S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దేవుడి ఇష్టం

స్కూల్ నించి తిరిగి వచ్చిన నేత్రజ్ తల్లితో చెప్పాడు.
‘అమ్మా! నా ఫ్రెండ్ దేవయానికి మళ్లీ చెల్లెలే పుట్టింది. దాంతో వాళ్లమ్మని, పిల్లని దేవయాని తండ్రి ఇంట్లోంచి పంపించేశాట్ట’
‘అయ్యో పాపం!’
‘ఆయనకి కొడుకు కావాలని ఉందిట. ఆయన దేవుడ్ని కొడుకు కోసం ప్రార్థించాడట కూడా. వాళ్ల అమ్మమ్మ వచ్చి ఆయనతో మాట్లాడుతుందిట’
నేత్రజ్ తల్లి వెంటనే చెప్పింది.
‘నేను మాత్రం కూతురు కావాలని దేవుడ్ని ప్రార్థించాను. కానీ నువ్వు పుట్టావు. తర్వాత నేను దేవుడ్ని ప్రార్థించలేదు. ఐనా చెల్లి పుట్టింది’
‘నువ్వు ప్రార్థించినప్పుడు నన్ను దేవుడు కూతురుగా ఎందుకు పుట్టించలేదు?’ నేత్రజ్ ప్రశ్నించాడు.
‘అది దేవుడి ఇష్టం’
‘దేవయాని చెల్లెలు విషయంలో కూడా దేవుడి ఇష్టాన్నిబట్టే కూతురు పుట్టిందా?’
‘అవును. పుట్టేది కొడుకో, కూతురో అనేది దేవుడి ఇష్టమే తప్ప మనది కాదు’
‘నేను కూతుర్ని కానందుకు నువ్వు డిజప్పాయింట్ అయ్యావా?’ నేత్రజ్ కొద్ది క్షణాల తర్వాత ప్రశ్నించాడు.
‘అవును’
‘ఐనా నేనంటే ప్రేమగానే ఉన్నావుగా?’
‘అవును’
‘నేను కూతుర్నైతే బావుండేది’ నేత్రజ్ చెప్పాడు.
‘అప్పుడు డిజప్పాయింటైనా, ప్రేమగానే ఉన్నాను. కూతురైనా, కొడుకైనా మనకి పుట్టిన బిడ్డే కాబట్టి ఆ తేడా చూడకపోతే ఇద్దర్నీ సమానంగా ప్రేమించచ్చు. మన దేశంలో ఎక్కువమంది మగపిల్లలు పుట్టాలని, కూతుళ్లు వద్దని అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో ఎవరైనా ఒకటే. కాబట్టి పెద్దయ్యాక నువ్వు కూడా నీ ఫ్రెండ్ తండ్రిలా కొడుకే లేదా కూతురే కావాలని అనుకోకు. కనే తల్లికి ఎవర్ని కనాలో ఛాయిస్ ఉండదు. ఐనా చాలామంది మూర్ఖంగా కూతుర్ని కన్న భార్యతో తగాదా పడుతూంటారు’ తల్లి హితవు చెప్పింది.
*********************************************

వాక్కు ప్రభావం
-వియోగి
కృపానందస్వామి వారి ప్రఖ్యాతి విని దేశం నలుమూలల నుండి గొప్పగొప్ప వాళ్లు మొదలుకుని బీదా బిక్కీ కూడా వస్తూ ఉంటారు. వారికి ఉన్న సమస్యలనుగాని, రోగాలనుగాని తెలియజేసి అందుకు పరిష్కారం తీసుకుని వెళుతూ ఉంటారు.
గొప్ప విషయం ఏమిటంటే స్వామివారికి అందరూ సమానులే! మహారాజును, అడుక్కుతినే వాడిని ఒక్కలాగే చూస్తారు. తన దగ్గరికి వచ్చిన వారి నుండి ఏమీ తీసుకోరు. ఇవ్వడమే గాని పుచ్చుకోవడం ఎరుగని యోగ పురుషులు ఆయన.
ఒకరోజు ఆయన సందర్శనార్థం పొరుగు రాజ్యం మహామంత్రి జయసేనుడు వచ్చాడు మందీ మార్బలంతో. కానీ ఆ సమయంలో కృపానంద స్వామి వారు పూజలో ఉన్నారు.
శిష్యులు వారిని బయట కూచోబెట్టారు ఉచిత మర్యాదలు జరిపి.
కాలం నడుస్తున్నది. సూర్యుడు తూర్పు నుండి నడినెత్తి మీదికొచ్చాడు. అయినా స్వామివారు ఇంకా పూజలోనే ఉన్నారు. మహామంత్రి గత్యంతరం లేక అలానే కూర్చున్నాడు. కానీ అతనితోపాటు వచ్చిన దండనాయకుడు వీరమల్లుకు సహనం నశించిపోయింది.
‘ఏమయ్యా! శిష్యా! మహామంత్రి జయసేనుల వారు స్వామివారి అనుగ్రహం కోసం వచ్చారని విన్నవించావా?’ దబాయించాడు గట్టిగా.
‘అయ్యా! ఉదయానే్న వారికి విన్నవించాను. కానీ వారు అత్యవసర పూజలో ఉన్నారు కూచోమని సమాధానం చెప్పారు. ఆ సంగతి మహామంత్రి వారికి విన్నవించాను కూడా’ మంజునాథుడు చెప్పాడు.
‘మహామంత్రిగారి సమయం అమూల్యం! వారికి ఎన్నో రాచకార్యాలు ఉంటాయి. ఇలా గోళ్లు గిల్లుకుంటూ ఎంతసేపు కూర్చోవాలి. కాస్త బయటకొచ్చి నాలుగు మాటలు మాట్లాడి పొమ్మని చెప్పండి మీ గురువుగారికి! మేం వెళ్లాలి’ కోపంగా చెప్పాడు వీరమల్లు.
‘వారిని పూజ మధ్యలో లేపకూడదు. పూజకు ఎటువంటి ఆటంకాలు సంభవించకూడదు. అందుకని మేము వారికి చెప్పలేము’ మంజునాథుడు చెప్పాడు భయంగా.
‘వచ్చింది ఎవరో తెలిస్తే పూజను ముగించుకొని తనే వస్తారు. వీరి దర్శనం కోసం రోజూ కొన్ని వందల మంది ఎదురుచూస్తూ ఉంటారు. వారి సమ్మతి లేకుండా మా రాజ్యంలో ఒక్క కార్యం కూడా కాదు’ దండనాథుడు చెప్పాడు దర్పంగా.
‘వీరమల్లూ! మనం దర్శనం కోసం వచ్చాం. మనకి సహనం అవసరం. మనం వేచి ఉందాం!’ జయసేనుడు చెప్పాడు దండనాథుడిని వారిస్తూ.
‘మీరుండండి. వీళ్లు చెప్పినట్లు లేదు. నేనే పోయి చెప్పి వస్తాను’ అంటూ వీరమల్లు అడ్డువచ్చిన శిష్యులను నెట్టుకుంటూ లోపలికి వెళ్లాడు. అక్కడ నిశ్చల ధ్యానంలో వున్న స్వామి కృపానందను చూశాడు.
కాసేపు నిలబడి దగ్గాడు.
కృపానందం స్వామి వారు ధ్యానంలో వున్నారు. లేవలేదు.
‘స్వామీ! కొంచెం మా మహామంత్రి జయసేనుడితో మాట్లాడండి’ వీరమల్లు గొంతెత్తి అరిచి చెప్పాడు ధ్యానానికి భంగం కలిగిస్తూ.
స్వామివారు కళ్లు తెరచి చూశారు. ఆయన కళ్లు ఎర్రగా తీక్షణంగా ఉన్నాయి. దండనాథుడిని చూశారు. అతను ఆ తీక్షణతకు జంకి విన్నవించుకున్నాడు. ‘స్వామీ నందవరం రాజ్యం మహామంత్రి జయసేనుడు తమరి దర్శనార్థం వచ్చారు. ఆయన వచ్చి చాలా సేపయింది. ఆయనకి రాచకార్యాలు ఎన్నో ఉన్నాయి. ఊపిరి ఆడనటువంటి పనుల ఒత్తిడిలో కూడా మిమ్మల్ని కలవాలని వచ్చారు. మీరు దయతలిస్తే, మీతో మాట్లాడి ఆయన తన రాచకార్యాలు కొనసాగిస్తారు. కొంచెం వారి పనుల ఒత్తిడిని అర్థం చేసుకుని అనుగ్రహించండి’
‘ఆహా! వచ్చే మాసంలో ఆయన తీరిగ్గానే ఉంటారు. అప్పుడు వచ్చి కలవమని చెప్పు’ అని ఆజ్ఞాపించి కళ్లు మూసుకున్నారు స్వామివారు.
చేసేదేమీ లేక దండనాథుడు బయటకొచ్చి స్వామివారి మాటలను తెలియజేశాడు మహామంత్రికి.
‘మూర్ఖుడా! ఎంత పని చేసావు!’ అని కోపంగా అరిచి తిరుగుముఖం పట్టాడు మహామంత్రి.
తన పరివారం బుద్ధిమాంద్యానికి బాగా విచారించాడు.
అనూహ్యంగా ఒక మాసంలోపే మహామంత్రి జయసేనుడి పదవి పోయింది. గిట్టని వాళ్లు ఆయనపైన రాజుగారికి పితూరీలు చెప్పారు. వెంటనే రాజుగారు అతనిని పదవి నుండి తీసివేసి నగర బహిష్కరణ విధించారు.
ఇప్పటికీ జయసేనుడు విచారిస్తూ ఉంటాడు ఇదంతా స్వామివారి వాక్కు ప్రభావం అని, వాక్కు మహిమని.
******************************************
ప్రపంచ శాస్తవ్రేత్తలు
-పి.వి.రమణకుమార్
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మహాశయుడు 1878 మార్చి 14న జర్మనీలోని ఉల్మ్ అనే నగరంలో జన్మించాడు. విచిత్రం ఏమిటంటే మూడో సంవత్సరం దాటేదాకా ఐన్‌స్టీన్‌కు మాటలు రాలేదు. తల్లిదండ్రులు బాధపడ్డారు. తల్లి గొప్ప సంగీత విద్వాంసురాలు. కొడుకును ఒళ్లో పెట్టుకుని సంగీతం పాడుతూ ఐన్‌స్టీన్‌కు నేర్పే ప్రయత్నాలు చేసేది. ఆరో సంవత్సరం తర్వాత ఐన్‌స్టీన్‌కు మాటలు వచ్చాయి.
తండ్రి వ్యాపారం పూర్తిగా దివాలా తీయటంతో ఇటలీ దేశంలో అదృష్టం పరీక్షించుకుందామని అక్కడికి వెళ్లారు. కానీ అక్కడా చుక్కెదురే అయింది. ఐన్‌స్టీన్ మేనమామ జాకబ్ ఐన్‌స్టీన్‌ను స్విట్జర్లాండ్ తీసుకువెళ్లి అక్కడ ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీటు ఇప్పించి, చదివించాడు. చదువు తర్వాత జర్మనీ పౌరసత్వాన్ని వదులుకుని ఐన్‌స్టీన్ స్విస్ పౌరుడిగా మారాడు. అక్కడ బెర్నె అనే పట్టణంలోని ఒక పేటెంట్ ఆఫీసులో ఉద్యోగం సంపాదించుకుని చేస్తున్నా ఆయనలో ఏదో సాధించాలన్న తపన చల్లారలేదు.
ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకుని సొంత ఇంటిలోనే తన మేథస్సుకు పదును పెట్టాడు. అప్పుడు ఉద్భవించిందే సాపేక్ష సిద్ధాంతం. ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఆ సిద్ధాంతం ఆధారంగా ఎన్నో గొప్పగొప్ప ఆవిష్కరణలు జరిగాయి.
శాస్తవ్రేత్తలలోనే ఐన్‌స్టీన్ అగ్రగామిగా పేరు తెచ్చుకున్నాడు. నోబెల్ బహుమతి ఇంటికి వెతుక్కుంటూ మరీ వచ్చింది. ఎన్నో అవార్డులు కుప్పలుగా వచ్చి పడ్డాయి. ఎన్నో సన్మానాలకు ఆహ్వానాలందాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మహాశయుడు ఐన్‌స్టీన్ పత్రికా విలేకరులు భావితరాలకు సందేశం ఇవ్వమని కోరినప్పుడు ఆయన వినమ్రంగా చెప్పిన సమాధానం ఏమిటంటే-
‘నేనేదో సైన్సులో చాలా సాధించానని అనుకున్నాను. చాలా విషయాలు తెలుసు అనుకున్నాను. కానీ నాకిపుడు తెలిసింది. ఏమిటంటే నాకేమీ తెలియదని, నేను సాధించినదేమీ లేదని, నేను చేసిన దానధర్మాలు ఒక లెక్కలోకి రావని, ఈ ప్రపంచంలో కనుక్కోవలసినవి ఎన్నో ఉన్నాయి. కోట్లాది ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. భావితరం చేపట్టవలసిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. పేదవారిని ఆదరించండి..’ అంటూ ఆ మహాశాస్తవ్రేత్త తెలియజేశాడు. ఆయన 1955లో మరణించాడు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి