S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. మీరే డిటెక్టివ్ 8

ఎనిమిదో రోజు కూడా ఆశే్లష రామాయణ హరికథని వినడానికి రామాలయానికి వెళ్లాడు. హరికథని ఆయన ఇలా కొనసాగించాడు.
‘నిన్న మీకు ఇరవై ఎనిమిది, ఇరవై తొమ్మిది సర్గల కథని చెప్పాను. ఆ తర్వాతది వినండి. విశ్వామిత్రుడు రాముడి ప్రశ్నకి ఇలా జవాబు చెప్పాడు.
‘వామనావతారానికి పూర్వం వామనుడు (విష్ణువు) నివసించిన ఆశ్రమం ఇది. విష్ణువు ఈ వనంలో వందల కొద్దీ సంవత్సరాలు తపస్సు చేశాడు. జమదగ్ని ఇక్కడ తపస్సిద్ధి పొందాడు. అందువల్ల దీన్ని సిద్ధాశ్రమం అంటారు. విరోచనుడి కొడుకు బలి చక్రవర్తి ఇంద్రుడ్ని, ఇతర దేవతలని జయించి ముల్లోకాలని ఏలసాగాడు. బలి చక్రవర్తి యాగం చేసేప్పుడు ఇంద్రుడు, ఇతర దేవతలు అక్కడ తపస్సు చేసే విష్ణువుని కలిసి ఇలా కోరారు.
‘బలి యాగానంతరం వచ్చే యాచకులు యాచించినంత యథాతథంగా ఇచ్చేస్తాడు. నువ్వు వామన (మరుగుజ్జు) రూపం ధరించి మాకు లాభం చేకూర్చు’
అదే సమయంలో కాశ్యప ముని వెయ్యి సంవత్సరాలు తపస్సు పూర్తి చేసుకుని ఆ శక్తితో విష్ణువుని చూసి ఇలా చెప్పాడు.
‘ఓ ప్రభూ! ఆది, అంతం లేని ఈ విశ్వాన్ని నీ శరీరంలో చూస్తున్నాను’
విష్ణువు ఆయన్ని వరం కోరుకోమంటే ఇలా కోరుకున్నాడు.
‘అదితికి, నాకు కొడుకుగా పుట్టి దేవేంద్రుడికి తమ్ముడివి అవు. దేవతల పని చేసి పెట్టు’
ఆ ప్రకారం విష్ణువు అదితికి కొడుకుగా పుట్టి, మరుగుజ్జు రూపం ధరించి, బలి చక్రవర్తి దగ్గరికి వెళ్లి, మూడు అడుగుల భూమిని బిచ్చం అడిగాడు. దాన్ని స్వీకరించి మూడు లోకాలని ఆక్రమించి, బలిని బంధించి ఇంద్రుడికి మళ్లీ స్వర్గ్ధాపత్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను వామనుడి మీద భక్తితో ఈ ఆశ్రమంలోనే ఉంటూ ఆరంభించిన యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారు.’
సిద్ధాశ్రమంలోని మునులంతా విశ్వామిత్రుడికి, రామలక్ష్మణులకి అతిథి పూజలు చేశారు. ఆ రోజునే విశ్వామిత్రుడు యజ్ఞాన్ని ఆరంభించాడు. రామలక్ష్మణులు ఆ రాత్రంతా అప్రమత్తంగా కాపుకాచి ఉదయం ప్రాంతఃకాల సంధ్యని, గాయత్రీ జపాన్ని, అగ్నిహోత్రాన్ని చేసి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్లి నమస్కరించారు.
విశ్వామిత్రుడు వౌన దీక్ష తీసుకోవడంతో మునులు రామలక్ష్మణులతో చెప్పారు.
‘ఈ రోజు నించి ఐదు రాత్రుళ్లు మీరు యాగాన్ని రక్షించాలి’
ఐదు రాత్రుళ్లు వారు నిద్ర లేకుండా కాపున్నారు. ఐదో రోజు రాగానే రాముడు లక్ష్మణుడితో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అకస్మాత్తుగా ఆకాశంలోంచి ఓ భయంకర శబ్దం వినిపించింది. నల్లటి రంగు గల మారీచ, సుబాహులు, వారి అనుచరులు ఆకాశంలోంచి మాయతో రక్త వర్షాన్ని యజ్ఞశాల మీద కురిపించారు. రాముడు మారీచుడి ఛాతీ మీద నల్లటి మానవాస్త్రంతో కొట్టాడు. ఆ దెబ్బకి ఆ నరమాంస భక్షకుడు వెళ్లి వంద యోజనాల దూరంలోని సముద్రంలో పడ్డాడు. ఆ చల్లటి బాణం ప్రాణం తీయకుండా స్పృహ తప్పిస్తుంది.
తర్వాత రాముడు ఆగ్నేయాస్త్రాన్ని సుబాహువు ఛాతీ మీద ప్రయోగించాడు. దాని దెబ్బకి ఆ రాక్షసుడు నేల కూలాడు. మిగిలిన రాక్షస మూక మీద వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి చంపాడు. యజ్ఞం పూర్తవగానే విశ్వామిత్రుడు రాముడితో ఇలా చెప్పాడు.
‘నా యజ్ఞం పూర్తయింది. నువ్వు కూడా నీ తండ్రి ఆజ్ఞని నెరవేర్చావు’
మర్నాడు ఉదయం రామలక్ష్మణులు సంధ్యావందనాది అనుష్ఠానాన్ని పూర్తి చేసుకుని, విశ్వామిత్రుడి దగ్గరకి వెళ్లి నమస్కరించి అడిగారు.
‘మేము వచ్చిన పనైంది. ఇక అయోధ్యకి బయలుదేరుతాం’
విశ్వామిత్రుడి అనుమతితో మునులు వారికి ఇలా చెప్పారు.
‘రామా! మిథిలాపతి ఐన జనక మహారాజు చేసే యజ్ఞానికి మేం వెళ్తున్నాం. మీరు కూడా మాతో అక్కడికి వచ్చి ఓ గొప్ప విల్లుని చూడండి. దేవతలు, గంధర్వులు, రాక్షసులు ఎవరూ ఆ వింటిని వంచి నారిని కట్టలేరు. ఇక మనుషుల వల్ల ఏమవుతుంది? ఎందరో క్షత్రియ రాజులు దాన్ని ఎక్కుపెట్టలేక పోయారు. మిథిలాధిపతి ఐన జనక మహారాజు ఆ వింటిని యజ్ఞానికి ప్రతిఫలంగా దేవతలని అడిగి తీసుకున్నాడు. అది పూజా గదిలో పూజించబడుతోంది.’
సిద్ధాశ్రమానికి ప్రదక్షిణం చేసి, వన దేవతల దగ్గర సెలవు తీసుకుని అంతా ఉత్తరం వైపు మిథిలకి బయలుదేరారు. విశ్వామిత్రుడి వంద రథాలు అనుసరించాయి. తన వెనకే వచ్చే పక్షులు, మృగాలని విశ్వామిత్రుడు వారించి వెనక్కి పంపేశాడు. సాయంకాలానికి వారు శోణా నదీ తీరానికి చేరుకున్నారు. రాముడు విశ్వామిత్రుడ్ని ఆ ప్రదేశం గురించి చెప్పమని కోరాడు.
(సర్గ 29-31)
కథ పూర్తయ్యాక హరిదాసు శ్రీ పుల్లెల రామచంద్రుడు తెలుగులోకి అనువదించిన వాల్మీకి రామాయణం పుస్తకం తిరగేసి ఇలా చెప్పాడు.
‘క్షంతవ్యుడ్ని. మళ్లీ ఇవాళ నేను ఈ రోజు చెప్పిన కథలో ఏడు తప్పులు ఉన్నాయి. అవేమిటో చెప్తా విని బయలుదేరండి.’
అవి ఏమిటో మీరు కనుక్కోగలరా?

మీకో
ప్రశ్న

రామాయణం బాలకాండలో ముప్పైయ్యవ సర్గలోని
ప్రత్యేకత ఏమిటి?

కిందటి వారం రామాయణ కథలో తప్పులు

1.రాముడికి మూడు చక్రాలని, మూడు పాశాలని, మూడు ముసలాలని, రెండు గదలని ఇచ్చాడు. మూడు గదలు కావు. మోదకి, శిఖరి అనే రెండు గదలనే విశ్వామిత్రుడు ఇచ్చాడు.
2.రాముడు ఉపసంహార మంత్రాలని కోరాక విశ్వామిత్రుడు ఇచ్చినవి 45 అస్త్రాలు కావు. 46 అస్త్రాలు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి