S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

11/06/2016 - 00:13

బ్రహ్మ కొడుకు కుశుడు విదర్భ రాజకుమారిని పెళ్లి చేసుకున్నాడు. వారికి కుశాంగుడు, కుశనాభుడు, అధూర్త రాజశుడు, వసువు అనే నలుగురు కొడుకులు పుట్టారు. కొడుకులు నలుగురు నాలుగు పట్టణాలని నిర్మించి పాలనని చేపట్టారు. కుశాంగుడు కౌశాంబి నగరాన్ని, కుశనాభుడు మహోదయపురాన్ని, అధూర్త రాజశుడు ధర్మారణ్యం అనే నగరాన్ని, వసువు గిరివ్రజపురాన్ని నిర్మించారు. మనం ఉన్నది గిరివ్రజపురం.

11/05/2016 - 23:52

జీవితంలో వేగం పెరిగిపోయింది. రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియకుండా రోజులు గడిచిపోతున్నాయి. ఇది అందరూ అంటున్న మాట. ఇది సరైందేనని చాలామంది అంటూ ఉంటారు.
మనం నాలుగు లైన్ల రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రయాణం చాలా వేగంగా ఉంటుంది. మనం ఏదీ గమనించే అవకాశం ఉండదు. అలా కాకుండా రెండు వాహనాలు వెళ్లే రోడ్డులో ప్రయాణం చేస్తున్నప్పుడు అంత వేగం ఉండదు. చుట్టూ చూస్తూ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.

11/05/2016 - 23:41

మనం సుఖంగా ఉండటానికి అత్యంత సులువైన మార్గం
ఇతరులు సుఖంగా జీవించేట్లు చేయడమే!

11/05/2016 - 22:37

విద్యార్థులను ఎప్పుడూ బెదిరించకూడదు. ఎటువంటి శిక్షలూ విధించకూడదు. మీరు చేయదలచుకోని పర్యవసానాలను చేసి చూపిస్తానని విద్యార్థులను హెచ్చరించకూడదు.
* విద్యార్థులు తాము నేర్చుకున్న విజ్ఞానాన్ని ‘యధార్థ జీవితంలో’ ఎలా వినియోగించుకోవాలో నేర్పాలి. దానికి తగినంత సమయం తీసుకోవచ్చు.

10/30/2016 - 00:20

ఒక పాఠశాల టెన్త్‌లో 19.2 శాతం పరీక్ష తప్పారు. అయితే ఈ ఫలితాన్ని సాధించడానికి, ఆ పాఠశాల టెన్త్‌లో కనీస విద్యార్థుల సంఖ్య ఎంత?

జవాబు: 96

10/30/2016 - 00:17

కోకిల ఎలా పాడుతుంది? దాని పాట గురించి తెలుగు కవులు ఎన్నో పాటలు రాశారు. కవిత్వం చెప్పారు. గొంతు నుంచి బయటకి వచ్చే శబ్దం సిరింక్స్ అనే వాయిస్ బాక్స్ నుంచి వస్తుంది. కోకిల చిన్న పక్షి. మన చేతిలో ఇమిడిపోయేటంత. అయినా దాని స్వరం చాలా దూరం వరకు విన్పిస్తుంది. అవి కూత కూసేటప్పుడు గొంతులోని కండరాల్లో మార్పులు వస్తాయి. గాలిని తీసుకోవడాన్నిబట్టి గొంతులో హెచ్చుతగ్గులు ఉంటాయి.

10/29/2016 - 23:55

రాజయ్యకి కుక్కలంటే ఉన్న ఇష్టం కొద్దీ తమ ఇంట్లో ఒక కుక్కను పెంచుకోసాగాడు. దాని పేరు రాజి. అది చాలా తెలివైనది. పైగా దానికి ఆ వీధిలో ఏ ఇంట్లో దొంగలు పడ్డా పసిగట్టే శక్తి ఉంది. దాంతో దొంగ ఆ వీధిలోకి చొరబడగానే కనిపెట్టి గట్టిగా అరిచేది. అది విని భయపడి పారిపోయేవాడు దొంగ.

10/29/2016 - 23:41

శిలాజాల సిద్ధాంతాన్ని మొదట కనుగొన్నది నికోలస్ స్టెనో. దీనిపై ఆయన సిద్ధాంత పత్రం ‘ప్రోడ్రోమస్’ 1669లో నమోదయింది. ఆధునిక భూగర్భ శాస్త్రం అభివృద్ధికి ఆయన సిద్ధాంతం మార్గదర్శకంగా ఉంది.

10/29/2016 - 23:37

ఎనిమిదో రోజు కూడా ఆశే్లష రామాయణ హరికథని వినడానికి రామాలయానికి వెళ్లాడు. హరికథని ఆయన ఇలా కొనసాగించాడు.
‘నిన్న మీకు ఇరవై ఎనిమిది, ఇరవై తొమ్మిది సర్గల కథని చెప్పాను. ఆ తర్వాతది వినండి. విశ్వామిత్రుడు రాముడి ప్రశ్నకి ఇలా జవాబు చెప్పాడు.

10/29/2016 - 23:04

సంగీత మూర్తి త్రయమైన త్యాగరాజు, శ్యామశాస్ర్తీ, ముత్తుస్వామి దీక్షితులు సంప్రదాయ సంగీత వికాసానికి మూల పురుషులు. వీరికి ముందూ సంగీతం ఉంది. వాగ్గేయకారులున్నారు. కానీ ఈ ముగ్గురికీ ఒక ప్రత్యేకత ఉంది.
ఈ ముగ్గురూ తంజావూరు ప్రాంతానికి చెందినవారే.
సంప్రదాయ సంగీతం ఇలా ఉండాలి - అని లోకానికి చెప్పేందుకే వీరు పుట్టారేమో అనిపిస్తుంది.

Pages