S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భూమిని పోలిన గ్రహాలు? (శాస్ర్తియ ఆవిష్కరణలు)

ఇప్పటికి 600 కొత్త గ్రహాలను కనుగొన్నారు. వాటిలో ఏదైనా భూమిని పోలి ఉందా? ఈ రంగంలోని అగ్రగామి సంస్థ సెటి (సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్) రేడియో టెలిస్కోప్‌ల సహాయంతో భూమిని పోలిన గ్రహాల గురించి అనే్వషించడం ప్రారంభించారు. ఈ టెక్నిక్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయి.
నాసా శాస్తవ్రేత్తలు భూమిని పోలిన గ్రహాలను రంగునుబట్టే కనుగొనగలుగుతున్నామని, ఇతర లక్షణాలను గుర్తించలేక పోతున్నామని చెప్పారు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం వంటి ఫిల్టర్లతో గ్రహాలను చూసినప్పుడు ఎక్కువ నీలంగా కన్పించేది భూగ్రహం. భూగోళంపై 70 శాతం పైగా నీరు ఉండడమే దీనికి కారణం. దీనికి తోడు భూమి వాతావరణం దిగువగా ఉండి మిథేన్, అమోనియా వంటి వాయువులను గురు, శని గ్రహాల కంటే అధికంగా తీసుకోగలుగుతోంది. సౌరేతర గ్రహాల ఉనికి గురించి అనేక మంది శాస్తవ్రేత్తలు అనే్వషించారు. ముఖ్యంగా కరిగిన నీటికి అవకాశం కల్పించే వాతావరణాలు ఏ గ్రహాల్లో ఉన్నాయో పరిశీలించారు. ఏ గ్రహాల్లో జీవులు పెరుగుదలకు దోహదపడే రసాయనాలున్నాయోనని పరిశోధించారు.
ఉదాహరణకు కేక్ ఇంటర్ ఫెరోమీటర్ ప్రపంచంలోని అతి పెద్ద ఆప్టికల్ టెలిస్కోప్‌ల వెలుతురును సమీకృతం చేసి, భూమిని పోలిన గ్రహాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నక్షత్రాల ధూళిని అధ్యయనం చేస్తున్నారు. 2006 మార్చిలో భూమిని పోలిన గ్రహాలను పాలపుంతలో చూడడానికి ప్రయత్నం జరిగింది.
అందులో భాగంగా కెప్లర్ వ్యోమనౌకను, అందులో భారీ టెలిస్కోప్‌ను ఉంచి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. అతి పెద్దగా ఉండే విశ్వం, పాలపుంతలో వుండే కోట్లాది గ్రహాలను దృష్టిలో పెట్టుకుంటే భూమి వంటి ప్రాణులను కలిగి వున్న గ్రహాలను కనుగొనడానికి ఎక్కువ కాలం పట్టదు.
భూమి ఉండే మానవులను పోలి ప్రాణులు ఇతర గ్రహాలపై కూడా ఉండవచ్చునా?

-బి.మాన్‌సింగ్ నాయక్