S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మీకు మీరే డాక్టర్
అధిక ఉష్ణోగ్రత దగ్గర వండటం వల్ల అవి అనేక వ్యాధులకు కారణం అవుతాయి. ఆకుకూరలు, కాయగూరలు, పూల కూరలు కోమలంగా ఉంటాయి. వాటికి సరిపడినంత వేడి మీదే ఉండాలి. క్యాబేజీ అనేది లేత ఆకుల పొత్తి. చాలా కోమలమైనది. కుక్కర్లో పెట్టి వండితే అది కేన్సర్‌ను తెచ్చిపెట్టే విష పదార్థంగా మారిపోతుంది.
ఆహారం అంటే విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ వీటి గురించే ఆలోచిస్తుంటాం ఎప్పుడూ. అవీ ఉండాలి. అంతకన్నా ముఖ్యమైనవి కూడా భోజన పదార్థాల్లో ఉండాలి. వాటినీ మనం పట్టించుకోవాలి.
ఫోషక విలువలు తక్కువగా ఉండే పిజ్జాలు, ఫ్రెంచి ఫ్రైల్లాంటి జంక్ ఫుడ్స్ ఆకలిని చంపుతున్నాయా తీరుస్తున్నాయా అనేది మనం గమనించుకోవలసిన విషయం. కాసేపు భోజనం ఆలస్యం అయినప్పుడు ఓ కప్పు కాఫీ లేదా టీ తాగితే ఆకలి తీరుతోందా? లేదు. ఆకలి అణిగిపోతోంది, లేదా చచ్చిపోతోందని కూడా గమనించాలి. ఆకలిని చంపే వాటిని తీసుకుంటే అవి కడుపులో విషాలను వ్యాపింపచేస్తాయి.
హానికర ధ్రవ్యాలు కలపకుండా సురక్షితంగా వండిన వంటకాన్ని ‘ఆహారం’ అని నిర్వచనం ఇస్తే, మనం వండే తీరులో మార్పులకు అవకాశం ఏర్పడుతుంది.
కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు.. వెర్రెత్తి ఉన్నోళ్లు.. అనే పాటలో ఒక చరణాన్ని ఇలా చేర్చి పాడవచ్చు ‘ఆటపాట లేనోళ్లు వ్యాయామం మరిచినోళ్లు, ఝంక్ ఫుడ్లే తిని కంటి చూపే పోయినోళ్లు... అని!
ఫురాణ కాలంలో ఋషులు అడవుల్లో కందమూలాలు తిని జీవించే వారని మన గ్రంథాలు చెప్తున్నాయి. కందమూలాలు అంటే దుంపకూరలు. వీటినే గడ్డలని కూడా మన వాళ్లు పిలుస్తుంటారు. కంద దుంప, పెండలం దుంప, చిలకడ దుంప, చేమదుంప, బంగాళాదుంప, కేరెట్, బీట్‌రూట్, ముల్లంగి వీటినే మనం కందమూలాలు అంటున్నాం. పెండలం, కర్రపెండలం లాంటివి ఉన్నా అవి మనకు పెద్దగా మార్కెట్లోకి రావటంలేదు. దుంపకూరలు అంటే ఇవి మాత్రమే అని మనం అనుకోవటం సహజం.
పెనే్నరు దుంప హల్వా, టీ, పాయసం
అశ్వగంధ పేరుతో ప్రసిద్ధమైన ఈ మూలిక ఒక దుంప కూర. దీన్ని కూరగా వండుకోవటానికి అనుకూలంగా లేనప్పుడు దీనితో హల్వా చేసుకుంటారు. పాయసం కాచుకుంటారు. టీ కాచుకుని తాగవచ్చు కూడా! ఈ దుంపకు గుర్రం వాసన ఉంటుంది. అందుకని అశ్వగంథ అన్నారు. కూరగా తినటానికి అనుకూలత ఉండదు. సుగంధద్రవ్యాలు కలిపి స్వీట్లు తయారుచేసుకోవచ్చు. పాయసం, టీ కాచుకోవచ్చు!
ఆయుర్వేధ గ్రంథాల్లో దీన్ని లైంగిక శక్తిని పెంచే ద్రవ్యాలలో ఒకటిగా (ఎఫ్రొడిజియాక్స్) చెప్తారు. బలకరమైన ఔషధాల్లో ఒకటి. ఇంకా ఇతర ఔషధ ప్రయోజనాలు కూడా దీనికున్నాయి. శరీరానికి సుఖంగా ఉండే పరిస్థితిని కలిగిస్తాయి. అనీజీగా, నలతగా ఉన్నదనిపించటం దీని వలన తగ్గుతుందన్నమాట. ముఖ్యంగా క్షీణింపజేసే వ్యాధుల్లో దీన్ని ఔషధంగా ప్రయోగిస్తారు.
పురాణ కాలంలో ఋషులు అడవుల్లో కందమూలాలు తిని జీవించే వారని మన గ్రంథాలు చెప్తున్నాయి. కందమూలాలు అంటే దుంపకూరలు. వీటినే గడ్డలని కూడా మన వాళ్లు పిలుస్తుంటారు. కంద దుంప, పెండలం దుంప, చిలకడ దుంప, చేమదుంప, బంగాళాదుంప, కేరెట్, బీట్‌రూట్, ముల్లంగి వీటినే మనం కందమూలాలు అంటున్నాం. పెండలం, కర్రపెండలం లాంటివి ఉన్నా అవి మనకు పెద్దగా మార్కెట్లోకి రావటంలేదు. దుంపకూరలు అంటే ఇవి మాత్రమే అని మనం అనుకోవటం సహజం.