S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రమాదాలతో పోరాటం

ఆత్మరక్షణకోసం ఉపయోగించే మార్షల్ ఆర్ట్స్ నిజానికి సాహసంతో కూడుకున్నవే. ఆయుధాలు లేకుండా కేవలం శరీరాన్ని ఉపయోగించి చేసే యుద్ధకళ. అందులో జీవం ఉట్టిపడేలా సన్నివేశాలు చిత్రీకరించాలని తపనపడతాడు జాకీచాన్. అందులో ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా వెనుకంజ వేయడు. ఆయన సాహసం ఎంత ప్రమాదకరమో తెలుసుకున్న జీవితభీమా సంస్థలు ఏవీ ఆయనకు కానీ, ఆయన తరపున పనిచేసే స్టంట్‌మన్‌కు కానీ భీమా చేయమని తేల్చి చెప్పేసాయి. అమెరికాలో ఏ భీమా సంస్థా ముందుకురాలేదు. ఇప్పటికీ జాకీచాన్ సినిమాల్లో పనిచేసే వారికి అతడే స్వయంగా బీమా చెల్లిస్తాడు. యుద్ధసన్నివేశాల్లో నటించేందుకు సొంతంగా స్టంట్‌మాన్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశాడు. మెరికల్లాంటివారిని ఎంపిక చేసి వారికి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పించాడు. తను స్వయంగా యుద్ధ సన్నివేశాలను డిజైన్ చేసి, రూపొందించి, స్వయంగా నటించి మెప్పించాడు. ఏ సినిమాలోనూ డూప్‌లు లేవు. ప్రమాదకరమైన ఫీట్స్ చేసి ఎన్నోసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ముక్కు మూడుసార్లు పగలగొట్టుకున్నాడు. మోకాలి చిప్పలు పగిలిపోయాయి. రెండు వాహనాల మధ్య రెండు తొడలు నలిగిపోయాయి. చివరకు మర్మాంగమూ దెబ్బతింది. భుజాల ఎముకలు డిస్‌లోకేట్ అయ్యాయి. ఓసారి ముంజేయి ఎముక పక్కకు జరిగితే దానిని స్వయంగా సర్దుకున్నాడు. నొప్పి తగ్గకపోయే సరికి పరీక్షిస్తే వేరే స్టంట్‌మన్‌కు చెందిన ఓ దంతం అతడి చేతిలో ఇరుక్కుపోయినట్లు తేలింది. ఓ సినిమాలో విమానం నుంచి దూకే సన్నివేశంలో నటించాల్సి వస్తే అమాంతం దూకేశాడు. అదే సమయంలో దిగువ ఎగురుతున్న హాట్ ఎయిర్ బెలూన్‌పై పడ్డాడు. ఆర్మర్ ఆఫ్ గాడ్ సినిమా చిత్రీకరణ సందర్భంగా తలకు బలమైన గాయం అయింది. చివరకు పుర్రెకు రంధ్రం పడింది. ఆయన కపాలంలో శాశ్వతంగా ఓ ప్లాస్టిక్ ప్లగ్‌ను అమర్చారు. ఇప్పటికీ ఆ రంథ్రం కన్పిస్తూంటుంది. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఓసారి 12 కాంక్రీట్ దిమ్మలను చేతితో పగలగొట్టాడు. షూటింగ్ చేసేటప్పుడు తాను అనుకున్న తీరులో షాట్ వచ్చేవరకు విశ్రమించడు. ‘డ్రాగన్ లార్డ్’ సినిమాలో ఓ సన్నివేశంకోసం ఏకంగా 2900 టేక్స్ తీసుకున్నాడంటే అర్థం అవుతుంది అతడి చిత్తశుద్ధి ఏమిటో.