S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

09/09/2018 - 01:31

సినిమా ఒక మాయాజాలపు పెట్టె. సిత్రాల్ని కూడా అబ్బో.. ఇది నిజమేమోనని భ్రమింపచేసేది! ఎన్ని సిత్ర ఇసిత్ర వేశాలు వేసేయాలో అన్ని చిత్ర విచిత్రాలు చేసే ఏకైక రంగం చలన చిత్ర రంగం! దర్శక నిర్మాతలు తయారుచేసిన సినిమా ముడి పదార్థమే యదార్థమని గుడ్డిగా నమ్మకం కలిగింపచేసి, ప్రేక్షక లోకాన్ని మాయలో పడదోసేది!

09/02/2018 - 00:52

**వందలుపెట్టి టిక్కెట్ కొనుక్కుని చూసే సినిమాకు కేంద్ర ప్రభుత్వం సెన్సార్ చేయించాలని నిబంధన విధించింది. సినిమాలకు సెన్సార్ అనేది బ్రిటీష్ వారు పరిపాలిస్తున్నప్పటినుంచి వుంది. వారెందుకు అటువంటి నిబంధన పెట్టారు? సినిమాలు మూకీలనుంచి టాకీలకు మారాయి. దేశానికి స్వతంత్రం కావాలనీ, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటామని ఉద్యమాలు జరుగుతున్నాయి.

08/26/2018 - 05:04

అభినయానికి అత్యంత ఆత్మీయులు, అనితర సాధ్యమైన నట విశ్వరూపానికి నిజ వారసులు తెలుగు వెండితెరను బంగారుతెరగా మార్చేసిన మహనీయ నటీనటులు. తెలుగు సినిమా ప్రపంచ సినిమా ముఖ చిత్రాన్ని అగ్రభాగం ఆక్రమించడానికి తొలి కారకులు... యస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, గుమ్మడి వంటి వారితోపాటు మరి కొందరున్నారు. సినిమా పాత్ర పోషణలో అఖండులు. సన్నివేశానుసారంగా సంభాషణలు తమదైన శైలిలో అద్భుతంగా పలుకగల ఉద్ధండులు.

08/20/2018 - 20:56

అమెరికాలో సెక్స్ రాకెట్ ఉదంతం గురించి ఇటీవల మీడియాలో వింటున్నాం. మన దిన పత్రికలు గాని, బుల్లితెరగాని నిజానిజాలు తెలుపవు. సెలబ్రెటీలు తప్పుచేసినా పూర్తి వివరాలతో బయటపెట్టవు. బుల్లితెర బతుకంతా సినీ రంగంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నది కనుక విషయాలు బహిర్గతం చేయదు.

08/12/2018 - 00:03

సినిమా ఇండస్ట్రీ కానే కాదు. ఇండస్ట్రీ అంటే దానికి ప్రభుత్వం లైసెన్స్ కావాలి. ఉద్యోగులకు, కార్మికులకు పండుగ సెలవులు, నెలజీతాలు, ఇంక్రిమెంట్లు, ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వడం వంటి నిబంధనలు వుంటాయి. ఉద్యోగ భద్రత వుంటుంది. మరి పరిశ్రమ అని పిలుచుకుంటున్న సినిమా నిర్మాణానికి ఇవి ఏమైనా వున్నాయా? లేవుకదా? మరి పరిశ్రమ అంటారేంటి?
‘రాజకీయాల తర్వాత అంతటి గందరగోళం సినిమాలే!’అన్నాడు ముళ్ళపూడి వెంకటరమణ.

08/05/2018 - 00:07

* పబ్లిసిటీలో వింత ధోరణి.. * టైటిల్ మాత్రమే తెలుగులో...

07/29/2018 - 05:05

సినిమా హాలులోకి ప్రవేశించిన ప్రేక్షకుడు తననుతాను మరచిపోయి స్వప్నలోకంలో విహరించాలని కోరుకుంటాడు. సినిమా కథలో నటిస్తున్న పాత్రలలో లీనమైపోతాడు. తనను ఆ పాత్రల ప్రవర్తనతో ఐడెంటిఫై అవుతాడు.

07/21/2018 - 22:44

============================================================

07/15/2018 - 04:43

రచయితలు కథలు, నవలలు రాస్తారు. పత్రికలకు పంపుతారు. ఎడిటర్లు తమ పత్రిక అభిరుచులకు, ఆశయాలకు అనుగుణంగా వుండి, పాఠకులను అలరిస్తుందని భావించిన రచనలను ప్రచురిస్తారు. పాఠకులను ఆకట్టుకున్న రచయితల కథల సంపుటాలు, నవలలు ప్రచురణకర్తలు పుస్తక రూపంలో మార్కెట్‌కి పంపిస్తారు. నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు పత్రికలు, పుస్తకాలు చదువుతారు.

07/08/2018 - 00:21

** సినిమాకు ప్రారంభం... ఇంటర్వెల్ బ్యాంగ్... క్లైమాక్స్... ఈ మూడూ పడికట్టురాళ్ళు! ఇవి కుదిరాయా కథనం ఆటోమాటిగ్గా అందంగా అల్లుకుపోతుంది. 24ఫ్రేమ్స్ అలవోకగా అమరిపోతాయి. సినిమా ఆబాల గోపాలాన్ని అలరించేలా అద్భుతంగా తయారైపోతుంది. అందుకే కథకుడు వీటిపైనే ఎక్కువగా దృష్టిసారిస్తాడు. ప్రారంభం అదిరిపడేలా రాసుకుంటాడు. అంటే ప్రేక్షకుల్లో ఆసక్తికలిగేలా మొదలుపెడతాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదరగొట్టేలా చూసుకుంటాడు.

Pages