S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ట్రాన్సిస్టర్... శాస్ర్తియ ఆవిష్కరణలు

ట్రాన్సిస్టర్ అన్నది ఒక రకమైన సెమీ కండక్టర్. ఇది లేకుండా కంప్యూటర్‌తో సహా ఆధునిక ఎలక్ట్రానిక్ ఉపకరణాలేవీ పని చేయవు. వేర్వేరు రకాల భిన్నమైన ట్రాన్సిస్టర్లు ఉన్నప్పటికీ అన్నీ కూడా సెమీ కండక్టర్ మెటీరియల్‌కు సంబంధించిన ఒక ఘనపు ముక్క మరియు ఒక బాహ్య వలయానికి కనెక్ట్ అయి ఉన్న కనీసం మూడు టెర్మినల్‌లతో కూడి ఉంటాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం అత్యధిక నిరోధకత గల ఒక పదార్థం గుండా విద్యుత్‌ను ప్రవహింపజేస్తుంది. అందువల్లే ఇది ట్రాన్స్‌ఫర్ రెసిస్టర్‌గా, చిన్నగా చేయబడి ట్రాన్సిస్టర్‌గా పిలువబడుతోంది.
ట్రాన్సిస్టర్ పరిచయం కాకముందు వాక్యూమ్ ట్యూబ్‌ల విధానం ద్వారా పనిచేసేవి. కాని ట్యూబ్‌లు పెద్ద పరిమాణంలో ఉండటమే కాకుండా ఉత్పత్తి చాలా ఖర్చుతో కూడుకున్నదిగా ఉండేది. 1947లో అమెరికన్ భౌతిక శాస్తజ్ఞ్రులైన జాన్ బార్టన్ మరియ వాల్టర్ బ్రాటైన్‌లు బెల్ లాబ్స్‌లా, ఒక జెర్నామియమ్ స్ఫటికాన్ని విద్యుత్ స్పర్శించేట్టు ఏర్పరచినప్పుడు, అక్కడ ఉపయోగించబడిన విద్యుత్ శక్తికన్నా, అది తిరిగి విడుదల చేసిన విద్యుత్ అధికంగా ఉన్నట్లు వారు గమనించారు. అమెరికాకు చెందిన మరో భౌతిక శాస్తవ్రేత్త విలియం షాక్లీ కూడా అందులోగల శక్తిని గమనించాడు. అటు తర్వాత కొద్ది నెలలపాటు ఈ బృందం, సెమి కండక్టర్లకు సంబంధించి తమకు గల పరిజ్ఞానానికి మరింత మెరుగుపరచుకోవటానికి కృషి చేసింది.
ట్రాన్సిస్టర్లు ఒక్కటే విడిగా గాని, లేదా సంపూర్ణమైన ఎలక్ట్రానిక్ వలయాన్ని సృష్టించటం కోసం ఇతర భాగాలతో కలిసి సమగ్ర వలయాలుగా ప్యాకేజీలలో గాని ఉత్పత్తి చేయబడతాయి. ట్రాన్సిస్టర్లు ఈనాడు వాడుకలో వున్న ప్రతి ఎలక్ట్రానిక్ పరికరం లేదా ఉపకరణంలోనూ ఉపయోగించబడుతున్నాయి. ఇవి బహుముఖ ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయి.

-బి.మాన్‌సింగ్ నాయక్