S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నోప్రాబ్లమ్!

-అంటోంది బాలీవుడ్ బ్యూటీ తనపై వస్తున్న రూమర్స్ గురించి. బాలీవుడ్‌లో ఇలాంటివి మామూలే అయినా.. ఇటీవల ఈ భామపై వస్తున్నన్ని రూమర్స్ మరే తారపైనా రాలేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? అని కత్రీనాను కదిలిస్తే- ‘‘బాలీవుడ్‌లో ఇలాంటివి నాకు కొత్తేంకాదు. నాకే కాదు, నాలాంటి చాలామంది తారలపై వస్తున్నవే. వీటిని పట్టించుకొని కూర్చుంటే ఇక కెరీర్ అటకెక్కినట్లే. ఎదుగుతున్న తారలపై, ఎంతో ఎత్తుకు ఎదిగిన తారలపై రూమర్స్ సృష్టిస్తూ పబ్బం గడుపుకునే మీడియా మిత్రులను చూస్తుంటే నాకే అసహ్యం వేస్తోంది. చికాకు కూడా కలుగుతోంది. వాళ్లకు పేరు రావడానికి ఇలాంటి రూమర్స్ పనికొస్తాయంటే నాకే ఆశ్చర్యంగా వుంది. బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి వెనక్కితిరిగి చూసుకోవలసిన అవసరం నాకు రాలేదు. రాదు కూడా అనుకుంటున్నా. ప్రస్తుతం నా కెరీర్ మంచి పొజిషన్‌లోనే వుంది. నటిగా నేను ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూనే వున్నా. ఒక నటిగా నాకు చాలు ఈ తృప్తి’’అంటోంది కత్రీనా. దటీజ్..కత్రీనా!!

-సమీర్