషించారు. అసాధ్యుడు చిఅతంలో విలన్ పాత్ర ఎంతో సమర్థవంతంగా రక్తికట్టించారు.

12/11/2017 - 17:46

బాల బాలికలే ప్రధాన పాత్రలతో అనేక చిత్రాలు నిర్మిం చి విజ యం సాధించిన చిత్రాలు మచ్చుతునకలుగా చెప్పవచ్చు. బాలమిత్రుల కథ, బాలరాజు కథ (1974), మాస్టర్ రాముగా పేరు పొందిన ఆనాటి బాలనటులలో పాపం పసివాడు, ఈనాటి లిటిల్ సోల్జర్స్, మురళీమోహన్ నటించిన ‘రామదండు’ పిల్లల చిత్రంగా అలరించింది.

12/11/2017 - 17:46

సినిమా రిలీజ్ ముందు ప్రచురించే తారల, దర్శకుల ఇంటర్వ్యూలల్లో అటు ఇటూ తిప్పి అవే ప్రశ్నలు, అవే జవాబులు ప్రచురిస్తూ బోర్ కొట్టిస్తున్నాయి అన్ని పత్రికలూ. ఈ చిత్రం హిట్ అవుతుందనుకున్నారా? ఎలాంటి చిత్రాల్లో నటిస్తారు? సినిమాల్లో చేరుతానంటే పేరెంట్స్ ఒప్పుకున్నారా? పెళ్లి ఎప్పుడు? ఇలాంటివే ప్రశ్నలన్నీ. జవాబులు కూడా హిట్ అనుకున్నా కాని ఇంత పెద్ద హిట్ అనుకోలేదు. నటనకు ఆస్కారమున్న చిత్రాలే చేస్తా.

12/11/2017 - 17:45

విమర్శించేవాళ్లు విమర్శించుకోండి, ఐడోం ట్ కేర్ అన్న ధోరణిలో రెండు కళ్ళూ లేనివాడు 70 కి.మీ వేగంతో పోతున్న ట్రెయిన్‌ని పరుగు పరుగున అందుకొని రైలెక్కడంలాంటి సీన్లతో రాజా ది గ్రేట్ అనిపించిన దర్శకుని ప్రతిభకు జోహార్లు. రాబోయే చిత్రంలో రెండు కాళ్లూ లేని హీరో కప్పలాగా దుముకుతూ విమానంలోకి గెంతి కప్పగెంతులతో విలన్లని తన్ని హీరోయిన్‌ని దక్కించునే సినిమా ఈ దర్శకుడే తీయాలి. చూసి ఆంధ్రులు తరించాలి.

12/04/2017 - 18:52

ఈ సినిమా పేరును చూస్తే గౌరవం కలుగుతుంది. ఇందులోని పెద్దమనుషులు అసలు పెద్దమనుషులు కారనే వ్యంగ్యం వున్నది. ‘పరమగురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాడయా’ అని పరమానందయ్య శిష్యులు సినిమాలో ఓ పాట ఉంది. గుడిని, గుడిలోని లింగాన్ని మింగే పెద్దమనుషులుగా సమాజంలో చెలామణి అయ్యేవారు అర్థశతాబ్దం క్రింద కూడా కలరని ఈ చిత్రం చెప్పింది.

12/04/2017 - 18:52

తప్పని తద్దినంలాగా బాలల చిత్రోత్సవాలు జరుపుతున్నారు గాని అవార్డులు విదేశాలే కొట్టుకుపోతున్నాయి. మన దేశానికి చాలా అరుదుగా అవార్డులు లభిస్తున్నాయి. మీరు బాలల చిత్రాలు తీయవచ్చు కదాని ప్రఖ్యాత దర్శకుడు బి.ఎన్.రెడ్డిని అడిగితే, ఏవో కొన్ని తప్ప ఇప్పుడు వస్తున్నవన్నీ బాలల చిత్రాలే కదా అన్నాడాయన!

Pages