S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జనమేజయుడు

ఏది ఇజం? ఏది నిజం? ఏది నాయకత్వం? ఏది కపటత్వం?
నిజమైన నేతకు ఇజాలతో సంబంధం లేదు... నిజాలతోనే అనుబంధం...
సిద్ధాంతాలతో సంబంధం ఉండదు... నీతిబద్ధమైన జీవనంతోనే మమేకం!
అలాంటి నాయకుడు వచ్చేశాడు. మామూలుగా కాదు. జంఝామారుతంలా.. పట్టుకుందామన్నా
అందనంత వేగంతో.. అందుకోవాలని చూసినా అందనంత ఎత్తులో.. చిరుదరహాసంతో నిలిచాడు.
ఆ వేగానికి ఇజాల పొరలు తొలగిపోయాయి. బూటకపు మేలిముసుగులు ఎగిరిపోయాయి.
భారత సమాజాన్ని పొరలుపొరలుగా, దొంతర్లు దొంతర్లుగా పేరుకుపోయిన పంకిలం ఆ ప్రవాహ
వేగానికి కొట్టుకుపోయింది. పద్మం విరిసింది. రాజకీయ సింహనాదం చేసింది. ఆ నాదంలో పేదల
గుండెచప్పుడు ఉంది. సమాజాన్ని పీడిస్తున్న చోద్యాలు, జాఢ్యాల అంతుచూసే పదును ఉంది.
వ్యవస్థను ఆమూలాగ్రం పునీతం చేసే ఆర్తి ఉంది. సగటు భారతీయుడి ఆక్రోశం ఉంది.
దశాబ్దాలుగా అణిగిపోయి, అణగారిపోయిన వారి జీవితాల్లో నవోదయాన్ని వికసింపజేయాలన్న
అంతర్గత ధ్వనీ ఉంది. ఆ ధ్వని ఆయనదే. ఆ యిజం ఆయనదే. ఆ వడీ, ఒరవడీ ఆయనదే...
- ఆయనే నరేంద్ర మోదీ!
ఓసామాన్యుడు అసామాన్యుడయ్యాడనడానికి ప్రతీక ఆయన.. ఓ అట్టడుగు జీవితం అనన్య సామాన్యమైన కీర్తిని గుప్పిట పట్టిందనడానికి నిలువెత్తు సాక్ష్యం. అది నేటి భారతీయతకు ప్రతిరూపం. నిండైన నిజాయితీకి నిలువెత్తు రూపం. ఐదుగురు మెరికల్లాంటి వారినిస్తే అద్భుతాలు సృష్టించి చూపిస్తానన్నాడు వివేకానందుడు. నిజాయితీ, నిబద్ధత, అంకిత భావంతో పాటు చేయాల్సిన పని పట్ల, సాధించాల్సిన కార్యం పట్ల తదేక దృష్టి ఉంటే, దూరతీరాలను సునాయాసంగా చేరుకోవచ్చునని నిరూపించిన వాస్తవవాది మోదీ.
భారతదేశ చరిత్రలో ఇలాంటి నేతలు అరుదుగానే ఉంటారు. చిరుదివ్వె కొండంత వెలుగన్నట్టు అనాటి అంధకారాన్ని వారి తేజోమయ జీవితాలు తరిమికొట్టాయి. వెలుగుదారులు తీస్తూ, విలువల పూలు పూయిస్తూ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరమైన గుణాత్మక మార్పులకు ఉద్దీపన అయ్యాయి. భారతీయతత్వం గురించి, భారతీయత గురించి, భారత దేశ ఔన్నత్యం, సామాజిక సమానత్వ భావనల గురించి వేనోళ్ల కీర్తిస్తున్నామంటే.. దశాబ్దాలు, శతాబ్దాలు దొర్లిపోతున్నా.. ఆ విలువల వెలుగుల్ని ఆస్వాదిస్తున్నామంటే అవి వారి జీవితాలకు నేటికీ తేజస్సును అందించడమే. విత్తు మొక్కగా, వృక్షంగా, మహా వృక్షంగా శాఖోపశాఖలైనట్టుగా వారి జీవితాల్లోని వెలుగు విత్తనాలే సామాజిక చైతన్యానికి ఆయువు పట్టు అయ్యాయి. ఇలాంటి వారి సంఖ్య చరిత్ర గతిలో వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యలోనే ఉంటుంది. అయినా సువిశాల భారతావని జగజ్జేయతకు అవే పునాదులు. వారి జీవితాలే ఆయువు పట్టు కూడా. అలాంటి వ్యక్తులు నేటి కాలంలో ఉంటారా. తానే జనంగా, జనమే తానుగా, వారి క్షేమమే ఊపిరిగా, వారి బాగే తన భాగ్యంగా భావించే నేతను వేలల్లో ఉన్న నేతల్లో ఒక్కడినైనా కనిపెట్టగలుగుతామా? ఇజాల ముసుగులో, సిద్ధాంతాల మేలి ముసుగులో అసలు రూపును దాచుకుని మేడిపండు చందంగా విలువల్ని వల్లిస్తూ, రాజకీయాలను శాసిస్తూ, అందులోని లోపాలనే మనుగడ సోపానాలుగా మార్చుకునేవారే అడుగడుగునా కనిపిస్తారే తప్ప ఒక్క అభ్యుదయ నాయకుడు కానరాడు. జనం కోసం బతికే ప్రజల మనిషి కనిపించడు.
సామాజిక మేడిపండు అంతర్గత రూపును బహిర్గతం చేసే నిజాయితీ అత్యంత ఆరుదైన లక్షణం. జీవితంలోని అన్ని కోణాలు చూస్తేనే నిజమైన జీవితం అవుతుంది. మెరుగు పెట్టే కొద్దీ బంగారం వనె్నలీనినట్టు జీవన పోరాటంలో ఆరితేరితేనే అసలైన సిసలైన జీవితం తెలుస్తుంది. జీవన సౌరభం అవగతమవుతుంది. మనం భ్రమల్లో పడి ఎంతగా నష్టపోయామో.. ఇజాల ముసుగులో నిజాలను ఎలా గుర్తించ లేకపోయామో కళ్లకు కడుతుంది.
తీసేస్తే కాలుపోతుందని భావించి వ్యాధిని ముదరబెట్టుకోలేం. ఈ శస్త్ర చికిత్సను జాప్యం చేస్తే కాలే కాదు, కాలేయమో పనికి రాకుండా పోతుందన్నది మోదీయిజం. అందుకే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లే అయినా ఆయన విజయాలు అనితర సాధ్యం. ఆయన చర్యలు జనం మెప్పుకోసం తీసుకున్నవి కాదు. ఎవరినో ఒప్పించడానికి చేపట్టినవని అంతకంటే కాదు. ఆ నిర్ణయాల వెనుక భారతీయుడి బాగు భావన ఉంది. జనాభాలో రెండో స్థానం ఉన్న మనం ఎందుకు చిన్న దేశాలనూ అధిగమించలేక పోతున్నామన్న తపన ఉంది. వందలాది దేశాలకు కలగానే మిగిలే నిండైన యువశక్తి మనదేనన్న ధీమా ఉంది. ఆశయం ఎంత బలమైనదైనా, దాన్ని సాధించి తీరాలన్న పట్టుదల ఎంత పటుతరమైనదైనా అందుకు అధికారమే ఆయుధం కావాలి. ప్రోత్సాహమనే ఊతం కావాలి. అన్నింటికీ మించి ప్రతి మాటలోనూ, చేతలలోనూ నిజాయితీ దేదీప్యం కావాలి. ఇవన్నీ ఉంటే గురువు లేకుండానే ఏకలవ్యుడు అర్జునుడ్ని మించిపోయినట్టు.. దాటగలనా లేదా అన్న నైరాశ్యాన్ని తోటివాళ్ల ప్రోత్సాహంతో వీడి సముద్రాన్ని సునాయాసంగా ఆంజనేయుడు దాటేసినంత సులభంగా వ్యవస్థలో మార్పులు తీసుకురాగలుగుతారు. ఈ అవకాశాన్ని, ప్రోత్సాహాన్నీ 2014 ఎన్నికల్లో భారత దేశ ప్రజలు మోదీకి అందించారు.
మోదీతో విజయమా.. అది సాధ్యమేనా అన్న సీనియర్ల మాటలు తూటాలుగా పొడిచినా అవేవీ ఆయన ఆశయాన్ని దెబ్బతీయలేదు. మరింత బలోపేతం చేశాయి. నాటి ఎన్నికల్లో మూడోసారీ అధికారం తమదేనన్న ధీమా కాంగ్రెస్‌ది. భావసారూప్యత ఎరతో మిగతా పార్టీలను కలుపుకుని తృతీయాన్ని అందలం ఎక్కించాలన్న తరగని పట్టుదల వామపక్షాలది. అందినట్టే అందుతూ అందకుండా పోతున్న ప్రధాన మంత్రి పదవిని అందిపుచ్చుకోవాలన్న అధికార కాంక్ష ములాయం తదితరులది. అయినా బిజెపి తరపున ఒకే ఒక్కడు బరిలోకి దిగాడు. అద్వానీ తదితర సీనియర్ నేతల ప్రాపకం లేకపోయినా కనీస పక్షంగా వారి మద్దతూ కొరవడినా వ్యవస్థ లొసుగులపై ఏకపక్ష యుద్ధానికి దిగాడు. అది మామూలు యుద్ధం కాదు. చేతిలో ఒకే ఒక్క ఆయుధం. అది నిజాయితీ అనే వజ్రాయుధం. ఆవల మోహరించింది దశాబ్దాలుగా భారతీయ రాజకీయ, ఆర్థిక వ్యవస్థను శాసించి అందులోనే రాణించిన నాయకమ్మన్యులు. దేశాన్ని ఏలిన పార్టీలు. రాష్ట్రాలను కంచుకోటలుగా మలుచుకున్న బలమైన ప్రాంతీయ పార్టీలు. అయినా మోదీ బెదరలేదు. వెరవలేదు. నెగ్గగలనా అన్న భయాన్ని, సందేహాన్నీ దరిచేరనివ్వలేదు. ఆ నిరుపమానతే మోదీకి వజ్రతుల్యమైంది. జనంలోంచి వచ్చిన నేత కావడం వల్ల జనం భాషే మాట్లాడాడు. మనం మనం మాట్లాడుకుంటున్నామా అన్నట్టుగా నేల నలుచెరగులా చొచ్చుకు పోయాడు. ప్రాంతమేదైనా, రాష్టమ్రేదైనా, నియోజకవర్గం ఎంత గొప్ప నాయకుడిదైనా సరే... మోదీ సమ్మోహన శక్తి ఫలించింది. వైరి పార్టీల నిస్సారతను, వాటి మాటల్లోని నీతి బాహ్యతను మోదీ ఎండగట్టాడు.
ఒక నాయకుడి అద్వితీయత అన్నది అతని మాటల్లో కంటే కూడా చేతల్లోనే కనిపిస్తుందన్నది మోదీయిజం. ఎందుకంటే 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు అతి సాధారణ స్థాయి నుంచి నిరుపమాన నేతగా మోదీ ఎదగడానికి కారణం విషయ స్పష్టత భారతదేశ సమస్యలు, సవాళ్లపై లోతైన అవగాహన ఉండటంతో పాటు దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలన్న దానిపై వాస్తవికతతో కూడిన ఆలోచనలను ఆవిష్కరించగలగడం. ఇవన్నీ కూడా నరేంద్ర మోదీని ఓ నేతగానే కాకుండా
ఓ నాయకుడిగా వర్తమాన భారతదేశ చరిత్రలో సరిసమానులంటూ లేని అద్వితీయ మహానాయకుడిగా నిలబెట్టాయి.
ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యంలో ఇటు విలువలను, అటు వ్యక్తిత్వాన్ని నరనరాన జీర్ణించుకున్న నరేంద్ర మోదీ అదే స్థాయిలో తన ఆలోచనలను సైతం ఆచరణాత్మకం చేశారు. దేశంలో ఏ పార్టీ నాయకత్వమైనా విజయమే పరమావధిగా పనిచేస్తుంది. కానీ మోదీ ఆలోచన అది కాదు. ఆశయబలం ఉంటే దాన్ని జనం మెచ్చితే అంతకుమించిన విజయం మరొకటి ఉండదన్నది ఆయన భావన. అందుకే అధికారం చేతిలో వున్నా ఆయన జనంపై తాయిలాల వర్షం కురిపించలేదు. వారి క్షేమం, సంక్షేమమే పరమావధిగా పనిచేశారు. అందుకు నిదర్శనం ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో తీసుకున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాలే. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ భారత రాజకీయాల్లో అత్యంత కీలకమైన రాష్ట్రం. కేంద్రంలో ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే ముందుగా యుపి కుంభస్థలాన్ని కొట్టాలి. అంటే - అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం. అదేవిధంగా 80 వరకు ఉన్న లోక్‌సభ స్థానాలను గరిష్ఠ స్థాయిలో కైవసం చేసుకోవడం. ఈ రెండు లక్ష్యాలు నెరవేరాలంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ అతిపెద్ద రాష్ట్రంపై వరాల జల్లే కురిపిస్తుంది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నమే చేస్తుంది. కానీ మోదీ ఆ మార్గంలో ముందుకు వెళ్లలేదు. మామూలు రాజకీయ నాయకత్వానికి విరుద్ధంగా, దాని ఆలోచనకే అందని రీతిలోనే బలమైన ఆర్థిక సంస్కరణ బీజాలు వేశారు. ఎకాఎకిన పెద్దనోట్లను రద్దుచేయడమన్నది మామూలు విషయం కాదు. ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించినా ఏ రాజకీయ నాయకుడైనా వాయిదా వేసుకునే నిర్ణయమే అది. కానీ దేశ ఆర్థిక వ్యవస్థను కకావికలు చేస్తున్న నల్లధన భూతాన్ని అథఃపాతాళానికి అణచివేయాలంటే అవినీతి విషవృక్షాన్ని కూకటివేళ్లతో సహా పెకలించి వేయాలంటే పెద్దనోట్లను రద్దుచేయడమే ఏకైక మార్గమనుకున్నారు. ఈ నిర్ణయం వల్ల యుపి ఎన్నికల్లో, అలాగే దాంతోపాటు జరగనున్న మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా దెబ్బతింటామన్న ఆలోచన కంటే కూడా దేశానికి ఎవరూ చేయని మేలు చేస్తున్నామన్న బలమైన భావనే ముందుకు నడిపించింది. ఉన్నపళంగా కరెన్సీ చెల్లదని చెప్పడం, అతి సామాన్యుడు మొదలుకుని సంపన్నులను సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చే నిర్ణయమే. కానీ మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయం వెనుక వర్తమాన జీవన వాస్తవాలున్నాయి. 130 కోట్లు దాటిన జనాభాలో సంపద కేవలం కొందరి చేతుల్లోనే ఎందుకు పేరుకుపోయిందో చెప్పడానికి ప్రత్యేకంగా కారణం అవసరం లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి అధికారం, అవినీతే జతకట్టి ఆర్థిక స్వారీ చేయడం వల్ల పేదలు పేదలుగా, సంపన్నులు మరింత సంపన్నులుగా మిగిలిపోయారే తప్ప దేశ ఆర్థిక వృద్ధికి జరిగిన మేలేమీ లేదు. ఇవన్నీ కూడా జనం నుంచి వచ్చిన మోదీ మనసులో నాటుకుపోయాయి. ‘నేను చాయ్‌వాలా’నంటూ నిస్సంకోచంగా చెప్పుకున్న మోదీకి సంపన్నుల జాతకాలు తెలుసు. పేదల బతుకుల వెనుకవున్న నిజాలు తెలుసు. అందుకే పెద్దనోట్లపై వేటు వేశారు. రాజకీయ లబ్ధిని పక్కనపెట్టి దేశ హితాన్ని, ఆర్థిక పటిష్ఠతను కేంద్రకంగా చేసుకునే చారిత్రక రీతిలో ముందుకు వెళ్లారు. మంచి జరుగుతుందంటే జనం మెచ్చుకుంటారు. ఆ మంచి తమకోసమేనంటే మరింతగా ఆదరిస్తారు. నిజానికి పెద్దనోట్ల రద్దును జనం వ్యతిరేకిస్తే మోదీ పరిస్థితి ఈవిధంగా ఉండేది కాదు. కానీ ఆయన నిర్ణయం వెనుకవున్న నిజాయితీని దేశ ప్రజలు గుర్తించారు. ఆర్థికపరమైన కాయకల్ప చికిత్స చేస్తే తప్ప వ్యవస్థ బాగుపడదన్న ఆయన మాటలనూ విశ్వసించారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఎంతగా మోదీపై బురద చల్లినా, ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టినా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని హెచ్చరించినా కూడా ప్రజలు ఖాతరు చేయలేదు. అందుకు నిదర్శనం ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపికి సొంతంగా 312 అసెంబ్లీ సీట్లను అందించడమే. మిగతా రాష్ట్రాల్లో కూడా అనూహ్య రీతిలో పట్టం కట్టడమే. పెద్దనోట్లు రద్దయిన తర్వాత కూడా స్థానికంగా పలు రాష్ట్రాల్లో ఎన్నో ఎన్నికలు జరిగాయి. వాటన్నింటిలోనూ బిజెపి రాణించింది. కాంగ్రెస్ సహా అన్ని ప్రధాన పార్టీలు మట్టికొట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. దశాబ్దాలపాటు ఇటు కేంద్రంలోనూ, అటు రాష్ట్రాల్లోనూ తిరుగులేని అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఇది మింగుడుపడని పరిస్థితే. ఇటు స్థానిక ఎన్నికల్లోనూ మోదీ ప్రభంజనమే. రాష్ట్రాల ఎన్నికల్లో అనూహ్యమైన సునామీ తరహా విజృంభణే. ఈ తరహాలో జనం నుంచి వచ్చిన నాయకుడ్ని, జనం మెచ్చిన నాయకుడ్ని ప్రతి ఒక్కరూ తమలో ఒకడిగా భావించిన ప్రజా నాయకుడ్ని ఇంతవరకూ ఏ దేశ చరిత్రలోనూ చూడలేదంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఆర్థికంగా దేశం బాగుంటేనే రాజకీయంగా సుస్థిరంగా ఉంటేనే ప్రగతి బాటలో కొత్త పుంతలు తొక్కగలుగుతాం. ఈ వాస్తవాన్ని తొలినాడే గుర్తించిన మోదీ భారతదేశాన్ని అన్నివిధాలుగా బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ఆలోచనలకు తెరతీశారు. మనం చేసుకోవాల్సింది దిగుమతులు కాదు అంటూ మేక్ ఇన్ ఇండియా భావనను బలంగా పాదుకొల్పారు. తాను జరిపిన ప్రతి విదేశీ పర్యటనను ఇందుకు అనువుగా మార్చుకున్నారు. భారత్ మారుతోంది. పెట్టుబడులతో తరలివస్తే లాభాలతో తిరిగి వెళ్లవచ్చునంటూ బలమైన ఆశావహ సందేశాన్ని అందించారు. విదేశాల్లో మోదీ చేసిన ప్రసంగాలు భారత్‌లో వచ్చిన మార్పులను ప్రపంచ దేశాల కళ్లకు కట్టాయి. ప్రపంచ వేదికలపై ఆయన ఆవిష్కరించిన ఆలోచనలు ప్రతి ఒకరినీ ఆలోచింపజేశాయి. భారతీయతను, భారత తత్వాన్ని, సంప్రదాయక విలువలను విశ్వజనీనం చేయడమే కాకుండా అనాదిగా భారత సంప్రదాయంగా కొనసాగుతూ వచ్చిన యోగాను అంతర్జాతీయ ఆరోగ్య సాధనంగా మార్చారు. ఐక్యరాజ్య సమితి యోగా దినోత్సవాన్ని ప్రకటించిందంటే దాని వెనుక మోదీ చేసిన కృషి, ప్రపంచ ఆరోగ్యానికి అందించిన చేయూతేనని చెప్పక తప్పదు. మోదీ ప్రసంగిస్తున్నారంటే ప్రపంచ దేశాధినేతలు ఎంత ఆసక్తిగా వింటారో, ఆయన ఆలోచనలకు ఎంతగా ప్రాధాన్యతనిస్తారో చెప్పడానికి నిదర్శనాలెన్నో.
విశ్వవేదికలపై రాణించిన మోదీ దేశంలో జన హృదయ నేతగా, వారి భాషలోనే వారి హృదయాల్లోకి చొచ్చుకువెళ్లారు. ఇది మామూలు నాయకుడికి సాధ్యమయ్యేది కాదు. ఓ దార్శనికుడికి మాత్రమే సుసాధ్యమయ్యే ప్రక్రియ. రాజకీయాలతో ప్రతిదాన్నీ ముడిపెట్టకూడదు. ఉండాల్సిన చోట కఠినంగా ఉండాలి. ఉదారంగా ఉండాల్సిన చోట ఉదారంగానే ఉండాలి. ఇది నరేంద్ర మోదీ తరహా రాజకీయ లక్షణం. ఏవిధంగా చూసినా ఎవరికీ సాధ్యం కాని విలక్షణ వ్యక్తిత్వం. అందుకే ఆయన జనం మెచ్చిన నాయకుడు. ప్రపంచం గుర్తించిన నాయకుడు. కఠిన నిర్ణయాలు తీసుకున్నా అవి తమ మంచికోసమేనని ప్రజలు సహృదయంగా స్వీకరించి ఆదరించిన అధినేత.
*
సామరస్యమే... విదేశాంగ విధానం!
భారతదేశ విదేశాంగ విధానం అలీన తత్వంతో కూడుకున్నది. అంటే నొప్పించక తానొవ్వక అన్నది దీని జీవనాడి. 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం తిరుగులేని మెజార్టీతో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మోదీ వేసిన తొలి అడుగు విదేశాంగ రీతికి సానబెట్టడమే. తనదైన శైలిలో దానికి మరింత వనె్న తీసుకురావడమే. అంతకుముందెన్నడూ లేని విధంగా సార్క్ దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులను తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించడం ద్వారా మోదీ తానేమిటో, తన ఆశయమేమిటో, తాను వేయబోయే అడుగు ఎలాంటిదో చూచాయగా తెలిపారు. అంతకుముందు వరకు పాకిస్తాన్‌తో ఉన్న విభేదాలను పక్కనబెట్టి ఆ దేశ ప్రధానిని కూడా తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించి సరికొత్త సామరస్య శకానికి నాంది పలికారు. ఇరుగు పొరుగు దేశాలే ఒక దేశ అంతర్గత శాంతిభద్రతలను నిర్దేశిస్తాయి. చుట్టూ ఉన్న దేశాల్లో నిరంతరం సమస్యలే తాండవిస్తే వాటి ప్రభావం కచ్చితంగా ఇతర దేశాలపై పడుతుంది. ఈ నిజాన్ని గుర్తించిన మోదీ ఇరుగుపొరుగు దేశాలన్నింటితో మైత్రీబంధానికి, సామరస్యపూర్వక వ్యాపార వాణిజ్య అనుబంధానికి శ్రీకారం చుట్టారు. భారత్‌ను వ్యతిరేకించే దేశాలు సైతం మోదీ మార్క్ రాజనీతిజ్ఞతకు ఔరా అంటూ ముక్కున వేలేసుకున్నాయి. విదేశాంగ విధానం అంటే దేశానికి అన్నివిధాలుగా ప్రయోజనాన్ని అందించేదే కావాలి. వైరాన్ని పక్కనపెట్టి సామరస్యాన్ని పెంపొందించగలగాలి. దీన్ని తొలి అడుగుతోనే సాధించిన మోదీ ఈ రెండున్నరేళ్ల కాలంలో అప్రతిహత రీతిలోనే ముందుకు తీసుకువెళ్లారు. అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు అన్ని దేశాల నేతలనూ విశేషంగా ఆకట్టుకున్నారు. భారత్‌తో మైత్రి తమకెంత అవసరమోనన్న వాస్తవాన్ని ఆ దేశాలు గుర్తించేలా చేశారు. మైత్రీబంధానికి చిన్నా పెద్ద దేశం అన్న భేదం ఉండకూడదు. అందుకే సంపన్న దేశాలతో ఎంతగా మైత్రిని కాంక్షించారో అటు సుదూర దేశాలతోనూ అదే స్థాయి అనుబంధాన్ని పెంపొందించుకున్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ప్రధాని చేపట్టనన్ని విదేశీ పర్యటనలను అతి తక్కువ వ్యవధిలో మోదీ చేపట్టడానికి కారణం భారత్ మారుతోందన్న సంకేతాలు ఇవ్వడమే. అందుకు సంబంధించి దౌత్యపరమైన వారధిని బలంగా నిర్మించారు.
యాస... ప్రాస!
వాగ్ధాటి, వాక్చాతుర్యం ప్రధాని మోదీకి నిలువెత్తు ఆభరణాలు. ఆయన ప్రసంగిస్తే ఉరుములు మెరుపులే. ప్రతి మాటా ఓ తూటా. వర్తమానాన్ని ఎంత అద్భుతంగా జనం భాషలో ఆవిష్కరించగలుగుతారో అంతే పదునైన రీతిలో విపక్షాల తీరును ఎండగట్టగలుగుతారు. మోదీ మాట రెండువైపులా పదునున్న కత్తి అనడం అతిశయోక్తి ఏమీ కాదు. మూడేళ్ల క్రితం నాటి లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన మోదీ ఎంత పదునైన రీతిలో తన వాక్‌బలాన్ని ప్రదర్శించారో తాజాగా జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థాయిలో విపక్షాల వెన్ను విరిచారు. ఇక అధికారం తమదేనని భుజాలు ఎగరేసిన ప్రాంతీయ పార్టీలు కంగుతిని కూలబడ్డాయి. ఇటు రాహుల్, అటు ప్రియాంకను రంగంలోకి దింపి యుపి కుంభస్థలాన్ని కొట్టాలన్న కాంగ్రెస్ ఆశల కోటలు కూడా కుప్పకూలిపోయాయి. అందుకు కారణం మోదీకున్న ఆశయబలం. ఆయన మాటకు జనం ఇచ్చే తిరుగులేని ఆదరణ. యుపి చరిత్రలో ఇంత భారీ పరిమాణంలో అసెంబ్లీ సీట్లను సంపాదించుకోవడమన్నది ఏ పార్టీ కలలో కూడా ఊహించని విషయం. దాన్ని అత్యంత సునాయాసంగా మోదీ సాధించారు. అదీ జనంలోకి వెళ్లి జనమేజయుడు రాణించారు. మోదీ విజయం వెనుక ఈ రెండున్నరేళ్ల పాలనాపరమైన నిజాయితీ ఉంది.
పాక్‌తో దౌత్యనీతి
భారత్, పాకిస్తాన్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. మంచి మనసుంటే దాన్ని మించిన స్థాయిలో సామరస్యాన్ని పెంపొందించుకునే విజ్ఞతాయుత మనస్తత్వం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. కరడుగట్టిన శత్రువును సైతం మనసు కరిగే మిత్రుడిలా మార్చుకోవచ్చు. మోదీ వచ్చిన తర్వాత పాక్ విషయంలో భారత్ ఆలోచనే మారింది. అతి మెతకగా పోకుండా, అతి దురుసుగానూ పోకుండా సమతూకమే సామరస్య బలమన్నట్టుగా మోదీ తన దౌత్య నీతిని ప్రదర్శించారు. వీలైన ప్రతిసారీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ఏదోవిధంగా మాట్లాడటం ద్వారా రెండు దేశాలూ సంఘర్షించుకోవడం వల్ల ప్రయోజనం లేదన్న నిజాన్ని నిగ్గుతేల్చారు. పాక్ తన తప్పును తెలుసుకునేలా చేయడమే మోదీ నీతి. అవకాశమున్న ప్రతిసారీ పాక్ గడ్డపై మోదీ అడుగుపెట్టారు. రెండు దాయాది దేశాలు సమత, సామరస్యంతో మెలగాలే తప్ప ఘర్షణ, సంఘర్షణే ధ్యేయంగా మారకూడదన్న బలమైన సందేశాన్నీ అందించారు. ఇది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం.

- బి. రాజేశ్వర ప్రసాద్