S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లక్ష్యం (సండేగీత)

ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థులు దృష్టి పూర్తిగా మెడిసిన్ మీదో, ఇంజనీరింగ్ మీదో ఉంటుంది. సర్వశక్తులూ ఉపయోగించి వాళ్లు చదువుతూ ఉంటారు. ఎవరో కొంతమంది ఆ దృష్టిని పక్కన పెడతారు. ఆ తరువాత లీకేజీ గొడవల్లో పడి చిక్కుల్లో పడతారు.
చదరంగం ఆట ఆడే వ్యక్తులు తమ దృష్టినంతా ఆట మీదే పెడతారు. ప్రతి ఆటగాడూ అంతే.
మన జీవితంలో మనం ఏం కావాలని అనుకుంటున్నామో నన్నది అన్నిటికన్నా ముఖ్యం. డాక్టర్ కావాలని అనుకుంటున్నామా? ఇంజనీర్ కావాలని అనుకుంటున్నామా, ఓ గొప్ప క్రీడాకారుడు కావాలని అనుకుంటున్నామా? ఐపిఎస్ కావాలని అనుకుంటున్నామా? రచయిత, కళాకారుడు కావాలని అనుకుంటున్నామా అన్నది ముఖ్యం.
జీవితంలో మనకు ఏది కావాలని అనుకుంటున్నామో దాని మీద మన దృష్టిని కేంద్రీకరించాలి. అదే మన ప్రయాణాన్ని గమ్యాన్ని నిర్దేశిస్తుంది. మనం కావాలని అనుకున్న దాని మీద మన కాలాన్ని వెచ్చించాలి. అలా కాకుండా డాక్టర్ కావాలనుకొని పరీక్ష లీకేజీల మీద మన దృష్టిని కేంద్రీకరిస్తే ఇబ్బందుల్లో పడతాం.
జీవితంలో అత్యంత ముఖ్యమైంది కాలం. మనం దేన్నైనా తిరిగి పొందగలం కానీ కాలాన్ని తిరిగి పొందలేం. అందుకని జీవితంలో మనం ఏం సాధించదల్చుకున్నామో దాని మీదనే మన కాలాన్ని వెచ్చించాలి. దీనే్న లక్ష్యం అని కూడా అనవచ్చు.
కొంతమంది మాత్రమే లక్ష్యం లేకున్నా, వాళ్ల జీవితాల్లోని మలుపుల వల్ల అనుకోకుండా ఓ లక్ష్యం వైపు ప్రయాణం చేస్తారు. ఈ పరిస్థితి అందరి జీవితంలో వుండదు.
జీవితమనేది మనం కేంద్రీకరించిన విషయాన్నిబట్టి ఉంటుంది. మనం మన జీవితంలో కేంద్రీకరించాల్సిన విషయం తెలుసుకొని ఆ విషయం మీద మన సర్వశక్తులనీ కేంద్రీకరించాలి. దాని మీదే మన సమయాన్ని వెచ్చించాలి.