S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మీ లక్ష్యసాధనకు మిమ్మల్ని మీరు ఇలా మలచుకోండి!

ఎవ్వరూ మిమ్మల్ని నమ్మడం లేదనిపించినపుడు నిరుత్సాహపడవద్దు. ముందు మిమ్మల్ని మీరు నమ్మడం అలవరచుకోండి.
అందుబాటులో వున్న వనరులతో మీరు ఏమి చేయగలరో ఆలోచించుకుంటూ ఊహాలోకాల్లో విహరించక మీరు ఏమి చేస్తారో నిర్దిష్టంగా నిర్ణయించుకోండి.
ముందు నుండి చిన్నచిన్న ఇష్టంలేని పనులు చేయడం ప్రాక్టీసు చేయండి. నిజంగా త్యాగం చేయాల్సిన సమస్య ఎదురయినపుడు మీ మనసుకు అప్పటికే తగిన శిక్షణ లభించడం వలన సులువుగా అటువంటి పనులు చేయగల్గుతారు.
మీరు ఏ పని చేస్తున్నా దానిని ప్రేమించి చేయండి.
ఒక ప్రతికూల పరిస్థితుల యందు ఉండే అనుకూల అంశాలను గుర్తించి వాటిని వదలకుండా పట్టుకోండి.
మీ జీవితంలో మీరు ఏది కోరుకుంటారో అది సాధించగల్గుతారు. కాకపోతే దాని సాధనకు అవసరమైన మూల్యాన్ని చెల్లించడానికి మీరు తయారుగా ఉండాలి.
మీ ఆశయాలు, కలలు, లక్ష్యాలు వంటివి మీ పరంగా ‘నేను’ అని సంబోధించుకుంటూ ప్రకటించుకోవాలి.
నిర్దిష్టమైన లక్ష్యాలు ఏర్పరచుకోవాలి తప్ప నేను ఫలానాది సాధిద్దామనుకుంటున్నాను అనే ధోరణిలో ఉండకండి.
మిమ్మల్ని మీరు ఉల్లాసంగా ఉంచుకోవాలి. అవాస్తవ వ్యక్తిగత అభిప్రాయాలు అంటే ‘నేను విజేతగా ఉండాలనుకుంటున్నాను’ ‘నేను చేసే పని పరిపూర్ణతతో చేయాలనుకుంటున్నాను’ ‘నేను అన్నింటిని అదుపు చేయలేకపోయినా పని విషయంలో అద్భుతంగా నిర్వహించాలనుకుంటున్నాను’ వంటి వాటిని చెప్పకండి.
మీ అదృష్టం మీ చేతుల్లోనే ఉంటుంది. దానిని సాధించాలన్నా పోగొట్టుకోవాలన్నా మీ చేతుల్లోనే ఉంటుంది అనే విషయం మరువద్దు.
అనుకున్నది ఇప్పుడే చేయండి.
మీ లక్ష్యం సాధించడానికి తప్పనిసరిగా సమయాన్ని హద్దుగా నిర్ణయించుకోవాలి.
ఇంకా గమనించాల్సినవి
‘అయితే’ అనే పదం బదులు ‘ఎప్పుడు’ అని మార్చుకోండి.
అర్థవంతమైన ‘లక్ష్యాలు’ అర్థవంతమైన ఫలితాలు ఇస్తాయి.
ఏదైనా తప్పుడు మార్గంలోకి మళ్లితే, సృజనాత్మకంగా ఆలోచించాలి తప్ప చెడుగా ఊహించుకోకూడదు.
ఉదాహరణకు మీరు మీ కంప్యూటర్‌లో ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ప్రోగ్రాం రూపకల్పన చేసుకుంటున్నారు అనుకుందాం. అకస్మాత్తుగా కంప్యూటర్ పని చేయడం దెబ్బతింది అనుకోండి.
ఈ దెబ్బతో నా ప్రయత్నంలో నేను ఓడిపోతాను, నా ఉద్యోగం పోవడం ఖాయం, నన్ను నలుగురిలోను అవమానం పాలుచేస్తారు అని ఊహించుకొని భయపడిపోకూడదు.
సమస్యకు నిర్దిష్టమైన పరిష్కారాలు అనే్వషించుకోవాలి. ఎవరి కంప్యూటర్ ఒకసారి నేను వాడుకోవచ్చు. ప్రెజెంటేషన్ సమయం పొడిగించమని ఎలా ప్రయత్నం చేయాలి? నా ప్రెజెంటేషన్‌కు నేను ప్రత్యామ్నాయంగా ఏమి ఉపయోగించవచ్చు? వంటి వాటిపై దృష్టి నిలపాలి.
రేపు చేద్దామనే ధోరణి క్రమంగా నిన్న చేసి ఉండాల్సిందిగా మారుతుందని గుర్తుంచుకోవాలి.
ఎప్పుడూ జరగదు అని ఎప్పుడూ అనుకోకండి.
అతి తక్కువ సమయంలో మీ లక్ష్యం సాధించగలమనే ధోరణితో కృషి చేయాలి. ఏదో రోజుకి పూర్తి అవుతుంది. తర్వాత ఎప్పుడో సాధించగల్గుతాము అనే భావనలకు స్వస్తి చెప్పాలి.
మీరు ఎన్నిసార్లు ఓటమి పాలయ్యారన్నది ప్రధానం కాదు. విజయం వైపు అడుగులు పడటం అనేది ముఖ్యం.
నేను ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనుకుంటున్నాను అనుకోవాలి గాని నేను లావుగా ఉండాలనుకోవడం లేదు అని అనుకోకూడదు.
నేను మంచి ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నాను అనుకోవాలి. ఈ పనికిమాలిన ఉద్యోగం వదిలేద్దామనుకుంటున్నాను అనుకోకూడదు.
తప్పనిసరిగా ఇవి పాటించండి
మీ వాయిదా అలవాట్లను గుర్తించండి. మీ ప్రగతిని అడ్డుకునే అలవాటు ప్రవర్తనలకు ఎవ్వరూ అతీతులు కారు.
మీకు నిరుత్సాహం కల్గినపుడు దానిని పక్కన పెట్టి మరొక పనిలో మనసును లగ్నం చేసుకోండి. నిరుత్సాహం, విచారం అనే వాటికి ఒక ప్రయోజనం ఉంటుంది. వాటంతటవి జీవితంలోంచి నిష్క్రమించాలి. అంతేగాని అవి మీ జీవితాన్ని శాసించేటట్లు చేసుకోకూడదు.
ఎప్పుడూ అత్యాసక్తి గల వ్యక్తిగా ఉండాలి.
అర్థవంతమైన లక్ష్యాలు సులువుగా సాధించగల్గుతారు. ఇతరులు మీ కోసం పెట్టే లక్ష్యాలు మీరు సులువుగా సాధించలేరు.
సమస్య గురించి ఆలోచించడానికి, దాని గురించి ఆందోళన చెందడానికి మధ్య తేడా తెలుసుకోవాలి. ఆలోచించడం ఉత్పత్తిదాయకం. ఆందోళన చెందడం నిరుపయోగం.
ఎప్పుడూ అనుకూలమైన భాషను వాడాలి. అంటే ‘నేను ఓటమిపాలు కాను’ అనకూడదు. ‘నేను విజయం సాధిస్తాను’ అనాలి.
ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు లేదా చర్యలు తీసుకుంటారు. మీ ప్రతిస్పందనే మీరు అదుపులో వున్నారా? అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారా? అనే దానికి దర్పణంగా ఉంటుంది.
మీకు మీరు ప్రేరణ కల్గించుకునే అలవాటు చేసుకోవాలి. మొదట్లో మీ ప్రయత్నం అంతగా ఫలవంతంగా ఉండకపోయినా క్రమక్రమంగా ఈ రంగంలో పరిపూర్ణ విజయం సాధించగల్గుతారు. ఎందుకంటే అభ్యాసము మిమ్మల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతుంది.

-సి.వి.సర్వేశ్వరశర్మ