S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్ఫూర్తి కలిగించడం ఎలా?

తమ వద్ద పనిచేసే వారికి డబ్బుతో ప్రేరణ కల్గించాలనుకున్నా లేదా వారిలో స్ఫూర్తి ఏర్పరచాలన్నా ఎవరి ప్రయత్నమైనా సత్ఫలితాలు ఇవ్వదు.
సహాయాన్ని కొనలేము. దానిని సంపాదించుకోవాలి. సగటు మనిషిని, దొరికిన మనిషిని కొనగలగవచ్చు. కాని ప్రస్తుత వ్యాపార వాతావరణంలో అది ఎంతో కాలం సాగదు. వ్యాపార రంగంలో గాని, మీరు చేపట్టిన ప్రాజెక్టులోగాని విజయం సాధించాలంటే మీ ప్రతి కస్టమర్‌తోనూ ప్రవర్తించేటప్పుడు సగటు వ్యాపారికి మించిన దృక్పథంతో ఉండాలి.
సాధారణంగా సగటు ఉద్యోగికి మించిన స్థాయిలో ఉన్న ఉద్యోగులు తాము చేసే ప్రతి పనిలో ప్రత్యేకత ఉండాలనే తపనతో పని చేస్తూ ఉంటారు. తమ వంతు సేవలు ప్రత్యేకంగా కనపడాలని ఇతర ఉద్యోగులు కన్నా తను మేలుగా ఉండాలనే తాపత్రయంతో ఉంటాడు. అవకాశాన్ని అద్భుతంగా అందిపుచ్చుకునేందుకు అందుబాటులో ఉన్న పరికరాలు, విజ్ఞానాన్ని వినియోగించుకుంటాడు.
స్ఫూర్తి కల్గించడం
* మీరు ఉద్యోగులను లక్ష్యపెడితే వారు మిమ్మల్ని లక్ష్యపెడతారు.
*ఉద్యోగులకు భద్రతా భావం కల్గిస్తే అద్భుతంగా పనిచేయడమే గాక బాస్‌ను విశ్వసిస్తారు.
*ఉద్యోగులకు ఏదో చేస్తే ప్రేరణ కల్గించడంలో విజయం సాధించలేరు. వారితో కలిసి చేస్తేనే వారు ప్రేరణ పొందుతారు.
*ఉద్యోగులను సరిగా ఆదరించి వారిలో స్ఫూర్తి కల్గిస్తే మీకు ఏది కావాలో దానిని సాధించగల్గుతారు.
*ఉద్యోగులలో బాధ్యత, గౌరవం అభివృద్ధి చెందించాలంటే అవి వారికి ఇవ్వడమే ఉత్తమమైన మార్గం.
*అభినందన, విమర్శ, నిశ్శబ్దం వంటివి ఉద్యోగుల పట్ల సమతుల్యంగా ప్రదర్శిస్తూ ఉంటే మీ చర్యల్లో నిజాయితీ ఉందని వారు మిమ్మల్ని నమ్ముతారు.
* మీరు పాటించి ఒక ఉదాహరణగా ఉండాలి.
* ప్రేరణ అనేది తాత్కాలికంగా పనిచేస్తూ ఉంటుంది. తరచూ దానిని తిరిగి తిరిగి కల్గిస్తూ ఉండాలి.
ఉద్యోగుల ధోరణి
*ఉద్యోగులు చేస్తున్న కృషికి తగిన విధంగా ప్రోత్సాహం ఉంటుంటే వారు చాలా ఉన్నతంగా ప్రేరణ పొందుతూ ఉంటారు.
*కలసికట్టుగా ఉండేవారు జట్టుగా కృషిచేస్తే వారి పనితీరు బేషుగ్గా ఉంటుంది.
* మనిషి మనసు గాని, దానిని ప్రేరణ చేసే శక్తిగాని పూర్తిగా న్యాయపరంగా ఉంటాయి.
* సూక్ష్మత ముఖ్యం.
* ఒక పని చేసే పనివాడు ఆ పని చేయడానికి సరిపడే నైపుణ్యం గలవాడయితే అతనికి ప్రేరణ పెద్దగా అవసరం ఉండదు.
* విమర్శ అనేది పనిచేసేవాడు గాడి తప్పితే గాడి మీదకు తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది గాని పని ప్రారంభించేందుకు మాత్రం అది పనికిరాదు.
* నిబంధనలు ఎక్కువైతే ఉద్యోగి మనోధైర్యం దెబ్బతింటుంది.
* ఆజ్ఞలు జారీ చేయడం కన్నా పని చేయమని కోరడం వాంఛనీయం.
*ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు లేకపోతే దాని ప్రభావం వారి వృత్తి నిర్వహణ మీద ఎంతగానో ఉంటుంది.
* పనిలో గుర్తింపు ఇవ్వవలసిన వారికి గుర్తింపు తప్పనిసరిగా ఇవ్వాలి.
*ఆత్మసంతృప్తికి మించిన ప్రేరణ మరొకటి ఉండదు.
*నచ్చజెప్పి పని చేయించడం వల్ల కలిగే ఫలితం భయంతో పనిచేయించడం వలన రాదు.
*సాధించిన పనికి తగ్గట్టుగా పారితోషికం చెల్లించాలి.
అనువర్తనాలు
*కొత్తవారు, తక్కువ నైపుణ్యం గలవారు తగిన విధంగా పనితీరుపై అవగాహన కల్గిస్తే బాగా ప్రతిభావంతంగా ప్రేరణ పొందుతారు.
* మిమ్మల్ని ఏ విధంగా ఇతరులు గౌరవించాలనుకుంటున్నారో అదే విధంగా ఉద్యోగులను మీరు గౌరవించాలి.
*ఉద్యోగులు పనితీరు బాగుంటే తప్పనిసరిగా అభినందించాలి. వారు పని పట్ల మరింత శ్రద్ధ కనబరుస్తారు.
*పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా పనిచేసే ప్రాంతాన్ని ఉద్యోగులకు ఒక నియమం ప్రకారం కేటాయించాలి.
* నైపుణ్యంగల ఉద్యోగులకు చేయాల్సిన పని హద్దులు తెలియజేసి వారికి స్వేచ్ఛగా పనిచేసేందుకు అవకాశం ఇస్తే నాణ్యతతో పనిని పూర్తి చేయగల్గుతారు.
*ఉద్యోగులు చిన్నచిన్న తప్పులు చేస్తే పెద్ద మనసుతో క్షమించాలి. కాని వారికి ఏమి చేయకూడదో సున్నితంగా చెప్పాలి.
* మీరు చెప్పే మాటలు ఎంత సున్నితంగా, లక్ష్య సాధన వైపు కేంద్రీకరించి వున్నా ఉద్యోగులందరూ వాటిని ఒకే విధంగా తీసుకోరు. మీ పిలుపునకు వారి స్పందనలు భిన్నంగా ఉంటాయి.
*ఉద్యోగుల అవసరాలను గమనించి వారికి సహకరించాలి.
* నిబంధనలు ఏర్పాటు చేసినపుడు వాటిని ఉద్యోగులందరికి వర్తింపజేయాలి. ఏ ఒక్కరికీ మినహాయింపు ఇవ్వకూడదు.
*ప్రతి ఉద్యోగికి వారి సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన వారికి నచ్చిన పనిని అప్పగించాలి.
*ఉద్యోగుల మధ్య ఏర్పడిన వ్యక్తిగత విభేదాలను సరిదిద్దే ప్రయత్నం మంచిది కాదు.
* ఒక పెద్ద ప్రాజెక్టు పని పూర్తి చేయాల్సి వచ్చినపుడు రెండు బృందాలను ఆ పని నిర్వహణకు పురమాయించి వారు చేసే పనులను సమీక్షిస్తూ వారికి లక్ష్యాలు, గడువులు ఇస్తూ ఎవరు బాగా పని చేస్తున్నారో మీరు పర్యవేక్షిస్తున్నట్లు వారికి తెలిసేటట్లు చేస్తే చాలా నాణ్యమైన రీతిలో ప్రాజెక్టు పని పూర్తి అవుతుంది.

-సి.వి.సర్వేశ్వరశర్మ