S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

08/28/2016 - 01:01

టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అటు తర్వాత కోలీవుడ్‌లోనూ తన సత్తాను చాటుకున్న అందాలతార అనుష్క ప్రస్తుతం తెరపై పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఎన్నో ఉత్తమ చిత్రాలు.. మరెన్నో వైవిధ్యమైన పాత్రలు.. ఇలా ఒకటేమిటి ఎన్నో..ఎనె్నన్నో విజయాలు సాధించి అగ్రతారగా వెలుగులు విరజిమ్ముతూనే వుంది. తెలుగులో మంచి పాపులారిటీ రాగానే చాలామంది తారలు బాలీవుడ్‌వైపు తొంగిచూస్తారు.

08/28/2016 - 01:00

వైవిధ్యమైన పాత్రలు.. అంతకంటే చాలెంజింగ్ రోల్స్ అంటే నటి నిత్యామీనన్‌కు భలే ఇష్టం. ఇలాంటి పాత్రలే నటికి మంచి కెరీర్‌తో పాటు అంతకంటే చక్కటి ఇమేజ్‌ను తెచ్చిపెడతాయని ఈ బ్యూటీ నమ్మకం. టాలీవుడ్, కోలీవుడ్ అంటూ రెండు పడవల ప్రయాణాన్ని సునాయాసంగా చేస్తూ రెండు చోట్లా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎంచుకుంటున్న చిత్రాలు..చేస్తున్న బ్యానర్లు..

08/28/2016 - 00:30

వైఫల్యం లక్ష్య సాధనలో ఒక అడుగు అని అంగీకరించాలి.
* మీరు ఆశించినది దక్కనపుడు విచారించడంకన్నా మరొక ఉన్నతమైనది మీకు దక్కేందుకే మీరు ఆశించినది మీకు దక్కలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
* ఎప్పుడూ ఏ ప్రయత్నాన్ని వదలకూడదు.
* మీరు మీరుగా ఉండాలి. ఇతరుల సానుభూతి చూపులకు చలించిపోకూడదు.

08/28/2016 - 00:20

అభినందన్ తను రాసే పేపర్ని నలిపి, లేచి వెళ్లి చెత్తబుట్టలో పడేసి, మళ్లీ వచ్చి కూర్చున్నాడు. ఇంకో కాగితం తీసుకుని మళ్లీ ఏదో రాయడం గమనించిన తల్లి అడిగింది.
‘ఏమిటి? ఇందాకటి నించి కాగితాలతో కుస్తీ పడుతున్నావు?’

08/27/2016 - 23:13

భారతదేశం ఎంతోమంది మహాపురుషులకు, సాధువులకు, స్వాములకు నిలయం. దక్షిణా పథంలో ఒక గ్రామంలో ఒక స్వామి చిన్ననాటనే వెలుగులోకి వచ్చారు. క్రమంగా ఆయన కీర్తి రాష్ట్రం ఎల్లలు దాటి, దేశం నలుమూలలా వ్యాపించి, ఆఖరికి ప్రపంచం నలుమూలలా విస్తరించింది. వారి మహిమలు అపారం. అందువలన వారికి దేశీయ, విదేశీయ భక్తులు పెక్కులుండేవారు. కాపాడమని వారిని ఆశ్రయించేవారు.

08/27/2016 - 22:35

డైరీలు రాసే అలవాటు చిన్నప్పుడు ఎక్కువగా ఉండేది. ఉద్యోగ బాధ్యతల్లో పడిన తరువాత తగ్గిపోయింది. కాని రాస్తే బాగుండునని అన్పిస్తుంది. ఉద్యోగంలో చేరినప్పుడు రాసిన పేజీ మాత్రం ఉండిపోయింది. న్యాయవాదిగా ఉండి న్యాయమూర్తిగా పరిణామం చెందిన క్రమం అందులో కనపడింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లభించింది.

08/27/2016 - 22:34

మనిషి జీవితం విచిత్రమైనది.. యవ్వనంలో సమయం, శక్తి ఉంటుంది
కానీ డబ్బు ఉండదు. మధ్యవయసులో అయితే డబ్బు, శక్తి ఉంటాయి
కానీ సమయం ఉండదు
వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉన్నా.. కష్టపడే శక్తి ఉండదు.

08/21/2016 - 05:45

ఎవ్వరూ మిమ్మల్ని నమ్మడం లేదనిపించినపుడు నిరుత్సాహపడవద్దు. ముందు మిమ్మల్ని మీరు నమ్మడం అలవరచుకోండి.
అందుబాటులో వున్న వనరులతో మీరు ఏమి చేయగలరో ఆలోచించుకుంటూ ఊహాలోకాల్లో విహరించక మీరు ఏమి చేస్తారో నిర్దిష్టంగా నిర్ణయించుకోండి.

08/21/2016 - 05:11

పూర్వం విష్ణు భక్తుడైన సుఫల రాజ్యానే్నలే హరికేతుడనే రాజుకి పిల్లలు లేకపోవడమనే కొరత తప్ప మరే కొరతా లేకుండా ఉండేది. రాజుగారు అనేక పూజలు, హోమాలు చేయగా సంతృప్తుడైన విష్ణువు ఒకనాడు రాజుగారి కలలో సాక్షాత్కరించి నీ తోటలో అన్నిటికన్నా మేటియైన మధుర ఫలమును రాణి మధూలికతో తినిపించిన యెడల సంతానప్రాప్తి కలుగుతుందని వరమొసగాడు.

08/21/2016 - 04:48

బత్తాయిలు అమ్మేవాడు ఇలా అమ్మసాగాడు. విడిగా కొంటే కాయ రూపాయి, ఐదు డజన్లు కొంటే 20 ఉచితం, రెండు డజన్లు కొంటే 7 ఉచితం, ఒక డజను కొంటే 3 ఉచితం, అర డజను కొంటే 1 ఉచితం. సోము 133 కాయలు కొనాలంటే ఎలా కొంటే ఎక్కువ ఉచితంగా తక్కువ రేటులో పొందవచ్చు? ఒక్కొక్క బత్తాయి రేటు ఎంత?

Pages