S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క్లౌడ్ కంప్యూటింగ్

గతంలో కంప్యూటింగ్ అన్నది ఒక ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పై ఆధారపడి ఉండేది. రూటర్స్, డేటా పైప్స్, హార్డ్‌వేర్ మరియు సర్వర్లు. ఈ అంశాలు అదృశ్యమై పోలేదు. కానీ, వనరులను మరియు సర్వీసులను అందించడం అన్నది ఒక మోడల్‌కు చేరి, అక్కడ్నుంచి అవసరమైన విధానాలన్నింటిని ఖర్చు చేయటం కోసం ఇంటర్నెట్ ఉపయోగించబడుతుంది. ఈ మోడల్ వలన కలిగే ప్రథమ ప్రయోజనం స్వల్పమైన ఖర్చు. క్లౌడ్ కంప్యూటింగ్ వలన, ఒక్క అప్లికేషన్, అనేక మందికి ఒకేసారి సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి వస్తుంది. గూగుల్ జి-మెయిల్ వంటి వెబ్ ఆధారిత ఇ-మెయిల్ క్లౌడ్ కంప్యూటింగ్‌కు ఒక ఉదాహరణ. క్లౌడ్ కంప్యూటింగ్ విధానాన్ని అర్థం చేసుకోవటానికి, లేయర్లుగా విడదీసి, ఆలోచించటం వలన ప్రయోజనకరంగా ఉంటుంది. ఉపయోగించే వారికి కనిపించేవి ముందు భాగపు లేయర్లు. ఉదాహరణకు ఫేస్‌బుక్‌లో ఇంటరాక్ట్ కావటం. వెనుక భాగపు లేయర్లు, ఉపయోగించే వారు ముందు భాగంలో చూసే అంశాలను సక్రమంగా నడిపించే హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉంటుంది. అదంతా ఒక ప్రత్యేక మెషీన్‌లో నిక్షిప్తమై ఉన్నట్లుగా కంప్యూటర్లు ఒక నెట్‌వర్క్‌లో ఏర్పాటై ఉండటం వలన దాని వినియోగం వల్ల మొత్తం సమిష్టి శక్తి ప్రయోజనాన్ని పొందవచ్చు.

-మాన్‌సింగ్