S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇలా చేయండి

క్రింది వాక్యాల అర్థం, మూడు అక్షరాల మాటలో మధ్య
అక్షరం (ర) వచ్చేటట్లు పూరించండి.
1.ప్రతీ ఇంటికి ఇది ఉండి తీరాలి 2.ఇది చేస్తే జైలుకే 3.దేముడు ఋషులకు ఇచ్చేది 4.ఇది సరిగ్గా ఉంటేనే పాడగలరు 5.టీ (హిందీలో) ఇలా ఉండాలంటారు 6.దేముని దీనితో మొక్కాలి 7.పూజారి ఇది పెడతారు 8.దీంట్లో నుంచే రక్తం పారేది 9.ఇది వస్తే డాక్టర్ని చూడాలి 10.ఈ పాలు కొందరు వైద్యానికి వాడుతారు 11.అనుకోనిది జరిగితే ఇలా అంటారు 12.ప్రయాణాలలో దీనికి భయపడకూడదు 13.చవకగా కొనాలంటే ఇది చేయాలి 14.ప్రతీ రోజు చివర ఇది ఉంటుంది 15.ఇది ఎక్కువైతే మంట పుడుతుంది.
-చామర్తి వెంకట రామకృష్ణ

జవాబులు: 1.ద్వారము 2.నేరము 3.వరము 4.స్వరము 5.గరమ్ 6.కరము 7.శిరము 8.నరము 9.జ్వరము 10.ఖరము 11.ఘోరము 12.దూరము 13.బేరము 14.వారము 15.కారము