S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చిన్న అబద్ధం (స్ఫూర్తి)

‘నాన్నా! ఖాళీ అగ్గిపెట్టెలతో ఇల్లు కట్టడానికి సహాయం చేస్తానన్నావు. ఇప్పుడు చేస్తావా?’ పల్లవ్ అడిగాడు.
‘నువ్వు సిద్ధంగా ఉంటే చేద్దాం’ తండ్రి జవాబు చెప్పాడు.
ఆయన తన బల్ల మీద ఉన్న అన్నిటినీ తీసేసి, జిగురు, రంగు కాగితాలు, కత్తెర తెచ్చి కొడుకుతో చెప్పాడు.
‘ఇప్పుడు ఖాళీ అగ్గిపెట్టెలని తీసుకురా’
వాటిని తన బల్ల మీద ఉంచి అడిగాడు.
‘ఈ సాయంత్రం అమూల్ వస్తే వాడితో ఆడతానని చెప్పావు కదా?’
‘అమూల్ వెళ్లిపోయాడు. నేను ఈ ఇల్లు పనిని పూర్తి చేయాలనుకున్నాను. అందుకని నాకు హోం వర్క్ ఉందని చెప్పి పంపించేసాను’ పల్లవ్ చెప్పాడు.
ఆయన అగ్గిపెట్టెలని మోడల్‌గా పేరుస్తూ ఆగి, కొడుకు వంక చూసి అడిగాడు.
‘అంటే నువ్వు అబద్ధం ఆడావా?’
‘అబద్ధం అంటే అబద్ధం కాదు. నేను హోంవర్క్ చేయాలి. ఈ పని పూర్తయ్యాక చేస్తాను’
‘కాని నువ్వు కావాలనే అమూల్‌తో హోంవర్క్ ఇప్పుడే చేస్తావని చెప్పావు కదా? అది ఓ విధంగా అబద్ధమే కదా?’
‘మరేం చెప్పను? ఇంటికి వెళ్లు. నీతో ఆడను అని చెప్పనా? నేను చెప్పింది చిన్న అబద్ధం మాత్రమే. నేను అబద్ధం ఆడానని వాడికి తెలీదు కాబట్టి బాధ పడడు. అసలు నేను ఇప్పుడు హోంవర్క్ చేస్తున్నానో లేదో కూడా వాడికి తెలీదు’
‘అన్ని అబద్ధాలు అవి చెప్పిన వారిని బాధించి తీరుతాయి. అమూల్‌తో నువ్వు అగ్గిపెట్టెలతో ఇల్లు కట్టే పని చేస్తున్నావని, తర్వాత హోంవర్క్ చేస్తానని చెప్పాల్సింది’
ఇద్దరూ వౌనంగా అగ్గిపెట్టెలని చిన్న ఇల్లు ఆకారంలో అతికించారు. తర్వాత దానికి రంగు కాగితాలని అంటించారు.
‘ఇల్లు ఎంత బావుందో?’ పూర్తయ్యాక పల్లవ్ చెప్పాడు.
దాన్ని ఉంచడానికి పల్లవ్ దొడ్లోని చెక్క పలకని, ఇటుక రాళ్లని తెచ్చి, నాలుగు ఇటుకలని రెండు వైపులా ఆధారాలుగా ఒక దాని మీద ఒకటి ఉంచి దాని మీద చెక్కని పరిచాడు.
‘దానె్నందుకు తెచ్చావు?’ చెప్పి తండ్రి ఆ చెక్కని బయటకి తీసుకెళ్లి విరిచాడు. అది మధ్యకి రెండుగా విరిగిపోయింది.
‘అదేమిటి? అలా ఎలా విరిగిపోయింది?’ పల్లవ్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘చెదలు. అవి లోపల నించి చెక్క బలహీనపడేలా తినేస్తాయి. దాంతో చెక్క విరిగిపోతుంది’
కొద్ది క్షణాలు ఆగి ఆయన మళ్లీ చెప్పాడు.
‘చెద పురుగులు చాలా చిన్నవి. కాని అన్నీ కలిస్తే అవి చాలా నష్టాన్ని కలిగిస్తాయి. అబద్ధాలు కూడా అంతే. చిన్న అబద్ధాలు కూడా నీ మాటల మీద విశ్వాసాన్ని తినేస్తాయి’
‘సారీ! అమూల్‌ని నేను ఆడుకోడానికి రమ్మంటాను’ చెప్పి పల్లవ్ వాడికి ఫోన్ చేసి, తను అబద్ధం చెప్పిన సంగతి చెప్పి క్షమాపణ వేడుకున్నాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి