S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

07/16/2016 - 22:22

అంజన్నా!
మట్టిలోంచి వచ్చిన మాణిక్యానివి నీవు
పొలం గట్టున పరిమళించిన మొగలి పువ్వువి నీవు
కూడులేని వారి కోసం
గుడ్డలేని వారి కోసం
గూడులేని వారి కోసం
పాట కట్టిన ప్రజాకవివి నీవు
పాట పాడిన ప్రజా గాయకుడివి నీవు
నీ జీవితమంతా
చీకటితో పోరాటం
నీ బ్రతుకంతా
పాటై ప్రవహించింది
గుడిసెల్లోని జనం కోసం
నీవు కలం పట్టావు

07/16/2016 - 21:34

జీవితం అంటే డబ్బు కాదు. కానీ జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డబ్బు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పుడు డబ్బే జీవితమని ఎవరైనా అనుకుంటే చాలా ప్రమాదం. అలా ఆలోచించిన వ్యక్తులు డబ్బు సంపాదించే క్రమంలో తమ జీవితాన్ని కోల్పోతారు. డబ్బు కత్తిలాంటిది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే అది ఉపయోగపడుతుంది. లేకపోతే గాయం చేస్తుంది. ఈ విషయాలను గుర్తు పెట్టుకుని డబ్బుని సంపాదించాలి.

07/16/2016 - 21:28

ప్రాణాయామం గురించి చాలామంది గురువులు ఎన్నో విషయాలని చెబుతున్నారు. అది ప్రాణాయామం కావొచ్చు. అనులోమ్, విలోమ్ కావొచ్చు. సుదర్శన క్రియ కావొచ్చు. ఇవన్నీ గాలి పీల్చుకోవడం గురించిన వ్యాయామాలు. ఈ గాలి పీల్చుకునే వ్యాయామం వల్ల రక్తపోటు తగ్గుతుంది. మధుమేహ వ్యాధి దూరమవుతుంది. కాన్సర్ లాంటి వ్యాధులు కూడా రావు. ఈ ప్రక్రియ వల్ల మన శరీరంలోని అన్ని కణాలు ఆరోగ్యవంతంగా ఉండి మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి.

07/10/2016 - 00:16

భూగోళంపై మానవాళి మనుగడ రోజురోజుకీ కష్టమైపోతోంది. జనవిస్ఫోటనమే అందుకు కారణమని దశాబ్దాల క్రితమే నిర్ధారించారు. అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతున్న జనాభా అన్ని అనర్థాలకు మూలకారణం. జనసంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంవల్ల ఆర్థిక, సామాజిక, వైద్యఆరోగ్య రంగాల్లో ప్రజల మధ్య వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయి. పేదలు తట్టుకోలేని కష్టాల్లో కూరకుపోతూంటే సంపన్నులు మరింత ఎదుగుతున్నారు.

07/09/2016 - 23:24

‘నాన్నా! ఖాళీ అగ్గిపెట్టెలతో ఇల్లు కట్టడానికి సహాయం చేస్తానన్నావు. ఇప్పుడు చేస్తావా?’ పల్లవ్ అడిగాడు.
‘నువ్వు సిద్ధంగా ఉంటే చేద్దాం’ తండ్రి జవాబు చెప్పాడు.
ఆయన తన బల్ల మీద ఉన్న అన్నిటినీ తీసేసి, జిగురు, రంగు కాగితాలు, కత్తెర తెచ్చి కొడుకుతో చెప్పాడు.
‘ఇప్పుడు ఖాళీ అగ్గిపెట్టెలని తీసుకురా’
వాటిని తన బల్ల మీద ఉంచి అడిగాడు.

07/09/2016 - 23:21

రాఘవాపురం అడవిలో కోతులు, పులులు, జింకలు మరెన్నో జంతువులతోపాటు ఒక సింహం నివసిస్తుండేది. ఆ సింహాన్ని అడవికి రాజుగా ఎంచుకున్నాయి జంతువులు. ఏ సమస్య వచ్చినా సింహానికి చెప్పేవి. సింహం తగు విచారణ చేయించి సమస్యను పరిష్కరించేది.

07/09/2016 - 22:16

ప్రతిఫలాలు రెండు రకాలుగా ఉంటాయి. వీటి కారణంగానే మనుషులు చర్యలకు దిగుతారు. అవే అంతర్గత ప్రతిఫలాలు, బహిర్గత ప్రతిఫలాలు. అంతర్గత ప్రతిఫలాలంటే మనకు ప్రేరణ కల్గించే సంతోషాలు, గుర్తింపులు, ప్రేమ, అవగాహన, సంతృప్తి, ప్రశాంతత, ఆమోదం మొదలయినవి. దీర్ఘకాల ప్రేరకాలుగా ఈ అంతర్గత ప్రతిఫలాలు విశేషంగా ఉపయోగపడతాయి.

07/09/2016 - 21:21

ఈ ప్రపంచంలో ఎన్నో రుగ్మతలను
ఉచితంగా నయం చేయగల ఏకైక ఔషధం
- మీ చిరునవ్వు

07/09/2016 - 21:15

పువ్వులు చిన్నపిల్లల్లా సున్నితంగా ఉంటాయి. పువ్వులని ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. దేవుడికి కూడా పూలు ఇష్టమే. ఆయనకి ఇష్టమో కాదో మనకు తెలియదుగానీ దేవుడిని పూలతో అలంకరిస్తాం. ఆరాధిస్తాం. ప్రేయసికే కాదు భార్యకి పూలని కానుక ఇస్తే వాళ్లు ఆనందిస్తారు. చాలామంది కవయిత్రులు తమ మొదటి కవితా సంపుటాలకి పుష్పాల అర్థం వచ్చే పేర్లు పెట్టుకున్నారు.

07/03/2016 - 00:50

ఒక చాకలి ఒక్కొక్క షర్ట్, దుప్పటి, జీన్స్, చీరని ఉతకాలి. ప్రతీది ఉతికి ఆరేయటానికి పధ్నాలుగు నిమిషాలు పడుతుంది. షర్ట్ ఆరటానికి ఒక గంట పదకొండు నిమిషాలు పడుతుంది. దుప్పటి ఆరటానికి రెండు గంటల ఇరవై నిమిషాలు పడుతుంది. జీన్స్ ఆరటానికి మూడు గంటల ఆరు నిమిషాలు పడుతుంది. చీర ఆరటానికి ఇరవై ఏడు నిమిషాలు చాలు. ఒకేసారి అన్నీ బట్టలు ఆరిన తరువాత తీసుకొని ఎటువంటి జాప్యం లేకుండా ఇంటికి వెళ్లాలి అనుకున్నాడు.

Pages