S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘సావిత్రి’గా!

వైవిధ్యమైన పాత్రలు.. అంతకంటే చాలెంజింగ్ రోల్స్ అంటే నటి నిత్యామీనన్‌కు భలే ఇష్టం. ఇలాంటి పాత్రలే నటికి మంచి కెరీర్‌తో పాటు అంతకంటే చక్కటి ఇమేజ్‌ను తెచ్చిపెడతాయని ఈ బ్యూటీ నమ్మకం. టాలీవుడ్, కోలీవుడ్ అంటూ రెండు పడవల ప్రయాణాన్ని సునాయాసంగా చేస్తూ రెండు చోట్లా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎంచుకుంటున్న చిత్రాలు..చేస్తున్న బ్యానర్లు.. జోడీ కడుతున్న కథానాయకులు అంతా బాగానే వున్నా ఎందుకో ఈ అమ్మడికి ఇంకా ఆశపడుతున్న అదృష్టం మాత్రం దక్కలేకపోతోంది. తాజాగా ‘సావిత్రి’గా కనిపించబోతోందిట! ‘ఎవడై సుబ్రమణ్యం’ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరును తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ఇప్పుడు మరో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. అదే అలనాటి నటి సావిత్రి జీవితకథనట. సావిత్రి క్యారెక్టర్ కోసం చాలామందినే అనుకున్నారట. కానీ..ఈ పాత్రకు నిత్యామీనన్ అయితేనే బావుంటుందని యూనిట్ వర్గాలు భావించాయట. ఈ విషయంలో నిత్య కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసిందట. ఈ ఏడాది చివర్లో చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయని యూనిట్ చెబుతోంది. ఏది ఏమైనా నిత్యను ‘సావిత్రి’ అయినా కాపాడుతుందో..లేదో చూడాల్సిందే!!

-సమీర్