S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం తార

01/29/2018 - 19:44

తమిళ, తెలుగు భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ సమంత పెళ్లి తరువాత కాస్త సెలెక్టివ్‌గా సినిమాలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆమె నటించిన సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా ఓ కన్నడ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సిద్ధమైంది. కన్నడంలో సంచలన విజయం సాధించిన యు టర్న్ చిత్రాన్ని రీమేక్ చేయాలని, దానికి సంబంధించిన రీమేక్ హక్కులను కూడా తీసుకుంది.

01/29/2018 - 19:39

మిగతా హీరోయిన్లలాగా తెరమీద గ్లామర్‌గా కన్పించడం అందాల నటి కీర్తి సురేష్‌కు నచ్చదట. తన శరీరాకృతి దానికి సరిపోదని ఆమె అభిప్రాయం. ‘‘నేను నిండుగా ఉంటేనే అందంగా కనిపిస్తాను. నా అభిమానులకు, ప్రేక్షకులకు కూడా నేను అలా ఉండడమే ఇష్టం. మోడ్రన్ డ్రెస్సుల కన్నా నాకు చీరలంటేనే ఎక్కువ ఇష్టం. నటన విషయంలో నాకు ఆదర్శం ఎవరూ లేరు. సినిమా ఫ్యామిలీ నుండి వచ్చాను. అమ్మ చేసిన సినిమాలు చూస్తూ పెరిగాను.

01/22/2018 - 19:25

‘‘తెలుగులో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. అనతి కాలంలో స్టార్ హీరోలతో చిత్రాలు చేసే అవకాశం లభించింది. ఇది నిజంగా నా అదృష్టమనే చెప్పాలి. పరిశ్రమకొచ్చిన అతి తక్కువ సమయంలోనే నాకు ఇలాంటి అవకాశాలు రావడం అంతకంటే ఆనందమేముంటుంది? ఒకసారి కలిసి పని చేసిన దర్శకుడు రెండోసారి పిలవడం అనేది గొప్ప గౌరవం. అటువంటి అవకాశం తెలుగులో నాకు ఇంకా రాలేదు. భవిష్యత్తులో తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నా.

01/22/2018 - 19:22

తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి రెండేళ్లయినా నిండకముందే వరుస అవకాశాలతో వెండితెరపై మెరుపులు కురిపిస్తోంది బ్యూటీ మెహరీన్. తొలి సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ (2016)లో మహాలక్ష్మిగా చక్కటి నటనను కనబరిచి అందరి మనసుల్ని గెలుచుకుంది. అమ్మాయి భలే ఉందంటూ విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురించారు. కథానాయికగా అలా పేరు తెచ్చుకున్నా, ఎందుకోగానీ అవకాశాలు మాత్రం పుంజుకోలేదు.

01/22/2018 - 18:55

‘్ఫదా’ సుందరి సాయిపల్లవి నా దారి నాదే అంటోంది. కథ నచ్చితేనే సినిమా. లేకపోతే లేదు అని గట్టిగానే చెబుతోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వద్దాం.. ఇటీవల దిల్ రాజు సినిమా ఒకటి వస్తే.. అందులో నటించడానికి నో చెప్పేసిందట. అవును నిజంగా నిజమేనంటున్నారు సినీవర్గాలు. ఈ విషయం గురించి సాయిపల్లవిని కదిలిస్తే- ‘అవును.. నా కెరీరే నాకు ముఖ్యం. నాకు నచ్చిన సినిమాలే చేస్తాను.

01/08/2018 - 20:09

అందాల ముద్దుగుమ్మ అంజలి కెరీర్‌లో ఇప్పటి వరకు పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసింది. తెలుగు, తమిళ భాషల్లో అటు సీనియర్, ఇటు జూనియర్‌లు అంటూ తేడాలేమీ పెట్టుకోకుండా, తను చేసే క్యారెక్టర్‌కే ప్రాధాన్యమిస్తూ అందరితో జోడీ కట్టింది. అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఈ సుందరాంగి వైవిధ్యమైన పాత్రల ద్వారా ఇటు తెలుగు, అటు తమిళంలోనూ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం అంజలి నటిస్తున్న తాజా చిత్రం ‘బెలూన్’.

12/11/2017 - 18:42

‘‘ఎన్నోసార్లు.. ఎన్నో విధాలుగా మనం నచ్చిన వాళ్లని ప్రేమిస్తూనే వుంటాం. అయితే మన ప్రేమ సక్సెస్ అయినప్పుడే నిజమైన ఆనందం. అలాంటి ఆనందాలు ఎప్పుడూ దొరకలేదు. ప్రేమలో ఐదుసార్లు నేను ఓడిపోయా. ప్రేమించానని చెప్పిన వాళ్లందరూ చివరికి మరోదారి చూసుకోవడంతో ఐదుసార్లు ఓటిమిని ఎదుర్కొన్నాను’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది నటి లక్ష్మీరాయ్.

12/11/2017 - 18:41

ఏంటి.. అప్పుడే నాకు పెళ్లి వయసు దాటిపోయిందా? ఎక్కడికి పోయినా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. వినీ వినీ బోర్ కొట్టేసింది. సల్మాన్‌ఖాన్‌ను అడిగినట్టు నన్ను అడుగుతారెందుకు? నేను ఒకప్పుడు అజయ్‌దేవ్‌గన్‌వల్లే నాకు పెళ్లి కాలేదని జోక్‌గా మాట్లాడితే, దాన్ని సీరియస్‌గా తీసుకుని సీరియల్ సీరియళ్లుగా రాసేశారు. కానీ చివరికి నేను దేనిగురించి మాట్లాడాను అన్నది అందరికీ అర్థమైంది.

11/20/2017 - 19:21

హాలీవుడ్‌లో ఆస్కార్ రేంజ్ ఫిలిం మేకర్ హార్వే విన్‌స్టీన్ ఏకంగా 40 మంది కథానాయికల్ని లైంగికంగా వేధించాడన్న వార్త విని ప్రపంచం విస్తుపోయింది. అలాంటి దుర్మార్గులు ఇంకా ఎందరో సినీ పరిశ్రమల్లో వున్నారన్న నిజం తెలిస్తే మరింతగా ఆశ్చర్యపోవడం ఖాయం. అంతెందుకు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఈ ప్రహసనం యథేచ్చగా సాగేదేనని మన కథానాయికలే లీక్ చేసేస్తున్నారు.

10/30/2017 - 19:54

దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఓ వైపు స్టార్ హీరోలతో నటిస్తూనే మరోవైపు కుర్ర హీరోలను వదలడంలేదు. అలాగే గత కొన్ని రోజులుగా దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం సాగిస్తున్న నయన, రహస్యంగా వివాహం చేసుకున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు జోరందుకున్నాయి.

Pages