S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇంటి నిర్మాణం మొదలుకావడం లేదు (వాస్తు)

ఆర్.దేవి (చిలకలూరిపేట)
ప్రశ్న: మేం ఇంటి నిర్మాణం చేద్దామనుకుంటున్నాం. కానీ ఆ స్థలం కొనుగోలు చేసిన దగ్గర నుండి అసలు ఇంటి నిర్మాణం మొదలు కావడంలేదు. ఈ స్థలంలో ఏవైనా దోషాలు ఉన్నాయా?
జ: మీరు కొనుగోలు చేసిన స్థలానికి సంబంధించి కొన్ని దోషాలు ఉన్నాయి. మీరు మొదటగా ఆ దోష నివారణ చేసుకొన్న తర్వాత ఇంటి నిర్మాణం మొదలుపెట్టండి. అలాగే మీరు కొన్ని నెలల ముందు శంకుస్థాపన చేశామన్నారు. కానీ అలా శంకుస్థాపన చేసిన తర్వాత 21 రోజుల లోపల ఇంటి నిర్మాణం చేయాలి. అలా నిర్మాణం మొదలుకాని పక్షంలో మరలా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించి నిర్మాణం మొదలుపెట్టాలి. మీరు ముందుగా దోష నివారణ చేసుకోండి.
విజయశేఖర్ (తిరుపతి)
ప్రశ్న: మేం ఒక స్థలం కొన్నాం. అందులో ఇంటి నిర్మాణం చేద్దామని 2 సం.లుగా అనుకొంటున్నాం. కానీ ఆ పని జరగడం లేదు. ఏదో ఒక కారణంతో వాయిదా పడుతోంది?
జ: మీ స్థలానికి ఉత్తర వాయవ్య భాగం 5 అడుగుల మేర పెరిగి ఉంది. అది ఒక కారణం. అదే విధంగా ఉత్తర వాయవ్యంలో చిన్న రోడ్డుపోటు ఒకటి ఉంది. ఇది మరో కారణం. ముందుగా పెరిగిన వాయవ్య భాగాన్ని వేరుచేస్తూ ఒక ప్రహరీగోడ నిర్మాణం చేయండి. తర్వాత వాయవ్య వీధి పోటు నివారణ యంత్రాన్ని ప్రతిష్ఠించుకోండి. దీనివల్ల వీధి పోటు దోషం తగ్గి మీ ఇంటి నిర్మాణం మొదలవుతుంది.
పార్వతి (వైజాగ్)
ప్రశ్న: మేం ఒక అపార్ట్‌మెంట్‌లో నైరుతి భాగంలోగల ఫ్లాట్‌లో ఉంటున్నాం. కానీ ఇందులోకి వచ్చిన దగ్గర నుండి నాకు ఆరోగ్యం బాగుండటం లేదు.
జ: మీ ఫ్లాట్‌కి ఆగ్నేయ భాగంలో దిగే మెట్లు ఉన్నాయి. అందువల్లనే ఆడవారికి ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నాయి. అదే విధంగా మెట్ల మధ్యలో లిఫ్ట్ కూడా ఉంది. ఇదొక దోషం. ఆగ్నేయ దోషాలు ఉంటే అవి ఆడవారి మీద ప్రభావం చూపుతాయి. కావున ఆ ఆగ్నేయ దోష నివారణ కోసం యంత్రాలను ప్రతిష్టించుకొని నివారణ పొందగలరు.
కార్తికేయ (తణుకు)
ప్రశ్న: నా పేరు ప్రకారం గృహ నిర్మాణానికి ఏ దిశ యోగిస్తుంది?
జ: మీ పేరునుబట్టి తూర్పు, దక్షిణం రోడ్లుగల ఆగ్నేయం బ్లాకు చాలా బాగా యోగిస్తుంది.
గోపాలరావు (కనిగిరి)
ప్రశ్న: మా ఇంటికి పక్క ఇంటి వాళ్ల వెన్నుపోటు కలుగుతున్నది. పరిష్కారం తెలుపగలరు.
జ: దీనికి సంబంధించి యంత్రాల ద్వారా పరిష్కారం కలదు.
సిహెచ్.రామాంజనేయులు (తాండూరు)
ప్రశ్న: మేం 15 సం.లుగా ఈ ఇంట్లో నివసిస్తున్నాం. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి తరచూ ఆరోగ్యం బాగోలేక పోవడం జరుగుతోంది. కారణం తెలియడం లేదు.
జ: ఇంటి స్థలంలో నైరుతి మూల పెరగడం జరిగింది. అదే విధంగా నైరుతి భాగం ఇంటి కట్టుబడిలో కూడా పెరిగింది. ముందుగా స్థలంలో పెరిగిన నైరుతి భాగాన్ని వేరుచేస్తూ బేస్‌మెంట్ నిర్మాణం చేసి తర్వాత ప్రహరీగోడను నిర్మించుకోండి. దీనివల్ల నైరుతి దోషం పోతుంది. తర్వాత ఇంటి కట్టుబడిలో పెరిగిన నైరుతి దోషాన్ని యంత్రాల ద్వారా సరిచేసుకోండి. ఈ నైరుతి దోషం కూడా తొలగిపోతుంది. మీ ఇంట్లో ఉన్న ఆరోగ్యపరమైన సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
*

-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ -96 42 70 61 28