S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉద్యోగులతో బాస్ ఎలా ఉండాలి?

సమర్థులయిన ఉద్యోగులకు ప్రేరణ కల్గించాలంటే
పని నిర్వహణ ఎలా చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికి ఇవ్వాలి.
కంపెనీ లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన కలగజేయాలి.
నిత్యం వారి పని సరళిపై నిఘాగా ఉండకూడదు.
నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారిని భాగస్వాములను చేయాలి.
కంపెనీలో వారి ఉనికికి గుర్తింపు ఇస్తూ ఉండాలి.
కొత్తదనాన్ని ప్రోత్సహిస్తూ ఉండాలి.
తప్పులు చేసినపుడు నిజాయితీగా అంగీకరించాలి.
ప్రతిభగల ఉద్యోగులు తమ పనితీరు ప్రత్యేకంగా ఉంటుందనే ధోరణిలో వున్నవారిని - కస్టమర్స్‌కు ఎలా సేవలు అందించాలో బోధించాలి. వారికి తాము సేవకులమనే భావనతో కాక అది తమ వృత్తి ధర్మమని వారు గమనించేలా చేయాలి.
ఒక పని చేయగలగడానికి ఒక మనిషి సరిపడితే అతడికే ఆ పనిని అప్పగించాలి. ఇద్దరికి అప్పగిస్తే ఆ పని పూర్తి నిర్వహణ ఆలస్యం అవుతుంది. దీనివల్ల వారిద్దరికి ఆ పని పట్ల అంకిత భావం తగ్గడం, బోర్‌గా ఫీలవడం జరుగుతుంది.
కంపెనీ నియమ నిబంధనలు ఉద్యోగులు పూర్తిగా పాటిస్తున్నది లేనిది అప్పుడప్పుడు సమీక్ష చేస్తూ ఉండాలి. అలసత్వంతో ఉంటే ఉద్యోగుల నియమ నిబంధనలను పాటించే ధోరణి పక్కదోవ పడుతుంది.
ఉద్యోగులకు కొంత సమయం కేటాయిస్తే వారికి ఆసక్తిగల కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించి కంపెనీకి మేలు చేయగల్గుతారు.
ప్రతి ఉద్యోగికి క్రమం తప్పకుండా సెలవు ఇస్తూ ఉండాలి. దీనివలన వారు తమ శక్తిని రీచార్జి చేసుకోగల్గుతారు.
సరికొత్త నాయకత్వం, యాజమాన్య పద్ధతులను పాటించకూడదు.
కంపెనీ ఎదుగుదలకు కావలసిన వ్యూహ రచన చేసుకోవడమే గాక తమ ఆలోచనలను ఉద్యోగులతో పంచుకోవాలి.
తరచూ చేయాల్సిన పనులు
ఉద్యోగులు అనునిత్యం చేసే పనికి కావలసిన పనికరాలు సరిగా పని చేస్తున్నాయో లేదో తనిఖీ చేస్తూ ఉండాలి. పరికరాలు సమర్థవంతంగా పని చేస్తూ ఉంటే పని నిర్ణీత సమయంలో మంచి క్వాలిటీతో పూర్తవుతుంది.
సరిగా ప్రతిభావంతంగా పని చేసేవారిని గుర్తించి బహుమతులు ప్రకటిస్తూ ఉండాలి. నిర్లక్ష్యంగా వున్న వారిని సున్నితంగా హెచ్చరిస్తూ ఉండాలి.
ఉద్యోగి సలహా వలన కంపెనీ సొమ్ము ఆదా కావడం లేదా లాభాలు పుంజుకోవడం వంటివి జరిగినపుడు, ఆ ఉద్యోగికి తగిన పారితోషికం గుర్తింపు ఇవ్వాలి.
ఉద్యోగుల పనితీరుపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉండాలి. ప్రతి ఉద్యోగిలోనూ ఒక ప్రతిభ ఉంటుంది. దానిని సమయం వచ్చినపుడు బహిరంగంగా ప్రస్తావిస్తూ అభినందించాలి.
* ఏ పని పురమాయిస్తున్నారో స్పష్టమైన భావన లేకుండా ఆ పనిని ఉద్యోగులకు అప్పగించకూడదు. మీ లక్ష్యాలు, మీరు అనుకుంటున్నవి ఉద్యోగులకు స్పష్టంగా చెప్పాలి.
మీరు చేసే తప్పులకు ఉద్యోగులను బాధ్యులను చేయకూడదు.
ఉద్యోగులను బాధ్యతగల పెద్దవారిగా చూస్తూ వారితో మసలాలి.
కంపెనీలోని పరికరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూంటే ఉద్యోగులు తమ పని నిర్వహణ మరింత మెరుగ్గా చేయగల్గుతూ ఉంటారు.
పని చేస్తున్న ఉద్యోగులను అదే పని నిర్వహిస్తున్న ఇతర ఉద్యోగులు వేరు ప్రాంతాల్లో ఉన్నవారు ఎలా చేస్తున్నారో చూసే అవకాశం వారికి అప్పుడప్పుడు కల్పిస్తూ ఉండాలి.
పరోక్ష ప్రేరణ
మీ పని వాతావరణం మరింత శక్తివంతంగా చేయాలి.
తోటి ఉద్యోగుల మధ్య సమన్వయం, సహకారం ఉండేటట్లు చూడాలి.
స్నేహపూర్వక పోటీ తత్వం ప్రోత్సహించాలి.
సూక్ష్మంగా కొత్త ఐడియాలు చెప్పాలి.
ఇతరులకు ఆదర్శంగా ఉండే మోడల్‌గా తయారుకావాలని ప్రోత్సహించాలి.
జట్టు కృషిని అభివృద్ధి పరచాలి.
వ్యక్తిగత నైపుణ్యాలు పెంచుకునేందుకు అవకాశాలు ఇవ్వాలి. స్వయం అభివృద్ధికి కావలసిన సదుపాయాలు చేయాలి.
చేయాల్సిన పనులు స్పష్టంగా చెప్పి వాటిని సరిగా నిర్వహిస్తున్నారో లేదో కచ్చితంగా పర్యవేక్షిస్తూ ఉండాలి.
పనిలో ప్రతి ఉద్యోగికి తాము ప్రత్యేక రీతిలో పని చేస్తూ ఉంటాడనే మానసిక భరోసాను కలుగజేస్తూ ఉండాలి.
తమ పని చేసే పరికరాలు అప్‌గ్రేడ్ చేయమని, అభివృద్ధి పరచమని లేదా మార్చమని చెప్పే ఉద్యోగుల సలహాలు ఓపిగ్గా వినాలి. వారి సలహాలను స్వీకరించాలి.
కంపెనీ లక్ష్యాలకు - వ్యక్తిగత లక్ష్యాలకు ఒక లింకును సృష్టించగల్గుతూ ఉండాలి.
ఎంత బిజీగా వున్నా మేలుగా పనిచేసే వారికి రికార్డులు ప్రకటిస్తూ ఉండాలి.
మీ పట్ల మీకున్న ఓర్పుకన్నా, ఉద్యోగుల పట్ల ఎక్కువ ఓర్పుతో ఉండాలి.
ఉద్యోగులను విభజించి ప్రవర్తించకూడదు.
రూమర్స్, గాలి కబుర్లను అనుమతించకూడదు.
సమాచారం రాబట్టడం కోసం ఇతరులను విమర్శించడం, తేలిగ్గా మాట్లాడటం వంటి పనులు చేయకూడదు.
అభివృద్ధిని, ఫలితాలను అభినందించాలి.
ఉద్యోగులు తమ కొత్త ఐడియాలను యాజమాన్యానికి స్వేచ్ఛగా చెప్పగల వాతావరణం సృష్టించాలి.

-సి.వి.సర్వేశ్వరశర్మ