S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

11/20/2016 - 00:29

సంపద పెరిగే కొద్దీ ధనవంతుడివి మాత్రమే అవుతావు.
సంవత్సరాలు పెరిగే కొద్దీ ముసలివాడివి మాత్రమే అవుతావు.
కానీ మంచితనం పెరిగే కొద్దీ మనిషిగా మారుతావు.

11/20/2016 - 00:20

ఆశే్లష మళ్లీ ఆ ఆదివారం హరికథ వినడానికి రామాలయానికి వెళ్లాడు. ఆయన చెప్పసాగాడు.
‘ఇవాళ ముప్పై తొమ్మిదో సర్గ నుంచి నలభై రెండో సర్గ దాకా చెప్తాను. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి గంగావతరణం గురించి చెప్తున్నాడు.
దేవతల మాటలు విని బ్రహ్మదేవుడు వారితో ఇలా చెప్పాడు.

11/20/2016 - 00:16

8.5 తి 7.5 సెం.మీ. ఒక ఫొటోను పెద్దగా చేయాలి. 8.5 ఉన్నచోట 27.2 సెం.మీ. పెంచాలి, అయితే 7.5 సెం.మీ. వైపు పొడవు ఎంతకు పెంచాలి?

జ: 27.2 తి 7.5/8.5 = 24 సెం.మీ.

11/20/2016 - 00:15

మహారాజావారి సంస్థానంలో కొడుకు శివయ్యకి ఉద్యోగం అయిందని తెలిసి తెగ సంబరపడిపోయాడు సాంబయ్య.

11/20/2016 - 00:11

భారతీయ చలనచిత్రరంగం రూపురేఖలను తీర్చిదిద్దిన ఘనుడు దాదాసాహెబ్ ఫాల్కె. ఆయన రూపొందించి విడుదల చేసిన చిత్రం ‘రాజా హరిశ్చంద్ర. ఈ చిత్రం 1913లో విడుదలైంది. సరిగ్గా వందేళ్ల తరువాత దానికి గుర్తుగా 2013లో ఓ అవార్డును కేంద్రం ప్రకటించింది. అదే ‘సెంటనరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటి’.

11/19/2016 - 22:28

సుశ్రుత ఆచార్యుడు - శస్త్ర చికిత్సకు తండ్రి. (క్రీ.పూ.600) సుశ్రుతుడు కేవలం శస్త్ర చికిత్సకే కాకుండా ప్లాస్టిక్ సర్జరీకి కూడా తండ్రి అనిపించుకున్నాడు. ముక్కును సరిచేయటం కోసం నుదుటి మీద ఒక చర్మపు ముక్కను తీసి, వేసి అతడు చేసే ప్లాస్టిక్ సర్జరీ చాలా నైపుణ్యంతో కూడినది. ఆ కాలంలో నేరానికి శిక్షగా కోసివేయబడిన ముక్కలను తిరిగి సరిదిద్దటం ఒక పనిగా చేసేవాడతను.

11/19/2016 - 22:25

తెలివితేటలు ఒకరితో ఒకరిని పోల్చలేనివి. ఎన్నో రకాల పక్షులను చూస్తూ ఉంటాం. కానీ రామచిలుకలు, కాకులు అతి తెలివైనవని తేలింది. రామచిలుకలు మనుషుల భాషను అర్థం చేసుకుని పలుకుతూ ఉంటాయి. అందుకే చిలుక పలుకులు అన్న నానుడి వచ్చింది. కాకులు తెలివైనవే. రామచిలుకలు 100 రకాల రంగులను, ఆకారాలను గుర్తించగలవు. పరిశోధనల ప్రకారం న్యూకలెడోనియన్ కాకి రామచిలుకలంత తెలివైనదని తేలింది. ఇటువంటి పక్షులు సమస్యలను సృష్టించగలవు.

11/19/2016 - 21:35

పైకి కన్పించే మనిషి కంటే లోపల మనిషి భిన్నంగా ఉండవచ్చు. లోపలి మనిషి అంతర్ముఖమే మనిషి వ్యక్తిత్వానికి ప్రతిబింబం. ఎవరి వ్యక్తిత్వం వారిది. ఒకరి వ్యక్తిత్వానికి మరొకరి వ్యక్తిత్వానికి పోలిక ఉండదు. పరిస్థితులు, పరిసరాలు, మనిషి వ్యక్తిత్వాన్ని మార్చేస్తూ ఉంటాయి. ఫలానా వ్యక్తిత్వంగల వ్యక్తి ఫలానాగా ప్రవర్తిస్తాడని కచ్చితంగా చెప్పడం సాధ్యంకాదు.

11/19/2016 - 21:29

కష్టపడి సంపాదించింది ఎప్పుడూ విలువైందే. అక్రమంగా ఆర్జించింది ఎప్పుడూ అన్యాయమైందే.
మన శ్రమతో సంపాదించిన ఏదయినా మనకు సంతృప్తి నిస్తుంది. ఇతరుల్నించి దోచుకున్నదెపుడూ మనశ్శాంతి నివ్వదు.
పేదవాళ్లున్నంత నిర్మలంగా సంపన్నులుండరు.
గురునానక్ వున్న రోజుల్లో పంజాబ్‌లోని ఎమ్ముబాద్‌లో ఒక సంపన్నుడు ఉండేవాడు. అతను ఉన్నత వంశంలో జన్మించాడు. అతను ఆ ప్రాంతానికి మంత్రిగా పని చేశాడు.

11/12/2016 - 20:51

ఎంత వయస్సు వచ్చినా, నడవడం కష్టంగా వున్నా చావాలని ఎవరూ కోరుకోరు. మరణం దానంతట అదే రావాలి. కానీ కొంతమందిని మరణం సులువుగా పలకరిస్తుంది. మరి కొంతమందిని చాలా ఇబ్బంది పెడ్తుంది. వాళ్లనే కాదు వాళ్ల పిల్లలని కూడా ఇబ్బంది పెడుతుంది. అందుకే పెద్దవాళ్లు తరచూ ఒక మాట అనేవాళ్లు. ఎవరితో సేవ చేయించుకోకుండా మరణించాలని. కాని ఇది ఎవరి చేతిలోనూ లేదు. మరణం ఎందుకు కొంతమందిని వేధిస్తుందో, బాధిస్తుందో అర్థంకాదు.

Pages