S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మీకు మీరే స్ఫూర్తి

తెలియడం, చేయడం మధ్య ఉండే దూరమే ఎక్కువ మందిని పరాజితులను చేస్తుంది.
గ ప్రతి ఒక్కరికి తమ కలలు సాకారం చేసుకునేందుకు ఏమి చెయ్యాలో తెలుసు. కాని వారి విజ్ఞానాన్ని వినియోగించుకోలేక పోవడానికి నూటొక్క కారణాలు చెబుతారు.
గ మా దగ్గర తగినంత డబ్బు లేదు, మాకు దీని మీద దృష్టి సారించేందుకు సమయం లేదు, సాకారం చేసుకునే నైపుణ్యాలు లేవు, తగిన సాధన సంపత్తి లేదు, మాకు అంత ఓర్పు లేదు, అంత సాహసం చేయలేము.. ఇలా ఎనె్నన్నో కారణాలు వల్లిస్తారు.
గ అసలు సంగతి ఏమిటంటే ఇటువంటి కారణాలు చెప్పేందుకు వినియోగించే శక్తిలో సగం శక్తిని వినియోగిస్తే చాలు వారు వారి లక్ష్యాలను చేరుకోగలుగుతారు.
గ ‘చేయడానికి’ కావల్సిన ప్రేరణ, లేదా స్ఫూర్తి పొందితే ఇంకేముంది సులువుగా లక్ష్యానికి చేరువ అవుతారు.
గ అయితే ఎవరికి ఎవరూ స్ఫూర్తిని కల్గించరు. ఎవరికి వారే తమకు తాము స్ఫూర్తి కల్గించుకోవాలి.
గ మనల్ని మనం స్ఫూర్తి కల్గించుకోడానికి అలవడితే సులువుగా మనం ఇతరులకు స్ఫూర్తి కల్గంచగల్గుతాము.
స్ఫూర్తి కల్గించుకోవడం...
గ రోడ్డు తుది భాగం వరకు వెళ్లి ఇక రోడ్డు లేదని తెలుసుకుని వెనుదిరిగి సరియైన రోడ్డు కోసం వెదుక్కోవడం వంటిది వైఫల్యం అంటే.
గవిజేతలకు నిందించే సమయం ఉండదు. తర్వాత రాబోయే సవాళ్లను ఎదుర్కొనే బిజీలో ఉంటారు.
గ విజయానికి మించిన ప్రేరణ మరొకటి ఉండదు.
గ ఏదైనా పెద్ద లక్ష్యాన్ని ఏర్పరచుకొని వైఫల్యం చెందడం.. ఏమీ చేయకపోవడమే విజయం అనుకునే దానికన్నా ఎంతో గొప్పది.
గ మీరు ఏమి చేస్తున్నారు, మీ గమ్యంలో ఎక్కడ వున్నారో మీకు తెలిసినంతసేపు మీరు చేసే కృషిని సమర్థించుకుంటూ ఇతరులకు వివరించవలసిన అవసరం లేదు.
గ చరిత్రలో సాధించిన విజయాలన్నీ మనిషి ఆలోచనలు, కృషి ఫలితంగా లభించినవేనని మరచిపోకూడదు.
గ మీ ఎదుగుదలను అడ్డుకునే వారిని మీరు పట్టించుకోవలసిన పని లేదు.
గ విజయ సాధనే మీ లక్ష్యంగా పెట్టుకుని నమ్మకంతో కృషి చేయాలి.
గ మీరు లక్ష్య సాధనలో ఎంత దూరం వెళ్లారనే దానికన్నా ఆ దిశలో వెడుతున్నారా లేదా అనేది చాలా ముఖ్యం.
గ గట్టి నేల మీద వున్నప్పుడే మీరు వెళ్లాల్సిన మార్గాన్ని ఎంచుకోవాలి గాని ఇసుక నేలలో దిగబడి దిగులుగా ఉండిపోకూడదు.
గ మీ లక్ష్యం స్పష్టంగా ఉండాలి. మీ మార్గదర్శక విధానాలు అవసరాన్నిబట్టి మార్చుకుంటూ ఉండాలి.
గ తర్వాత అనేది ఎప్పుడూ రాదు. ఇప్పుడు అనేది మాత్రమే ఉంటుంది.
గ ఇతరులు ఆశించే స్థితికి మీరు ఎప్పుడూ వెళ్లలేరు. మీరు ఏ స్థితికి వెళ్లాలనుకుంటారో ఆ స్థితికి వెళ్లగల్గుతారు.
గ చాలామందికి ప్రతిభ ఉంటుంది. కాని వారిలో కొద్దిమంది మాత్రమే గొప్పవారవుతారు. ఉన్నత స్థితికి వెళ్లే సామర్థ్యం ప్రతిభలోకన్నా కృషిలో ఎక్కువ ఉంటుంది.
గ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మంచిగానే ఉంటారు.
గ ఉద్దేశాలు పరిగణనలోకి రావు. చర్యలే పరిగణనలోకి వస్తాయి.
గ మీరు తప్పించుకోలేని కొన్ని పనులు అనివార్యంగా చేయవలసి ఉంటుంది. వాటిని సంతోషంగానా? అయిష్టంగానా? చేయడం అనేది మీరే నిర్ణయించుకోవాలి.
గ లక్ష్యం లేకపోవడం అనేది లక్ష్యాన్ని చేరుకోలేక పోవడం అనే దానికన్నా ఎంతో భయంకరమైనది.
గ మీరు ఏమిటి అనేది ముఖ్యం గాని గతంలో లేదా భవిష్యత్‌లో మీరేమిటి అనేది అప్రస్తుతం అవుతుంది.
గ మీరు అనుకున్న దానికి మించి ఎప్పుడూ సాధించలేరు.
గ ఎక్కడికి వెళ్లాలో మీకే తెలియనప్పుడు, ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా నిష్ప్రయోజనమే.
గ ఏమి చెయ్యకపోవడంకన్నా ఏదో కొంత సాధించడం మేలు.
గ విజయం సాధించాలనే ప్రేరణ మీకు ఉన్న విజ్ఞానం, లేదా శిక్షణ కన్నా ఎంతో విలువైనది.
గ మీ జీవితంలో మీరు చేసే పెద్ద తప్పు, తప్పు చేస్తామనే భయంతో రిస్కు తీసుకోకపోవడమే.
గ విపత్తును తప్పించుకోవడం వల్ల మీరు పొందే స్ఫూర్తి ప్రశాంతతను పొందడం వల్ల వచ్చేదానికన్నా అధికంగా ఉంటుంది.
గ మీకు అడ్డుగా నిలిచే మొదటి వ్యక్తి మీరేనని మరువకండి.
గ మీ మనసు కదలాలంటే ముందు మీ శరీరాన్ని కదిలించాలి.
గ మీ శరీరాన్ని కదిలించాలంటే మీ మనసును కదిలించాలి.
గ రేపు వస్తుందనే గ్యారంటీ లేదు. అందుకే ఈ క్షణమే చేసెయ్యండి ఏ పని అయినా.
గ మీ ఆలోచనా శైలి మారితే మబ్బులు తొలగి సూర్యుడు కన్పిస్తాడు.
గ ఆందోళన మీ మనసును మార్చివేస్తుంది.
గ మీ అదృష్టాన్ని ఎవరూ అదుపు చేయలేరు. దానిని అదుపు చేసుకునేది మీరు మాత్రమే.

-సి.వి.సర్వేశ్వరశర్మ