S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంతర్గత సంతోషం (సండేగీత)

ఆనందం, సంతోషం గురించి ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. ఈ మధ్య ఓ మిత్రునితో ఈ విషయం గురించి చర్చ జరిగింది. సంతోషం అనేది భౌతికమైనది కాదు. అది అంతర్గతమైనదని చెప్పాను. అతను ఏకీభవించలేదు. నిజానికి ఇది ఏకీభవించటం అంత సులువైన విషయం కాదు. కొన్ని సంఘటనలని గమనిస్తే తప్ప ఈ విషయాన్ని అంగీకరించటం కష్టం.
మాకో మిత్రుడుండేవాడు. మాకెవరికీ కార్లు లేనప్పుడు అతనికి మారుతి కారుండేది. కల్సినప్పుడల్లా కారు గురించి ఓ ఐదు నిమిషాలు చెప్పేవాడు. ఆ మాటల్లో గర్వంతో బాటూ సంతోషం కూడా కన్పించేది. ఆ సంతోషం అతనిలో ఎక్కువ కాలం నిలువలేదు. అతని ఇంటి దగ్గర్లోనే ఉన్న మరో మిత్రుడు హోండా సిటీ కారు కొన్నాడు. అప్పటి నుంచి మా మొదటి మిత్రునిలో సంతోషం తగ్గిపోయింది. హోండా సిటీ కారుని చూసినప్పుడల్లా అతను బాధలో మునిగిపోయేవాడు. ఎవరి దగ్గరా కారు లేనప్పుడు ఓ నాలుగు సంవత్సరాలు ఆనందంగా వున్న వ్యక్తి, ఆ ఆనందాన్ని కోల్పోవడానికి కారణం ఏమిటీ? అతను తన కారులో సంతోషం చూసుకోలేదు. ఎవరికీ లేనప్పుడు తనకి కారు ఉండటం అతనికి ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. భౌతికమైన సంతోషం హోండా సిటీ కన్నా పెద్ద కారు కొనుక్కున్నప్పుడు మళ్లీ అతనికి తిరిగి రావచ్చు. మళ్లీ పోవచ్చు. ఇవన్నీ తాత్కాలికమైన సంతోషాలు. శాశ్వత సంతోషాన్ని ఇచ్చేది అంతర్గత పని. దానే్న అంతర్గత సంతోషం అనవచ్చు.
ఆత్మతృప్తి ఎక్కువ సంతోషాన్నిస్తుంది. ఈ సంతోషాన్ని పొందడానికి ఎక్కువ శ్రమించాల్సిన అవసరం లేదు. ఇది సులువుగా లభిస్తుంది.
మనకు ఎవరైనా సహాయం చేసినప్పుడు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పినప్పుడు సంతోషం వేస్తుంది. ఎవరికైనా సహాయం చేసినప్పుడు సంతోషం వేస్తుంది. మనకు వచ్చిన పంటని, మనకు నచ్చిన స్వీట్స్‌ని పంచుకోవడంలో సంతోషం లభిస్తుంది. చిన్నచిన్న పనుల్తో ఎంతో సంతోషాన్ని పొందవచ్చు. సంతోషం అనేది మన చుట్టూ ఉంది. దాన్ని అందుకోవడంలోనే మన నైపుణ్యం దాగి ఉంది. సమృద్ధిగా ఉన్న ఈ సంతోషాన్ని స్వాధీనం చేసుకోవాలి. అవసరానికి మించి ఆక్రమించుకున్నా తప్పులేదు. ఎందుకంటే సంతోషం అనేది అంటువ్యాధి లాంటిది. ఇతరులకు సంక్రమిస్తుంది.
ఎదుటి వ్యక్తుల్లో సంతోషం నింపడంలో సంతోషం ఉంది. పాటలు వింటే సంతోషం వేస్తుంది. చిన్ననాటి స్నేహితులని కలిస్తే సంతోషం లభిస్తుంది.
ఈ సంతోషాలు మాయం కావు. భౌతికమైన సంతోషంలా.