S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆనందం ఇలా... (సండేగీత)

రెండు రోజులు సెలవులు వస్తే ఏం చెయ్యాలో తోచక చాలామంది ఇబ్బంది పడుతూ వుంటారు. సినిమాలకి షికార్లకి వెళ్తూ ఉంటారు. ఆనందించడంలో తప్పు లేదు. అందువల్ల కాస్త ఆనందం, సంతోషం కలగడం వాస్తవమే.
అయితే ఆనందం కలుగడానికి ఎన్నో పనులు చేయవచ్చు. ఆ పనుల వల్ల ఇంకా ఎక్కువ ఆనందం కలుగుతుందని మనం గ్రహిస్తే అలా చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతాం.
ఎందుకంటే-
మనకు మనమే ఓ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా దాన్ని పూర్తి చేయడానికి కారణం కూడా కావాలి.
ఈ రెండూ మనం పూర్తి చేసినప్పుడు ఆనందం కలుగుతుంది. జీవితానికి కావాల్సింది అదే. ఈ లక్ష్యాలు, ఉద్దేశాలు మరీ పెద్దవి అయి వుండాల్సిన అవసరం లేదు. అవి చిన్నవైనా పర్వాలేదు. అవి పూర్తి చేసినప్పుడు మనకి సంతోషం కలగాలి. ఎదుటి వ్యక్తులకి ఆనందం కలగాలి.
ఓ చిన్న చిరునవ్వు, ఓ ప్రేమపూర్వకమైన చూపు చాలాసార్లు ఎదుటి వ్యక్తుల్లో ఆనందం నింపుతుంది. మన సమయాన్ని శక్తియుక్తులని ఇతరులకి సహాయం చేయడానికి ఉపయోగించినప్పుడు ఆనందం కలుగుతుంది.
ఖాళీగా వున్నప్పుడు మన ఆల్మైరా వైపు చూస్తే చాలు - మనం చాలాకాలంగా వాడని దుస్తులు ఎన్నో మనకి దర్శనమిస్తాయి. మూలన పడిన స్వెటర్లు, మఫ్లర్లు కన్పిస్తాయి. శాలువాలు కూడా కన్పిస్తాయి. వాటిని ఎవరికైనా ఇచ్చి వాళ్ల కళ్లల్లో వెలుగు నింపవచ్చు.
అదే విధంగా వంటింటి వైపు చూస్తే - మనం చాలా రోజులుగా వాడని కప్పులూ సాసర్లు, వస్తువులు ఇలా ఎన్నో కన్పిస్తాయి. రాయని పాత డైరీలూ, పెన్నులు, కాగితాలు ఇట్లా ఎన్నో కన్పిస్తాయి. వాటిని ఎవరికైనా అవసరం వున్న వాళ్లకి ఇవ్వవచ్చు.
అనారోగ్యంగా వున్న వ్యక్తులని ప్రత్యేకంగా వెళ్లి కలువకపోయినా, ఫోన్లో పలకరించవచ్చు. మంచి మాటలు వున్న ఓ కార్డుని వాళ్లకి పంపించవచ్చు.
ఇట్లా ఎన్నో చేయవచ్చు.
మనం ఆనందించవచ్చు.
ఎదుటి వాళ్లని ఆనందింప జేయవచ్చు.
ఎందుకంటే-
సంతోషం కోసం.
చిన్నచిన్న పనులతో మన సెలవు రోజుని గడిపితే సినిమా చూసిన దానికన్నా ఎక్కువ ఆనందం లభిస్తుంది. ప్రతి సెలవు రోజున సినిమాలే చూడాల్సిన పనిలేదు. ఇలా కూడా గడుపవచ్చు. ప్రయత్నించండి.