S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జీరో (0) --శాస్ర్తియ ఆవిష్కరణలు

సున్నాను క్రీ.పూ.300 సంవత్సరంలో ప్రథమంగా బాబిలోనియాలో ఒక వాలుగా ఉన్న డబుల్ వెడ్జ్ చిహ్నంతో ఉపయోగించినట్లు తెలుస్తోంది. మాయన్‌లు ఒక శిల్పంగా చెక్కిన సంకేత చిహ్నాన్ని ఉపయోగించారు. కాని రెండు సందర్భాలలోనూ జీరో అన్నది ఒక చిహ్నంగానే కనిపించింది. ఒక దృఢమైన పరిమాణం అంటూ లేకుండానే వున్న ఒక చిత్రరూపంలో వున్న ఆకారం ఇది.
మహా వీరుడైన అలెగ్జాండర్ ఇందుకు సంబంధించిన బాబిలోనియా ఆలోచనలను తూర్పు ప్రాంతాలకు పరిచయం చేశాడు. ఫలితంగా ‘సున్నా’ ఒక నిర్దిష్టమైన రూపాన్ని, హోదాను భారతదేశంలో సంపాదించుకోవడం జరిగింది. ఇక్కడ నుంచీ అంటే క్రీ.శ.2వ శతాబ్దం నించీ, సంఖ్యా గణితం, రేఖా గణితం మరియు ఎక్కువగా బీజ గణితం లను క్రీ.శ.500 ప్రాంతంలో భారతీయులు, కచ్చితమైన స్థాన విలువలకు సంబంధించిన దశాంశ విధానాన్ని (డెసిమల్ సిస్టమ్)ను పరిచయంలోనికి తెచ్చారు. వారు 9 అంకెలతో లెక్కించి, సున్నాకు తన యొక్క సామాన్య స్థానాన్ని - 1, మరియు 1ల మధ్య ఏర్పరచారు. అంకెల శ్రేణిలో క్రీ.శ.9వ శతాబ్దంలో గణిత శాస్తజ్ఞ్రుడైన బ్రహ్మగుప్తుడు తన విధాన్‌లో వ్యతిరేక (నెగెటివ్) విలువలను చేర్చాడు. క్రీ.శ.876లో గ్వాలియర్‌లోని ఒక ఆలయ శిల్పకళలో ‘0’ చిహ్నం సున్నాకు ప్రాతినిధ్యం వహిస్తూ కనిపించింది.
జీరోకు సంఖ్యాపరమైన విలువ ఏర్పడిన తర్వాత సున్నాను ఒక ప్రత్యేక మరియు విలువను ఆపాదించే సామర్థ్యంతో ఉపయోగించడం ప్రారంభమైంది. దీనితో గణిత శాస్త్రంలో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించటమే కాకుండా మొత్తం శాస్త్రం యొక్క అదుపునకు అభివృద్ధికి మార్గదర్శకంగా ఏర్పడింది.

-బి.మాన్‌సింగ్ నాయక్