S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మిమ్మల్ని మీరే తీర్చిదిద్దుకోండి!

ప్రతి ఒక్కరూ తాము చేపట్టిన పనిలో విజయం సాధించాలనుకుంటారు. అందరూ అటువంటి వారు సమర్థులే అయినా విజేతలు కాలేరు.
* అది వారి ప్రయత్న లోపమా? తగిన వ్యూహరచన కొరవడా? మరి ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు ఎదురవుతాయి.
* తమని తాము తీర్చిదిద్దుకోవడమే ఎక్కువ మంది విషయంలో పరాజయాలకు కారణం అవుతోంది.
* మనిషిలోని శక్తి, యుక్తికి తోడుగా విశే్లషణ కూడా ఉండాలి. ఫలితాన్ని ఊహించుకుని పని ప్రారంభించాలి.
* ఏ విషయమైనా రెండుసార్లు సృష్టించబడుతుంది. అంటే ముందు మెదడులో చిత్రీకరించబడుతుంది. తరువాత వాస్తవ రూపంలో పని జరుగుతుంది.
* వడ్రంగి పని చేసే వ్యక్తి రెండుసార్లు కొలతలు తీసుకున్న తరువాతనే ఒక్కసారి కోతకు ఉపక్రమిస్తాడు.
* అందుకే మెదడులో మ్యాపింగ్ లేదా కాగితంపై బ్లూ ప్రింటు పూర్తయిన తరువాత పని ప్రారంభించాలి.
* ప్రతి రంగంలోనూ ఇదే సూత్రం పాటించాలి.
విశే్లషణ
* ఎవరికి వారే ప్రత్యేకం. ఏ ఇద్దరూ ఒకేలా ఆలోచించరు. పని చేయరు. ఎవరికి వారే తమను తాము విశే్లషణ చేసుకోవాలి.
* ఇంట విజయం సాధించాలి. అవసరం అయితే ప్రతిభావంతులయిన నిపుణుల సహాయం తీసుకోవాలి.
* పనిలో పాల్గొనే భాగస్వాములను విశ్వసిస్తూ, నిజాయితీగా ఉండాలి.
* రెండు వైపులా విన్న తరువాతనే న్యాయ నిర్ణయం చేయాలి. ఇతరులతో కౌన్సిలింగ్ ముఖ్యం.
* ఎవరైనా హాజరు కాకపోతే వారి తరఫున మాట్లాడాలి. కపట ధోరణి లేకపోవడమే కాదు నిర్ణయం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
* నిరంతరం నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి నిలపాలి.
* ఏ పనికయినా ముందుగా ప్రణాళిక వేసుకోవాలి.
* పనిచేసే యంత్రాంగం మందకొడిగా ఉంటే ఉత్సాహపరచి వేగం పుంజుకునేటట్లు చేయాలి. అనుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి.
* కృషిలోను, వ్యక్తిగాను క్రమశిక్షణ పరిధిలోనే ఉండాలి.
* సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ, తప్పులు జరుగుతాయనే భయంతో ఉండకూడదు.
* తప్పులు జరిగితే కృంగిపోక మీలోని సృజనాత్మకత, సరిదిద్దుకునే శక్తి కోల్పోకుండా జాగ్రత్త పడాలి.
* మీ వద్ద పనిచేసే వారికి విజయ మార్గాలు సుగమం చేయాలి.
* మీతో మాట్లాడేవారు వచ్చినపుడు రెండు మూడు పర్యాయాలు వారు మాట్లాడేది విని ఒక పర్యాయం మీరు మాట్లాడాలి.
* చేసే పని మీద మీకున్న శక్తి సామర్థ్యాలు, అన్ని వనరులు కేంద్రీకరింపజేయాలి. పని చేసే సమయంలో పదోన్నతి గురించి గాని, ఇతర పనుల గురించి గాని ఆలోచించకూడదు.
ఆడవారి విషయంలో...
* ఆడవారి దృక్పథాలు కొంచెం భిన్నంగా ఉంటాయి.
* పని పట్ల, కుటుంబం పట్ల బాధ్యత, దృష్టి సమానంగా ఉంచాలి. ఈ రెండూ వారికి చాలా ముఖ్యమైనవి.
* ఇంటి వద్ద కూడా శుభ్రమైన, క్రమశిక్షణతో కూడిన వాతావరణం సృష్టించాలి.
* ఇంటి సభ్యులు ఎవరూ ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా సుఖంగా జీవించే విధంగా చర్యలు తీసుకోవాలి.
* ఇంటికి వచ్చే స్నేహితులు, అతిథులు, ఇతరులు కూడా హాయిగా ఉండేటట్లు ఇంటిని తీర్చిదిద్దాలి.
* కుటుంబ సభ్యులు ఏమి తినాలి, ఏమి చదవాలి, ఏమి చేయాలి, ఏమి చూడాలి అనే విషయాల్లో మార్గదర్శకంగా ఉండే విధంగా వివేకంతో ప్రవర్తించాలి.
* పిల్లల్ని అభిమానంగా చూసుకుంటూ, ప్రేమిస్తూ ఉండాలి. పిల్లలకు నేర్చుకోవడం, ప్రతిభలను మెరుగుపరచుకోవడం వంటి విషయాలపై దృష్టి నిలపమని ప్రోత్సహించాలి.
ధోరణి మారాలి
* ఏదైనా సంఘటన జరిగితే తటస్థంగా ఉండి అది జరగకుండా ఉండాల్సిందని భావించకూడదు. దానిని జాగ్రత్తగా విశే్లషణ చేసుకుంటే దానిలో దాగి వున్న అవకాశాలు తెలుస్తాయి.
* పరిస్థితులను అవాస్తవికంగా ఊహించుకుని భవిష్యత్ అగమ్యగోచరంగా ఉంటుందని భయపడి దయనీయంగా మారిపోకూడదు.
* చేయాల్సిన పనుల గురించి ఆలోచించడం అలవరచుకోవాలి. దీని వలన మీలో పోరాట పటిమ పెరుగుతుంది.
* ఆలోచనలు పెడదారి పట్టకుండా జాగ్రత్త పడాలి. వర్తమానంపై దృష్టిని కేంద్రీకరించాలి.
* ఉద్యోగం డబ్బు సంపాదన కోసమే అనే ఆలోచన నుండి బయటపడాలి.
* పనిలో తృప్తి కోసం వెతికితే దొరకదు. శ్రమలో సంతృప్తి అనేది మనిషి అంతరాంతరాళాల నుండి తన్నుకు వస్తుంది.
* ఇటువంటి సంతృప్తి మనిషి పొందగల్గితేనే జీవితం యొక్క లోతైన పరమార్థం అతనికి తెలిసినట్లు.
* ఈ పరమార్థం తెలియకపోతే మనిషి పనిచేస్తూ కొవ్వొత్తిలా కరిగిపోతాడు.

-సి.వి.సర్వేశ్వరశర్మ