S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

01/08/2018 - 19:54

హిందీ, తెలుగు చిత్రసీమలో మధురంగా పాడగలిగిన గాయకులెందరో వున్నా మధురాతిమధురంగా పాడి భాష ఉన్నంతకాలం సప్తస్వరాలు జీవించినంతకాలం బ్రతికే గాయక శిఖామణులు మహమ్మద్ రఫీ, మన ఘంటసాల అని ఘంటాపథంగా చెప్పవచ్చు. వీరిద్దరూ కనీసం షష్టిపూర్తి అయినా చేసుకోకుండా ఏదో సమయం మించిపోతోంది అని చిత్ర పరిశ్రమను, అభిమానులను వీడి వెళ్లిపోయారు.

01/08/2018 - 19:53

19 డిసెంబర్, మంగళవారం ఆంధ్రభూమి వెనె్నలలో బాబ్జి వ్రాసిన మధరమైన పాట పేరు మహమ్మద్ రఫీ హిందీ గానప్రియులను అలరించేలా ఉంది. సమ్మోహన గాయకుడు మహమ్మద్ రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన గానం అమరం. అప్పట్లో భాషాభేదం లేకుండా రేడియోలో రఫీ పాటలు ‘బినాకా గీత్‌మాలా’లో వినని శ్రోతలుండరు.

01/08/2018 - 19:52

2017 సంవత్సరంలో దాదాపు 200 తెలుగు సినిమాలు విడుదలవ్వగా పట్టుమని పది సినిమాలు కూడా ప్రజాదరణ పొందలేదు. వీటిలో గుర్తుంచుకోదగిన సినిమాలు అతి తక్కువ. ఒకప్పుడు మన తెలుగు సినిమాలు అద్భుత విజయాలు, అవార్డులు, రివార్డులతో విశ్వవిఖ్యాతి గాంచినాయి. అనేక సంవత్సరాల తర్వాత మన తెలుగు సినిమా ‘బాహుబలి’ జాతీయ పురస్కారం సాధించింది. ఇపుడు తెలుగు సినిమా నిర్మాతల, దర్శకుల ధోరణి చాలా మారిపోయింది.

01/08/2018 - 19:52

గతంలో సుధీర్‌బాబు, మారుతి కాంబినేషన్‌లో ‘ప్రేమకథా చిత్రమ్’ నచ్చింది. హారర్ కామెడీతో అదరగొట్టిన ఈ సినిమా తరహాలోనే థ్రిల్లర్ అన్నారు కదా అని ఈమధ్య వచ్చిన ‘కుటుంబ కథా చిత్రమ్’ పోస్టర్ చూసి సినిమాకెళితే పిచ్చిపట్టింది. ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించిన మహారాజశ్రీ దర్శకుడికి శతకోటి వందనాలు. ఆ టైటిల్ ఏంటో, ఆ సినిమా ఏంటో, ఆ కలల గోలేంటో అర్థమైతే ఒట్టు.

01/01/2018 - 18:57

మనిషికి 28 ఏళ్లు రాగానే పరిపక్వత, పరిపూర్ణత వస్తాయని తన తండ్రి చెప్పాడని దర్శకుడు వర్మ అన్నాడు. ఆ పరిపక్వతతోనే తన 28వ ఏట ‘శివ’ చిత్రం తీసి హిట్ కొట్టానని చెప్పాడు. ఇప్పుడు మరో 28 ఏళ్లు గడిచాయి కాబట్టి డబుల్ పరిపూర్ణతతో శివ-2 తీసి డబుల్ హిట్ కొడతానని వర్మ విశ్వాసం అట. ఇదేం లాజిక్కో మరి! 28 ఏళ్లు దాటాక మరింత పరిపక్వతతో చిత్రాలు తీసి ఉండాలి! కాని రెండు మూడు చిత్రాలు తప్ప అన్నీ ఢాం అన్నాయి.

01/01/2018 - 18:56

సినిమాలో హీరో విలన్‌ని పట్టపగలు నడిరోడ్డులో నరికేసినా పోలీసులు రారు. హీరోకు చట్టాలు వర్తించవు. పట్టించుకోడు. హీరో విశాల్ హఠాత్తుగా ప్రజాసేవ చేసేయాలని ఎన్నికల రంగంలోకి దూకి నామినేషన్ వేశాడు. బాబుగారికి నామినేషన్ ఫారం నింపడం రాదు. రూల్స్ తెలియవు. తెలియకపోతేనేం తను హీరో కదా. కాని సాక్షులుగా నియోజకవర్గానికి చెందని వ్యక్తులు సంతకాలు పెట్టేశారు. నామినేషన్ తిరస్కరించబడింది.

01/01/2018 - 18:56

మంగళవారం మణిహారాలుగా రెండు చిత్ర సమీక్షలు మంగళప్రదం చేశాయి. ఒకటి మాణిక్కేశ్వరిగారి శ్రీకృష్ణావతారం. ఇందులో రామారావుగారి విశ్వరూపం. ఇతర నటీనటులు పాత్రల పరిపూర్ణత, టి.వి.రాజుగారి రాజా లాంటి మధురమైన సంగీతం చిత్రానికి నిండుతనాన్ని నింపాయి. ఇక పౌరాణిక కావ్యమైన మాయాబజార్ గురించి రాయాలంటే పేజీలు సరిపోవు. ఇదొక పరిశీలనాత్మకమైన పరిశోధనా గ్రంథం.

01/01/2018 - 18:56

టీవీ చానెళ్లలో తెలుగు సినిమాలను, కీలక సన్నివేశాలను కూడా తొలగిస్తూ ప్రసారం చేస్తూండడం వలన కొనసాగింపు (కంటిన్యుటీ) దారుణంగా దెబ్బతిని అతుకుల బొంతలా తయారవుతున్నాయి. సమయాన్ని సర్దుబాటు చేసుకోవడం కోసం ఇలాంటి అవకతవకలకి పాల్పడటంకన్నా తక్కువ నిడివి వున్న సినిమాలనే ప్రసారం చేయడం మంచిది.
-ఎన్.మధుసూదన్‌రావు, హైదరాబాద్

01/01/2018 - 18:55

ఒకేసారి మూడు సంవత్సరాలకు నంది పురస్కారాలు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం. చిత్రసీమను కమ్మని ఆనంద డోలికలలో ఓలలాడించింది. లెజెండ్, బాహుబలి, పెళ్లిచూపులు ఉత్తమ చిత్రాలైనా- ఉత్తమ నటులు బాలకృష్ణ, మహేష్, జూ.ఎన్టీఆర్‌లు కావడం కమ్మని నిర్ణయం. పూవు పుట్టగానే కమ్మని పరిమళం వెదజల్లడం వంటి దే.

01/01/2018 - 18:55

తన కుమారుడు అఖిల్‌ని ఒక కోణంలో చూస్తే తన తండ్రిని చూసినట్టే వుందని నాగార్జున డబ్బా వాయించడం పబ్లిసిటీ స్టంటే! కొద్దికాలం క్రితం వరకు యుపీ ఎన్నికల ప్రచార సభల్లో తన సోదరుడు ఒక కోణంలో తన తండ్రి రాజీవ్ గాంధీలాగా కనిపిస్తున్నాడని రాహుల్ గురించి ప్రియాంక డబ్బా వాయించింది. కాని అతగాడు ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది.

Pages