S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘మార్పు’ను స్వాగతించే ప్రేరణ పద్ధతులు

బలవంతంగా ‘మార్పు’ను మీరు అంగీకరించేందుకు ముందుగానే ‘మార్పు’నకు మీరు స్వాగతం చెప్పగల్గితే అదే ‘మార్పు’ను మీరు అంగీకరించే ఉత్తమ సమయం.
మానవ జీవితంలో ‘మార్పు’ అనేది అనివార్యంగా వస్తూ ఉంటుంది. పైగా తరచుగా వస్తుంది. ఇది చాలా భయంకర మనిపిస్తుంది. జీవన విధానంలో ఈ మార్పునకు అనుగుణంగా మారగలగాలి. ఈ మార్పును అంతర్గతంగాను, బహిర్గతంగాను కూడా అంగీకరించి తీరాలి.
‘మార్పు’ అనేది ఒక యధార్థం. దీనిని తప్పించుకోలేము. పట్టించుకోకుండా ఉండలేము. అందుకే బలవంతంగా మార్పును మీచే అంగీకరింపజేసే ముందే దానిని మీరు స్వాగతించడానికి అనువైన సమయంగా గుర్తించి ఆమోదించాలి.
ముఖ్యంగా కొంత అనుభవం కలిగిన వారు, నడి వయసులోని వారు మార్పును ప్రతిఘటిస్తారు. ఎందుకంటే ఈ మార్పు వారిలో ఆతృత, ఒత్తిడి, కొంత శారీరక అనారోగ్యాన్ని కల్గిస్తాయి. మార్పు అనేది తరచుగా చోటు చేసుకోవడం మనలో చాలామందికి అయిష్టంగా ఉండి అనిశ్చితి సృష్టిస్తుంది.
అందుకే ఈ మార్పు మీలో అలజడి సృష్టించక ముందే దానిని మీరు సానుకూల వైఖరితో చూడాలి. రాబోయే రోజుల్లో మార్పు వస్తుందనగానే మీ మానసిక వైఖరిని అనుకూలంగా మార్చుకుని అది విసిరే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధులుగా ఉండాలి. పర్యవసానాలు ఏమిటనేవి ఆలోచించనవసరం లేదు.
మీకు మీరు ప్రేరణ కల్గించుకోవాలి
* మీలో ఉండే వ్యతిరేక ధోరణులు, ఓడిపోతున్నామనే భయాలను పక్కకు నెట్టాలి. అంతరాత్మ చెప్పే ఇటువంటి హెచ్చరికలను వినకండి.
* మార్పు అంటే ఎప్పుడూ భయపడకండి.
* కొత్త విషయాన్ని మీరు నిర్వహించేటప్పుడు, ఎన్నో భయంకరమైన ఇబ్బందులు ఎదురవుతాయని మానసికంగా తయారుకావాలి. ఇలా ఉండడం వల్ల ‘నిర్వహణ’లో జరిగే పొరపాట్లను సులువుగా మీరు అర్థం చేసుకోగల్గుతారు. ఆవేదన చెందరు.
* ఒక మార్పునకు అనుగుణంగా మీరు పని ప్రారంభించినపుడు, ఫలితాలు వచ్చే దిశలో అడుగులు వేయాలి. ఫలితాలు ఎంత చిన్నవయినా ఫరవాలేదు.
* మీ జీవితంలో మిమ్ములను గుర్తించినది ఏదీ మిమ్ములను వదలదు.
* మీకు బాగా అలవాటుగా వున్న గుర్తులను, సాంకేతిక పదాలను ఉపయోగించుకుని ‘మార్పు’ మీలో కల్గించే ఒత్తిడిని అతి తక్కువగా ఉండేటట్లు చేసుకోవాలి.
* ఉదాహరణకు మీరు ఉద్యోగం మారి కొత్త ఉద్యోగంలో ప్రవేశించారనుకుందాం. గతంలో మీరు చేసిన ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలను, అంశాలను మీతో తయారుగా ఉంచుకోవాలి.
* జీవితం ఎప్పుడూ ముందుకు సాగిపోతూ ఉంటుంది. దానిని ఎవ్వరూ అదుపు చేయలేరు. అందుకే అటువంటి ప్రయత్నాలు చేయకూడదు.
* జీవితంలో ‘మార్పు’ అనేది ఒక అనివార్యమైన భాగం.
* ‘నేను చేయలేను’ అనే భావన మిమ్మల్ని పరాజితులను చేస్తుంది. ‘నేను చేయగలను’ అనే ధీమా మిమ్మల్ని విజేతలను చేస్తుంది.
* సరియైన వైఖరి ‘మార్పు’ను అంగీకరించి సులువుగా ఫలితాలను రాబట్టగల్గుతుంది.

-సి.వి.సర్వేశ్వరశర్మ