S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

11/12/2016 - 20:35

మన జీవితంలోకి ఎంతమంది వచ్చినా.. ఎన్ని సిరులు వచ్చినా అన్నం పెట్టిన వారినీ.. అన్నిటికీ నేను ఉన్నా నీవు ముందుకు వెళ్లు అని ధైర్యం
ఇచ్చిన వారినీ.. ఆశ్రయం ఇచ్చిన వాకిలిని ఎప్పటికీ మరువకూడదు.

11/12/2016 - 19:50

బలవంతంగా ‘మార్పు’ను మీరు అంగీకరించేందుకు ముందుగానే ‘మార్పు’నకు మీరు స్వాగతం చెప్పగల్గితే అదే ‘మార్పు’ను మీరు అంగీకరించే ఉత్తమ సమయం.
మానవ జీవితంలో ‘మార్పు’ అనేది అనివార్యంగా వస్తూ ఉంటుంది. పైగా తరచుగా వస్తుంది. ఇది చాలా భయంకర మనిపిస్తుంది. జీవన విధానంలో ఈ మార్పునకు అనుగుణంగా మారగలగాలి. ఈ మార్పును అంతర్గతంగాను, బహిర్గతంగాను కూడా అంగీకరించి తీరాలి.

11/12/2016 - 19:45

‘ఓ బ్రహ్మర్షీ! హిమవంతుడి పెద్ద కూతురు, లోకపావని ఐన గంగ మూడు మార్గాల్లో ఎందుకు ప్రవహిస్తోంది? గంగ మూడు లోకాల్లో ఎందుకని ఉత్తమమైంది? దయచేసి చెప్పు’ రాముడు ప్రశ్నించాడు.
విశ్వామిత్రుడు దానికి ఇలా జవాబు చెప్పాడు.

11/12/2016 - 19:43

ఒక విదేశీ ఎగుమతిదారుడు, తన సెక్రటరీకి ఇలా చెప్పాడు. ‘ఒక్కొక్క పెద్ద అట్టపెట్టెల్లో ఎన్ని బొమ్మలను పెడతారో, అన్ని అట్టపెట్టెల్లోనే మొత్తం 259081 బొమ్మలు పెట్టాలి’ ఎలా చేస్తావో నాకు తెలీదు? దిగుమతి చేసుకునేవాళ్లు అలా అయితేనే పంపమని షరతులు పెట్టారు. మర్చిపోవద్దు. జాగ్రత్త. ముందు పేపర్ వర్క్ చేసి, నాకు చెప్పాకే ప్యాకింగ్ పని మొదలుపెట్టాలి.

11/12/2016 - 19:38

సాయంత్రం నాలుగైంది. స్కూలు ఆటో అపార్ట్‌మెంట్ ముందు ఆగింది. ఐదవ తరగతి చదివే దివ్య తన లంచ్ బ్యాగ్, బుక్స్ బ్యాగ్ తీసుకుని వెళ్లబోతూ ఆటోలో వున్న తన స్నేహితులకు టాటా చెప్పింది.

11/12/2016 - 19:24

పిల్లల చదువులు మాతృభాషా మాధ్యమంలోనే మొదలు కావాలని ఎందరో విద్యావేత్తల అభిప్రాయం. కానీ మన దేశంలో ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు తప్పనిసరి అనర్థంగా పాతుకుపోయేయి. అందులోనూ చదువులు మొదలుపెట్టే పసిపిల్లలచే ఈ పాఠశాలలో వల్లె వేయిస్తున్న రైమ్స్ బ్రిటిష్ పుస్తకాల నుండి అరువు తెచ్చుకున్నవి. మన దేశ సంస్కృతి, ఆలోచనలకు ఏ మాత్రం సరిపోనివి.
ఉదాహరణకు కొన్ని ఇంగ్లీష్ రైమ్స్ చూద్దాం.
బా బా బ్లాక్ షీప్

11/12/2016 - 19:13

జీవితమొక రహస్యం. ఎప్పటికీ అంతుచిక్కని రహస్యం. అర్థవంతంగా జీవించడం అందరికీ సాధ్యం కాదు. అలా జీవించే వాళ్లని రుషులనవచ్చు. సన్యాసులనవచ్చు. వాళ్లు ఎక్కడో అరణ్యాలలో వుండరు. మన మధ్యే ఉంటారు. మనుషుల్ని పరిశీలిస్తే మనకు మానవోత్తములు కనిపిస్తారు. కొందరు ముఖాలు వేలాడేసుకుని ఉంటారు. కొందరు ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారు. కొందరిలో సంతృప్తి కనిపిస్తుంది. కొందరిలో అసంతృప్తి కనిపిస్తుంది.

11/06/2016 - 23:59

ఇప్పటికి 600 కొత్త గ్రహాలను కనుగొన్నారు. వాటిలో ఏదైనా భూమిని పోలి ఉందా? ఈ రంగంలోని అగ్రగామి సంస్థ సెటి (సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్) రేడియో టెలిస్కోప్‌ల సహాయంతో భూమిని పోలిన గ్రహాల గురించి అనే్వషించడం ప్రారంభించారు. ఈ టెక్నిక్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయి.

11/06/2016 - 23:56

కనకాపురంలో రామయ్య అనే బీద రైతు ఉండేవాడు. ఒకప్పుడు చాలా పొలాలు ఉండి బాగా బతికినవాడే అయినా, చదువు రాక, కామందు చేతిలో మోసపోయి, కూలి రైతుగా మిగిలాడు. కొడుకు బాబీ అయినా బాగా చదువుకుని పైకి రావాలని రామయ్య ఆశ.
బాబీ తెలివైనవాడే అయినా తండ్రి మాట వినేవాడు కాదు. సోమరి. అందువల్ల చదువు సరిగ్గా వొంటబట్టలేదు. అలా అని తండ్రికి చేదోడువాదోడుగా ఉంటాడా అంటే అదీ లేదు.

11/06/2016 - 23:54

ఒక రవాణా సరకు డెలివరీ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యానికి, 42 గ్లాసులు పగిలిపోయాయి. అవి ఆ వ్యాన్‌లో ఉన్న సరకులో 8 శాతం. అయితే ఆ వ్యాన్ బయలుదేరేటప్పుడు మొత్తం ఎన్ని గ్లాసులు పెట్టారు?

జవాబు: 42/8న100 =525

Pages