S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘స్కూల్’ అంటే తెలుసా?

ఇంగ్లీషు భాషలో స్కూల్ అంటే పాఠశాల అని అర్థం కదా!. అది నిజమే. కానీ ‘స్కూల్’ అన్న పదానికి మరో అర్థం కూడా ఉంది. చేపపిల్లల సమూహాన్ని ‘స్కూల్’ అని పిలుస్తారు. శత్రువునుంచి రక్షణకు వేలాది చేపలు ఒకేచోట గుంపుగా తిరుగుతూంటాయికదా! ఆ గుంపును ఇంగ్లీషులో ‘స్కూల్’ అని పిలుస్తారు. ఒకరకంగా ఇది నామవాచకం. ఇది సాధారణంగా చేపలజాతిని ఉద్దేశించిన పదం. విడివిడిగా ఒక్కోజాతి చేపల సమూహాన్ని బట్టి ఈ నామవాచకం మారుతూంటుంది. ఉదాహరణకు ఈల్ చేపల సమూహాన్ని ‘స్వార్మ్ ఆఫ్ ఈల్’ అని అంటారు. ఎగిరేచేపల సమూహాన్ని ‘గ్లైడ్ ఆఫ్ ఫ్లయింగ్‌ఫిష్’ అని, డాగ్ ఫిష్‌ల గుంపును ‘ట్రూప్ ఆఫ్ డాగ్‌ఫిష్’ అని పిలుస్తారు. డచ్ పదం ‘స్కోలె’ నుంచి ‘స్కూల్’ అన్న పదం పుట్టింది. ఆ భాషలో ‘స్కోలె’ అంటే చేపల సమూహం, గుంపు అని అర్థం.