S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం తార

12/18/2015 - 00:03

అక్షరహాసన్

12/11/2015 - 05:03

మిల్కీ బ్యూటీగా పేరున్న తమన్నా తాజాగా తనలో మంచి నటి వుందని నిర్ణయించే పాత్రలను ఎంచుకుంటోంది. ఇటీవల ఆమె ‘బాహుబలి’లో చేసిన పాత్ర అలాంటిదే. ప్రస్తుతం ‘ఊపిరి’, ‘బెంగాల్ టైగర్’ చిత్రాలలో అగ్ర హీరోల సరసన నటిస్తోంది. అయితే, సినిమాల్లోకి రావడం యాదృచ్ఛికంగా జరిగిందేనని, అసలు నటి అవ్వడం తనకు ఇష్టం లేదంటోంది. అదృష్టం అలా వుంటే ఏం చేస్తామని, అందుకే నటిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది.

12/04/2015 - 05:56

సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందిన గ్లామర్ భామ ఇలియానా బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మొదట్లో రెండు మూడు సినిమాలు చేసినా అవి కెరీర్ పరంగా ఏమాత్రం ఉపయోగపడలేదు. బాలీవుడ్‌లో అవకాశాలు దూరమయ్యాయి. దాంతో మళ్లీ సౌత్ సినిమాలో నటించేందుకు సన్నాహాలు మొదలుపెట్టిన ఈ భామకు ఇపుడు బాలీవుడ్‌లో మరో క్రేజీ అవకాశం దక్కింది.

11/27/2015 - 05:00

సహజంగా కమల్‌హసన్ సినిమా అంటే ఖచ్చితంగా ఓ ముద్దు సీన్ వుండడం ఖాయం. హీరోయిన్‌ను ఎంచుకోవడంలో కూడా కమల్‌హసన్ ఓ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాడు. ఆ అవకాశం ఎవరికొస్తుందా అని హీరోయిన్లు కూడా ఎదురుచూస్తుంటారు. అలాంటి అవకాశం ఈసారి మధుశాలినికి దక్కింది. చీకటిరాజ్యం చిత్రంలో తెలుగుమ్మాయి ముద్దు సన్నివేశంలో నటించి రికార్డు సృష్టించింది. ఈ విషయమై మధుశాలిని అడిగితే కథ కోసమే చేశానంటోంది.

03/18/2015 - 12:10

తెలుగు తెరపై అదృష్టాన్ని వెతుక్కుంటూ బెంగాల్ నుంచి ఎగిరొచ్చిన బంగారు బొమ్మ -మిస్తీ. అసలు పేరు -ఇంద్రాణి చక్రవర్తి. ముద్దుపేరు మిస్తీ. పేరుకు తగ్గట్టే తియ్యని అందం. -‘చిన్నదాన నీకోసం’ అంటూ వెతుక్కుంటున్న నితిన్‌తో ఫస్ట్‌టైం టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. వాస్తవానికి కెమెరాకు మిస్తీ కొత్తేం కాదు. ఏరికోరి సుభాష్‌ఘాయ్ ఎంచుకున్న కుందనపు బొమ్మే ఈ -‘కాంచి’.

Pages