S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుష్పాలు (సండేగీత)

పువ్వులు చిన్నపిల్లల్లా సున్నితంగా ఉంటాయి. పువ్వులని ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. దేవుడికి కూడా పూలు ఇష్టమే. ఆయనకి ఇష్టమో కాదో మనకు తెలియదుగానీ దేవుడిని పూలతో అలంకరిస్తాం. ఆరాధిస్తాం. ప్రేయసికే కాదు భార్యకి పూలని కానుక ఇస్తే వాళ్లు ఆనందిస్తారు. చాలామంది కవయిత్రులు తమ మొదటి కవితా సంపుటాలకి పుష్పాల అర్థం వచ్చే పేర్లు పెట్టుకున్నారు.
మన దేశంలో పూలు తోటల్లో కన్పిస్తాయి. అమెరికా లాంటి దేశాల్లో రోడ్ల మీద ఎన్నో పుష్పాలు కన్పిస్తాయి. వాటిని ఎవరూ తుంచిన పాపాన పోరు. చాలామంది ఇళ్ల ముందు కూడా గుత్తులు గుత్తులుగా పుష్పాలు కన్పిస్తాయి. వాటిని వాళ్లు అలాగే ఉంచేవారు. ఆ పుష్పాలను చూస్తుంటే ఆనందమే కాదు ఆహ్లాదం కూడా అన్పిస్తుంది.
ఎవరినైనా అభినందించాల్సి వచ్చినప్పుడు మనం ఎక్కువగా పుష్పాలనే ఎంచుకుంటాం. అదే విధంగా చనిపోయిన వ్యక్తులని సందర్శించినప్పుడు కూడా పూలని ఎక్కువగా వాడతాం. సంతోషానికి, విషాదానికి రెండింటికి పూలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అదే విధంగా అనారోగ్యంగా ఉన్న వాళ్లని చూసినప్పుడు కూడా అప్పుడప్పుడు పూలని ఉపయోగిస్తాం. మంచిని అనుభూతి చెందాలని ఆకాంక్షిస్తాం.
రకరకాల పూలు, రంగురంగుల పూలు... సువాసనని వెదజల్లే పూలు, కంటికి ఇంపు కలిగించే పూలు. పుష్పాలు ఒక ప్రేమపూర్వకమైన అనుభూతిని కలిగిస్తాయి. ఉత్సాహాన్ని కూడా నింపుతాయి. స్ఫూర్తిని వెదజల్లుతాయి.
మన మూడ్‌ని మార్చేస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. పుష్పాలని మనకు ఎవరో ఇవ్వాల్సిన పనిలేదు. మనకు మనం కూడా ఇచ్చుకోవాలి.
పుష్పగుచ్ఛాలు త్వరగా వాడిపోతాయి. వాటికి బదులుగా కృత్రిమ పుష్పగుచ్ఛాలు ఇస్తే అవి ఎక్కువకాలం ఇంట్లో వుంటాయన్న ప్రతిపాదన ఒకసారి నేను అకాడెమీలో పని చేస్తున్నప్పుడు వచ్చింది. దాన్ని వ్యతిరేకించాను. నిజమైన పుష్పాలు ఇచ్చే అనుభూతిని ఆనందాన్ని అవి ఇవ్వవని వాదించాను. చివరికి నా మాటనే అందరూ అంగీకరించారు.
పుష్పాలు ఇంట్లోనే కాదు ఆఫీసుల్లో వుంటే అవి ఎక్కువ శోభని ఇస్తాయి. ఉత్పత్తి కూడా పెంచుతాయి. ఆనందాన్ని ఇస్తాయి. మనుషులని ఆనందంగా ఉంచడమే కాదు పుష్పాలు మెడిసన్‌గా కూడా పని చేస్తాయి.
భూమి పువ్వుల ద్వారా నవ్వుతుంది. సూర్యునిలా వెలుగుతుంది. నవ్వనిద్దాం. వెలగనిద్దాం.