S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రాక్టీస్ (సిసింద్రి కథ)

ఉదయం పదకొండు గంటలు కావస్తోంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈశ్వరరావు తన గదిలో కూర్చుని సహోపాధ్యాయులు తయారుచేసిన ప్రోగ్రెస్ రిపోర్టులు పరిశీలించి, వాటిపై సంతకం పెట్టే కార్యక్రమంలో ఉన్నాడు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు తమ తమ పాఠ్య బోధనలో మునిగి ఉన్నారు.
‘సార్..!’ అటెండర్ స్వామి పిలుపుతో తలెత్తి చూసి యేంటన్నట్లు తలాడించి అడిగాడు ఈశ్వరరావు.
‘మిమ్మల్ని కలవాలని సుబ్బయ్య వచ్చాడు సార్..’ చెప్పాడు స్వామి.
‘సుబ్బయ్యంటే ఆనంద్ వాళ్ల నానే్నగా..! నేనే కలవమని చెప్పాను. పంపు’ అని, చూస్తున్న ప్రోగ్రెస్ కార్డుల కట్టను పక్కన పెట్టాడు.
‘నమస్కారమయ్యా..! తమరు నన్ను కలవమన్నారట. మా పక్కింటి చంద్రం చెప్పాడు...’ అంటూ లోపలకు వచ్చాడు సుబ్బయ్య.
‘నమస్కారం సుబ్బయ్యా.. రా కూర్చో’ అంటూ ఎదురుగా కుర్చీ చూపించాడు.
ఎదురుగా కుర్చీలో కూర్చొనేందుకు సుబ్బయ్య సందేహించడం గమనించిన ఈశ్వరరావు
ఫర్వాలేదు కూర్చో అని సైగ చేయడంతో కూర్చున్నాడు సుబ్బయ్య.
‘సుబ్బయ్యగారూ.. ఆనంద్ మీ అబ్బాయే కదా..’ అని అడిగాడు.
అవునన్నట్లు తలూపాడు సుబ్బయ్య.
‘మొన్న మార్చిలో జరిగిన పబ్లిక్ పరీక్షల్లో మీ అబ్బాయి ఆనంద్ ఒక సబ్జెక్ట్‌లో ఫెయిలయ్యాడు. మరి మళ్లీ పై నెలలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావటంలేదు. పిల్లలతో ఎన్నిమార్లు చెప్పి పంపినా ఫీజు కట్టలేదు. అదేమంటే పరీక్ష రాయనంటున్నాడట. ఈ విషయం మీకు తెలుసా.. లేదా.. అని మిమ్మల్ని పిలిచాను’ విషయం చెప్పాడు ఈశ్వరరావు.
‘అవునయ్యా. ఆ విషయం నాకూ తెలిసింది. నేను బాగా చదివినా పరీక్షల్లో ఆ సబ్జెక్ట్ పోయిందని తెగ బాధపడిపోయాడు. మళ్లీ కట్టి చదవరా అని నేనూ చెప్పానయ్యా. అందుకు వాడు పోతే పోయింది. ఇక చదవను. నాకు చదువు వచ్చే యోగం లేదులే.. నీతోపాటు సేద్యం చేసుకుంటాలే అంటున్నాడయ్యా’ చెప్పాడు.
‘ముందు గడువు లోపల ఫీజు కట్టెయ్. నేను ఆనంద్‌ని పిలిచి మాట్లాడి పరీక్షలు రాయిస్తా.’ అంటూ సుబ్బయ్యను పంపించేశాడు ఈశ్వరరావు.
* * *
మరుసటి రోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత, తిరిగి క్లాసులు ప్రారంభమయ్యాయి.
వరండాలో ఆ కొస నుండి ఈ కొస వరకు ఒక రౌండ్ వేసిన ఈశ్వరరావు తిరిగి తన గదిలోకి వచ్చి కూర్చోగానే.. ‘నమస్తే సర్!’ అంటూ ఎదురుగా ఆనంద్.
‘మీ నాన్నకి నేనే చెప్పాను. నిన్ను పంపమని. ఒక సబ్జెక్ట్ పోయిందిగా మళ్లీ రాయిద్దామని’
‘అంత బాగా చదివినా ఆ సబ్జెక్ట్ పోయింది సార్. మొదటి నుండీ నాకు దాని మీదే డౌట్. ఆ మ్యాథ్స్ అంటే ఎందుకో నాకు ఎక్కడం లేదు సార్. చదువు నాకు వొంటబట్టదు. సేద్యానికి పోతాను..’ అన్నాడు ఆనంద్.
‘సేద్యానికే వెళుదువులే.. నీకు సైకిల్ తొక్కడం వచ్చా?’ ఆని అడిగాడు ఈశ్వరరావు.
‘వచ్చు సార్..’
‘ఏ తరగతి చదివేటప్పుడు సైకిల్ తొక్కడం ప్రాక్టీస్ చేశావ్..?’
‘ఆరో క్లాసులో సార్. సెవెంత్‌లో కొచ్చేసరికి బాగా తొక్కేవాణ్ణి...’
‘ఎప్పుడూ పడిపోలేదా?’
‘పడకపోవడమేమిటి సార్.. మోకాళ్లూ మోచేతులూ గీకొన్నాయి...’
‘మరి.. ఛీ.. ఈ సైకిల్ నేర్చుకోక పోతే ఏమవుతుంది అనిపించలేదా?’ ఆసక్తిని వ్యక్తం చేస్తూ అడిగాడు.
‘నేర్చుకోవాలనే పట్టుదల మరింత పెరిగింది సార్. దెబ్బలు తగిలాయని వదిలేస్తే.. సైకిల్ తొక్కటం రాదు కదా..’ తానేదో గొప్ప దానిని సాధించినంతగా ఫీలయి చెప్పాడు ఆనంద్.
‘నువ్ చెప్పింది కరెక్ట్ ఆనంద్..! ఏదైనా మనం చేసే పని ఫెయిల్ అయిందని అక్కడకు ఆపేస్తే సక్సెస్‌ను చూడలేము కదా.. ఎన్నోసార్లు తన ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయని థామస్ ఆల్వా ఎడిసన్ నిరుత్సాహంతో ప్రయోగాలు మానుకొని ఉంటే మనకు ఎలక్ట్రిక్ బల్బ్ ఉండేదా.. ఆయనే కదా ఎందరో శాస్తవ్రేత్తలు తమ ప్రయోగాలు ఎన్నోసార్లు విఫలమైనా.. సాధించాలి... సాధించగలం.. అనే ఆశ, ఆకాంక్షతో ముందుకు సాగడం వల్లనే ఎన్నో కొత్తకొత్త వాటిని కనిపెట్టే అవకాశం ఏర్పడింది. మరి ఒకసారి పరీక్ష ఫెయిల్ కాగానే చదవటం మానేద్దామని ఎందుకనుకొన్నావ్?’ సూటిగా ఆనంద్ కళ్లలోకి చూస్తూ అడిగాడు ఈశ్వరరావు.
అంతవరకు తన సైకిల్ ప్రాక్టీస్ గురించి ఎంతో సంబరంగా చెపుతున్న ఆనంద్ ఆ మాటతో వౌనంగా తలవంచుకొని ‘సార్.. మీ పాయింట్ నాకర్థమైంది. పరీక్ష రాస్తాను’ వినయంగా జవాబిచ్చాడు.
‘గుడ్.. రేపు మాథ్స్ బుక్స్‌తో ఇక్కడుండాలి.. సరేనా?’ ఆనంద్ భుజం తట్టి అన్నాడు ఈశ్వరరావు. సరేనన్నట్లు తలూపి బైటకు నడిచాడు ఆనంద్.

-ఆదిశేషు