S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తాగుబోతు పక్షి

రోజుకు ఆరు లీటర్లు నీరు తాగాలని చెబుతూ ఉంటారు. అన్ని కూడా మనం తాగం. హమ్మింగ్ బర్డ్ పక్షితో పోల్చితే మనం ఎన్ని నీళ్లు తాగినా దాంతో పోటీ పడలేం. నిరంతరం నీళ్లలో వుండే చేపలే దానికి సాటిరావు. ఈ పక్షి పుష్పాల మకరందాన్ని తాగుతుంది. ఇందులో 30 శాతం చక్కెర, 70 శాతం నీరు ఉంటుంది. పూలపై వాలుతూ తన పొడవాటి ముక్కుతో హమ్మింగ్ బర్డ్ రోజుకు తన బరువు కంటే 5 రెట్ల మకరందం తాగుతుంది. మన కన్ను గుర్తించలేనంత వేగంగా దీని రెక్కలు కదులుతూ ఉంటాయి. ఇందుకు చాలా శక్తి అవసరం. అందుకే శక్తినిచ్చే చక్కెర కోసం ఇది అంతగా తాగుతుంది. మనిషితో సహా ఏ జంతువైనా సరే కనీసం తన దేహం బరువుకు సమానమైనంత నీరు తాగితే, అలా తాగేలోపే ప్రాణం కోల్పోవటం జరుగుతుంది. హమ్మింగ్ బర్డ్‌కు మాత్రం ఏం కాదు. దాని కిడ్నీలు ప్రకృతిలోకెల్లా అతి శక్తివంతమైనవి. కొంత నీరు చర్మం ద్వారా బయటకు పోయినా, 80 శాతం మాత్రం కిడ్నీల ద్వారానే, వడపోత జరిగి అతి పల్చని మూత్రంగా విసర్జితమవుతుంది. ఉత్తర అమెరికాలో కనిపించే పెద్ద తోక హమ్మింగ్ బర్డ్ (సెలస్ఫోరస్ ప్లేటిసెరస్) రోజుకు తన బరువకు 5 రెట్లు మకరందాన్ని గ్రోలుతుంది.

-నాయక్