S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దేవుడి మాట (స్ఫూర్తి)

ఓ ఆదివారం ఉదయం పూర్వి తన కుటుంబ సభ్యులతో కలిసి రైల్లో వెళ్తూండగా క్రాసింగ్ కోసం అది ఓ చోట ఆగింది. పూర్వి తండ్రి వారిని పక్కనే ఉన్న సొరంగం చూపించడానికి తీసుకువెళ్లాడు. దాన్లోకి పదడుగులు వెళ్లాక లోపలంతా చీకటి. సొరంగం అంతం అయ్యే చోట దూరంగా వెలుతురు కనిపించింది.
‘హలో, ఎవరక్కడ?’ తండ్రి అరిచాడు.
వెంటనే ‘హలో, ఎవరక్కడ?’ అనే ప్రతిధ్వని వినిపించింది.
‘నేను. పూర్వీని’ పూర్వి జవాబుగా అరిచింది.
‘నేను. పూర్వీని’ ఆ మాటలు ప్రతిధ్వనించాయి.
సొరంగంలోంచి బయటకి వచ్చాక పూర్వి తండ్రి మళ్లీ గట్టిగా అరిచాడు.
‘హలో, ఎవరక్కడ?’
ఈసారి ప్రతిధ్వని వినపడలేదు.
‘ఇక్కడ ప్రతిధ్వని ఎందుకు వినపడలేదో తెలుసా?’ తండ్రి అడిగాడు.
పూర్వి తెలీదన్నట్లుగా తల అడ్డంగా ఊపింది.
‘శబ్ద తరంగాలు వెళ్లి సొరంగంలోని గోడలని తాకినప్పుడు అవి తిరిగి వెనక్కి రావడంతో ప్రతిధ్వని వినిపిస్తుంది. ఈ ఓపెన్ ప్రదేశంలో శబ్ద తరంగాలు వేటినీ తాకవు కాబట్టి వెనక్కి తిరిగి రావు’
రైలు కూత వేయడంతో వాళ్లు రైలు ఎక్కారు.
పూర్వి కిటికీ పక్కన కూర్చునే విషయంలో తన అన్నలతో పోట్లాడింది. తర్వాత తండ్రికి వాళ్ల మీద ఫిర్యాదు చేస్తూ చెప్పింది.
‘అన్నలతో కష్టం కదా నాన్నా? నీక్కూడా ఇద్దరు అన్నలు ఉన్నారు కదా?’
‘తోడబుట్టిన వాళ్లు ఎవరైనా సరే వాళ్లని ప్రేమించాలి’ తండ్రి చెప్పాడు.
‘కానీ వాళ్లు కోపం తెప్పిస్తారు’ ఫిర్యాదు చేసింది.
‘మీ అన్నయ్యలకి కూడా నీ మీద కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. వాళ్లేం అడిగితే అదే నీకు కావాలంటావు. అంతా ఒకరికొకరు ప్రేమించుకోవాలి’
‘కానీ పెద్దన్నయ్య మరీ మొండి’ పూర్వి నిస్సహాయంగా చెప్పింది.
‘మనం ఇతరులతో ప్రేమగా ఉండాలని పరమాత్మ చెప్తున్నాడు. అన్నలతో సహా’
‘ప్రతీ ఆధ్యాత్మిక ప్రవచనంలో ఇది చాలాసార్లు విన్నాను’ విసుగ్గా చెప్పింది.
‘అదే దేవుడి మాట. ఆయన మాట మనల్ని తాకినప్పుడు మనం ఆ ప్రకారం ప్రవర్తిస్తే దాని ప్రతిధ్వని ఆయనకి చేరుతుంది. అలా ప్రవర్తించకపోతే ఆయన చెప్పింది మనల్ని తాకినట్లు కాదు. పరమాత్మ ఆదేశాల విషయంలో మనం సొరంగంలా ఉండాలి తప్ప ఆరుబయలులా ఉండకూడదు. దీన్ని మన జీవితంలో ఆచరించాలి’ తండ్రి బోధించాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి