S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పడవ ప్రయాణీకుడు

టామ్ నలభై రెండు అడుగుల పొడవైన మరపడవ స్టీరింగ్‌ని స్టార్ బోర్డ్ వైపు తిప్పి నైట్ విజన్ మానిటర్‌లోంచి చూశాడు. తెల్లారడానికి ఇంకో ముప్పావు గంట ఉంది. ఆ పడవలో ప్రయాణించే డైగో అడిగాడు.
‘మనం అనుకున్న సమయం ప్రకారమే అంతా జరుగుతుందా?’
‘జరుగుతుంది’ టామ్ జవాబు చెప్పాడు.
‘జరిగి తీరాలి’ డైగో చెప్పాడు.
అది బెదిరింపుగా టామ్ అర్థం చేసుకోగలిగాడు.
‘మిత్రమా! నువ్వు గుర్తుంచుకోవాల్సింది నువ్వు నా దగ్గరికి వచ్చావు తప్ప నేను నీ దగ్గరికి రాలేదు. ఇంకో పనె్నండు నిమిషాల్లో మనం లబాడి బీచ్‌కి చేరుకుంటాం’ టామ్ చెప్పాడు.
అది హైతీలో ఉత్తరం వైపున్న ప్రైవేట్ బీచ్. రాయల్ కరీబియన్ క్రూజ్ లైన్ ఆ బీచ్ యజమాని. మళ్లీ గురువారం తర్వాతి ఓడ వచ్చేదాకా ఆ ప్రదేశం అంతా ఖాళీగా ఉంటుంది. ఆ రోజు మంగళవారం.
తీరానికి ముప్పై అడుగుల దూరంలో ఉండగా టామ్ చెప్పాడు.
‘ఇక్కడ నించి నడిచి వెళ్లచ్చు. నీళ్లల్లోకి దిగితే నీ భుజాల దాకానే నీళ్లు వస్తాయి. పడవని మరీ ఒడ్డుకి తీసుకెళ్తే ఇది నేలలో చిక్కుకోవచ్చు’
డైగో ఎర్రరంగు టార్చ్‌లైట్, వాటర్ ప్రూఫ్ బ్రీఫ్‌కేస్‌లని అందుకుని అడిగాడు.
‘నీకేం చెప్పానో గుర్తుందిగా?’
‘గుర్తుంది. నువ్వు భయపడక’
‘నా పథకంలో నేను భయపడేది నీ గురించే. నేను ఆఖరి నిమిషం దాకా ప్రతీది ప్లాన్ చేశాను. ఏదీ అవకాశానికి వదల్లేదు. నా పథకం విఫలమైతే నీ వల్లే అవుతుంది’
టామ్ జవాబు చెప్పలేదు. అతనికి అప్పటికే తన పడవని అద్దెకి తీసుకున్న డైగో మీద దురభిప్రాయం ఏర్పడింది. అతని మాటా, తీరు ప్రతికూలంగా ఉన్నాయి. డైగో ఏడోసారి చెప్పాడు.
‘నువ్వు సరాసరి డొమినికన్ నీళ్లల్లోకి వెళ్లి అక్కడే లంగరు వేయి. డైవింగ్ చేయి. ఫిషింగ్ చేయి. కాలక్షేపానికి ఏదైనా చెయ్యి. తప్ప తీరానికి మాత్రం వెళ్లకు. తాగకు. డ్రగ్స్ తీసుకోకు. ఈ రాత్రి పదకొండున్నరకి మళ్లీ ఇక్కడికి తిరిగిరా. అర్థమైందా?’
‘అలాగే డైగో. మూడుసార్లు మూడు నిమిషాల విరామంతో టార్చ్‌లైట్‌ని వెలిగించి ఆర్పుతాను’ టామ్ చెప్పాడు.
డైగో నీళ్లల్లో నడిచి తీరానికి చేరుకోవడం నిర్మానుష్యంగా ఉన్న అక్కడ ఎవరూ చూడలేదు.
* * *
టామ్ నీళ్లల్లో డైవింగ్ చేస్తూ, చేతిలోని స్పియర్ గన్ (శూలం తుపాకీ)తో పెద్ద చేపలని వేటాడుతూ పేలుస్తూ కాలక్షేపం చేశాడు. అతను డైగో గురించి ఆలోచించాడు. అమెరికా నించి బహమాస్‌కి వచ్చే అమెరికన్స్ సాధారణంగా ఆడవాళ్లతో గడపడానికి లేదా స్థానిక కేసినోలో జూదం ఆడటానికి వస్తూంటారు. నేరస్థులు బహమాస్‌లోని బేంక్‌లో ఎకౌంట్ తెరిచి తాము సంపాదించింది జమ చేసి వెళ్తూంటారు.
డైగో ఉగ్రవాది కాదు. అలా అని ప్లేబాయ్ కూడా కాదు. బహుశా అమెరికాలో టేక్స్ ఎక్కొట్టడానికి ఇక్కడ బేంక్ ఎకౌంట్‌ని ఓపెన్ చేయడానికి వచ్చి ఉండచ్చు. ఏది ఏమైనా అతను ప్రమాదకరమైన వ్యక్తిగా టామ్ భావించలేదు. అతను ఇంటర్‌నెట్ డాట్‌కాం కోటీశ్వరుడై ఉండచ్చని అనుకున్నాడు. వెబ్‌సైట్ తెరిచి దాన్ని కొంత కాలానికి ఖరీదుకి అమ్మే వ్యాపారం అమెరికాలో జోరుగా సాగుతోందని విన్నాడు. లేదా ఆయుధాల వ్యాపారా?
డైగో అతని అసలు పేరు అయి ఉండదని కూడా భావించాడు. సూర్యోదయానకి మునుపు హైతీలో దింపి అదే రాత్రి మళ్లీ పికప్ చేసి మర్నాడు బహమాస్‌లో దింపాలన్నది వారి మధ్య ఒప్పందం. అందుకు పదివేల అమెరికన్ డాలర్స్‌తోపాటు ఇంధనం ఖర్చు ముడుతుంది.
ఒకోసారి ఒకరిద్దరు తుపాకులు, డ్రగ్స్‌ని స్మగుల్ చేయమని టామ్‌ని కోరారు. తుపాకులు ప్రజలని స్వతంత్రులు చేయడానికి లేదా బానిసలని చేయడానికి వాడబడతాయి. డ్రగ్స్ మధ్యతరగతి మనుషులని ఆర్థికంగా, ఇతరత్రా నాశనం చేస్తాయి. అందుకని టామ్ అలాంటివి అంగీకరించడు. మనుషులని స్మగుల్ చేయడానికి మాత్రం అంగీకరిస్తాడు. వాళ్లని కదపడం, దాచడం తేలిక. అది నైతికంగా ఇబ్బంది కలిగించని స్మగ్లింగ్.
అతని మర పడవ చేపలని పట్టడానికి ఉపయోగించేది. కాని సైడ్ బిజినెస్‌గా ఇలాంటి వాటికి ఉపయోగిస్తూంటాడు. బార్బడోస్‌కి వెళ్లి, అక్కడ చిన్న దుకాణాన్ని తెరిచి దాన్ని నడపడానికి ఒకరిద్దరు నిజాయితీగల వ్యక్తుల్ని నియమించి, చేపలు పడుతూ లేదా టూరిస్ట్‌లకి బేబి సిట్టింగ్ చేస్తూ కాలాన్ని ఆనందంగా గడపాలన్నది అతని కోరిక. కాని అందుకు సరిపడే డబ్బు టామ్‌కి లేదు. కాబట్టి మరో రెండు మూడేళ్లు మనుషుల్ని స్మగుల్ చేయాల్సి ఉంది. తన నలభైయవ ఏటికల్లా బార్బడోస్‌లో పెళ్లి చేసుకుని తన కలని నిజం చేసుకోవాలన్నది అతని లక్ష్యం.
* * *
ఆ రాత్రి టామ్ మళ్లీ లబాడీ బీచ్‌కి పదకొండున్నరకి చేరుకున్నాడు. పడవ ఇంజన్స్‌ని ఆఫ్ చేసి నైట్ విజన్ బైనాక్యులర్స్‌లో తీరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. ఎవరూ కనపడలేదు. ఎర్ర లైన్స్ అమర్చిన టార్చ్‌లైట్‌ని అందుకుని గడియారం వంక చూసుకుంటూ తీరం వైపు మూడుసార్లు మూడు నిమిషాల విరామంతో వెలిగించి ఆర్పాడు.
జవాబుగా అతనికి సిగ్నల్ కనపడలేదు. డైగో ఎక్కడ ఉన్నాడు? మూడుసార్లు మళ్లీ ఆ సిగ్నల్‌ని ప్రసారం చేసినా జవాబు లేదు. నాలుగో సారి కూడా సిగ్నల్‌ని ప్రసారం చేశాడు.
మరో పావుగంట గడిచాక ఏదో తేడా జరిగిందని టామ్ భావించాడు. అతను ఆఖరి నిమిషందాకా ప్లాన్ చేసానని పదేపదే చెప్పాడు. మరి ఆలస్యం చేశాడే? టామ్ మళ్లీ టార్చ్‌లైట్‌ని అందుకోగానే తీరం పొదల దగ్గర కదలిక కనిపించింది. డైగో పొదల చాటు నించి బీచ్‌లోకి, బీచ్‌లోంచి నీళ్లల్లోకి వేగంగా నడుస్తూ చేతిలో బ్రీఫ్‌కేస్‌తో పడవ దగ్గరికి వచ్చాడు. అతను పడవలోకి ఎక్కటానికి టామ్ సహాయం చేశాడు. డైగో చొక్కా నిండా రక్తం కనిపించింది. చాలా రక్తం!
‘నేను ఫస్ట్ ఎయిడ్ కిట్ తెస్తాను’ టామ్ చెప్పాడు.
‘ఆగు. నా ముక్కులోంచి రక్తం కారి తడిసిందంతే’
‘ఐతే సరే’
‘ముందు ఇక్కడ నించి నిశ్శబ్దంగా, వేగంగా వెళ్దాం. ఇంజన్ స్టార్ట్ చేయి’ డైగో ఆజ్ఞాపించాడు.
‘రెండూ కుదరవు. ఏదోఒకటే కోరుకోండి’
‘వేగంగా. పడవలో లైట్లు వెలిగించద్దు’
టామ్ పడవని స్టార్ట్ చేయగానే దాని రెండు డీజిల్ ఇంజన్స్ పెద్దగా శబ్దం చేయసాగాయి. పడవని ముందుకి పోనించాడు. వాళ్లు కొంతదూరం వెళ్లాక చీకట్లోంచి ఆటోమేటిక్ రైఫిల్స్ పేలిన శబ్దాలు వినిపించాయి. వెంటనే డైగో డెక్ మీద బోర్లా పడుకున్నాడు. ఐతే ఏ పడవా తమ పడవని అనుసరించడం లేదని టామ్ గమనించాడు. గంటకి ముప్పై నాట్ల వేగంతో పడవని పోనించాడు.
‘తీరం వైపు వాళ్లు మన పడవ శబ్దం వైపు కాల్చి ఉంటారు. కాని ఆ గుళ్లు తాకేంత దూరంలో లేదు మన పడవ’ డైగో చెప్పాడు.
‘హైతీలో కోస్ట్ గార్డ్‌లు తక్కువ. వారి పడవలు కూడా ఆధునికమైనవి కావు. సమీపంలో వారి పడవలు లేవు’ నైట్ విజన్ బైనాక్యులర్స్ లోంచి తీరం వైపు చూస్తూ టామ్ చెప్పాడు.
ఇంజన్ గదిలోకి మళ్లీ వెళ్లి వైర్‌లెస్ సెట్‌ని ఆన్ చేసి మెరైన్ వెదర్ ఫోర్‌కాస్ట్‌ని విన్నాడు. తమ దారిలో ఎక్కడా తుఫాన్లు లేవు. అతను ఆలోచించసాగాడు. డైగో వొంటిమీది రక్తం మరొకరిది. బహుశా అది తుపాకులు పేల్చిన బృందంలోని ఒకరిదై ఉండచ్చు. హైతీలో ఆటోమేటిక్ రైఫిల్స్ కోస్ట్‌గార్డ్‌ల దగ్గరే కాక దుర్మార్గుల దగ్గర కూడా ఉంటాయి.
ది కరీబియన్ న్యూస్ ఏజెన్సీ వార్తలని రేడియోలో విన్నాడు. హైతీలోని ప్రజాస్వామ్య తిరుగుబాటు నాయకుడు డోమ్నిక్ మార్టెల్ ఆ సాయంత్రం కేప్ హైతియన్ అనే ఊళ్లో ఓ రెస్టారెంట్‌లో తన కుటుంబ సభ్యులతో డిన్నర్ చేస్తూండగా కాల్చి చంపబడ్డాడని విన్నాడు. అది లబాడీ బీచ్‌కి ఆరు మైళ్ల దూరంలో ఉంది. డైగో కిరాయి హంతకుడని, అతన్ని చంపింది డైగోనే అని టామ్ ఇట్టే గ్రహించాడు. అతను పదివేల డాలర్ల కోసం తననీ చంపే అవకాశం ఉంది. బద్ధకంగా బదులు తను చురుగ్గా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించాడు. మరోసారి బైనాక్యులర్స్‌లోంచి చూస్తే ఏ పడవా కనపడలేదు. కాని చుట్టూ చీకటి కాబట్టి ఆ సంగతి డైగోకి తెలీదు. టామ్ ఆటో పైలట్‌ని ఆన్ చేసి టార్చ్‌లైట్ తీసుకుని వేగంగా డెక్‌కి వెళ్లే నిచ్చెన వైపు కదిలాడు.
‘కిందకి రా. ఓ పడవ ఇటే వస్తోంది’ డైగోకి వినిపించేలా అరిచాడు.
తక్షణం డైగో చేతిలో బ్రీఫ్‌కేస్‌తో కిందకి వచ్చేశాడు.
‘పడవని ఆపమని సిగ్నల్ ఇచ్చారు. బహుశా అది హైతీ నేవీకి చెందిన పడవై ఉండచ్చు. మిమ్మల్ని వాళ్లు చూసినా ఫర్వాలేదా?’ అబద్ధం చెప్పాడు.
వెంటనే డైగో మొహంలో భయం ప్రవేశించింది. టామ్ కేబిన్ నేలలోని ఓ చెక్క తలుపుని పైకి ఎత్తి మెట్ల మీంచి కిందకి దిగుతూ అతన్ని రమ్మని సైగ చేశాడు. లోపలికి దిగి లైట్ స్విచ్ వేసి అక్కడున్న ఓ నకిలీ గోడని పక్కకి జరిపాడు. దాని వెనుక ఓ మనిషి పట్టేంత చిన్న ప్రదేశం డైగోకి కనిపించింది. ఓ చిన్న కుర్చీ కూడా అక్కడ ఉంది. దాని వంక కూడా డైగో భయంగా చూశాడు.
‘ఇక్కడు దాక్కున్న వారు భద్రంగా ఉంటారు. దీన్ని అసలు అందుకే నిర్మించారు. వెంటిలేషన్ ఉంది. వాళ్లు వెదికినా మిమ్మల్ని కనుక్కోలేరు. అనేక మందిని దీంట్లో స్మగుల్ చేశాను’
డైగో అయిష్టంగానే లోపలకి వెళ్లాడు.
‘దగ్గద్దు. తుమ్మద్దు’ చెప్పి టామ్ మళ్లీ నకిలీ గోడని యథాస్థానానికి నెట్టేశాడు.
మెట్లెక్కి పైకెళ్లి నీళ్ల సీసాని, ఎనర్జీ బార్‌లని తీసుకుని మళ్లీ కిందకి వచ్చి గోడని పక్కకి జరిపి అతనికి ఇచ్చి చెప్పాడు.
‘నేను వేగాన్ని పెంచుతాను. పడవ ఎగిరెగిరి పడుతుంది. సీ సిక్‌నెస్‌కి మీకు వాంతులు అవుతాయి. అవి గొంతులో అడ్డుపడి ఊపిరి ఆడక ఒకరిద్దరు ఇందులో చచ్చిపోయారు.’
డైగో మళ్లీ భయంగా చూశాడు. టామ్ జేబులోంచి రెండు మాత్రలు తీసిచ్చి చెప్పాడు.
‘ఇవి వేసుకుంటే వాంతులు కావు’
గోడని మూసేశాడు. డైగో కొద్దిగా సందేహించాక మాత్రలని వేసుకున్నాడు. టామ్ ఆటోపైలట్‌ని ఆఫ్ చేసి పడవని అటు, ఇటు వేగంగా కదుపుతూ పోనించాడు. పడవ తీవ్రంగా కదలసాగింది. తర్వాత డైగోని దాచిన ప్రదేశానికి వెంటిలేషన్ స్విచ్‌ని ఆఫ్ చేసేశాడు.
బహుశా తను డైగోని దింపాక కొద్దిసేపు బీచ్‌లో పడుకుని ఉంటాడు. ఎందుకంటే పడవలో గత ముప్పై ఆరు గంటలు నిద్రించలేదు. వెంటిలేషన్ మూసేయడం వల్ల అతను మరణించడు. కాని గాల్లో ఆక్సిజన్ స్థాయి తగ్గి గంటలో స్పృహ తప్పుతాడు.
* * *
టామ్ గంటన్నర తర్వాత నకిలీ గోడ జరిపితే అందమైన సంగీతం వినిపించింది. డైగో తలని వెనక్కి వాల్చి గురక పెడుతున్నాడు. అతని చేతిలోని బ్రీఫ్‌కేస్ నేల మీద పడి ఉంది. టామ్ దాన్ని అందుకుని నెమ్మదిగా గోడని మూసేశాడు. పైకెళ్లి దాన్ని తెరచి అందులోంచి ఒక మేప్‌ని బయటికి తీశాడు. ఆ మేప్‌లో లబాడి బీచ్ నించి కేప్ హైతియన్ ఊరు దాకా మార్గం గుర్తించి ఉంది. దాని కింద సెమీ ఆటోమేటిక్ రివాల్వర్ కనిపించింది. దాన్ని అందుకుని వాసన చూస్తే కార్డైట్ వాసన వచ్చింది. ఇటీవలే పేల్చిన ఆ రివాల్వర్‌ని పక్కన పెట్టాడు. దాని పక్కన ముప్పై వేల అమెరికన్ డాలర్స్, ఓ అమెరికన్ పాస్‌పోర్ట్ కూడా కనిపించాయి. దాన్ని విప్పి తెరచి చూడగానే అతని ఒంట్లోని రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
డైగో ఫోటో ఉంది. పేరు మాత్రం తన పేరే. టామ్ బెయిలీ. తక్షణం టామ్‌కి చిరుచెమటలు పట్టాయి. అతని పథకం అర్థం చేసుకో గలిగాడు. అతను నిద్రపోతున్నాడు. తన దగ్గర అతని రివాల్వర్ ఉంది. కిందకి వెళ్లి అతని తలకి గురి పెట్టి పేల్చడం ప్రపంచంలోని అతి తేలికైన విషయం. దాంతో తనకి ప్రమాదం ఆగిపోతుంది. అతని శవాన్ని రివాల్వర్‌తో పాటు సముద్రంలో పడేయచ్చు.
టామ్ దాని గురించి మరి కాస్త లోతుగా ఆలోచించాడు. ఐడెంటిటీని మార్చుకుంటున్నాడంటే మరోచోట స్థిరపడుతూండచ్చు. ఆ మరోచోట బహుశా అతని కోసం చాలా పెద్ద మొత్తం ఎదురుచూస్తూండాలి. కాని ఎక్కడ? ఆ వివరాలు బ్రీఫ్‌కేస్‌లో దొరకలేదు.
టామ్‌కి కొత్త ఆలోచన కలిగింది. అది పిచ్చి ఆలోచనో, నిర్లక్ష్యమైన అవకాశమో కాదని అనుకున్నాడు. రివాల్వర్, పాస్‌పోర్ట్, డబ్బు, మేప్‌లని తిరిగి బ్రీఫ్‌కేస్‌లో అవి ఉంచిన విధంగా సర్ది డైగో గది వెంటిలేషన్ స్విచ్‌ని తిరిగి ఆన్ చేశాడు.
* * *
మర్నాడు ఉదయం డైగో బ్రీఫ్‌కేస్‌తో డెక్ మీదకి వచ్చినప్పుడు ఎడం చేతిలో బ్రీఫ్‌కేస్ ఉంది. పేంట్‌లోకి దోపుకున్న రివాల్వర్ అతని నడుంలోంచి కనిపిస్తోంది.
‘గుడ్‌మార్నింగ్’ టామ్ ఉత్సాహంగా చెప్పాడు.
‘ఎక్కడున్నాం?’ డైగో ప్రశ్నించాడు.
‘దాదాపు వచ్చేసాం’ దూరంగా కనిపించే నేల వంక చూపిస్తూ చెప్పాడు.
‘అది లాంగ్ ఐలెండా?’
‘అవును. ఇంకో అరగంటలో అక్కడికి చేరుకుంటాం’
‘నేను తొడుక్కోడానికి నీ దగ్గర అదనంగా ఓ షర్ట్ ఉందా?’ డైగో ప్రశ్నించాడు.
‘ఉంది’
టామ్ కిందకి వెళ్లి ఓ టీషర్ట్‌ని తెచ్చిచ్చాడు. డైగో రివాల్వర్‌ని తీసి టామ్ వైపు గురి పెట్టాడు. టామ్ ఆశ్చర్యాన్ని నటించి చెప్పాడు.
‘డైగో. నీకీ షర్ట్ నచ్చకపోతే ఇంకోటి తెస్తాను’
‘నీ జోక్‌కి నవ్వు రాలేదు. చేతులు ఎత్తు’
‘డైగో. నువ్వు కోరింది నేను చేశాను. బదులుగా నువ్వు ఇలా చేయడం న్యాయం కాదు’
‘నిజానికి ఇది న్యాయమే’
‘ఎందుకు? నన్ను చంపితే చాలా ప్రశ్నలు ఉదయిస్తాయి. నా పడవని డైగో అనే వ్యక్తి అద్దెకి తీసుకున్నాడని రికార్డుల్లో ఉంది’
‘నా పేరు డైగో కాదని నువ్వు ఊహించే ఉంటావు. ఐనా నువ్వు ఇప్పుడే చావటంలేదు. మనం ఇంకో చోటికి వెళ్తున్నాం’
‘ఎక్కడికి?’
‘గ్రాండ్ కేమన్‌కి’
‘కేమన్‌లో అక్రమ సంపాదనని దాచుకునేందుకు ప్రైవేట్ బాంక్స్ చాలా ఉన్నాయి. ఆ పని మీదా?’
‘ఓ! నా రహస్యం ఊహించావన్నమాట. ఇక్కడ నించి కేమన్‌కి నేను పడవలో ఒంటరిగా వెళ్లగలను’ అతని ఛాతీకి గురి పెట్టి ట్రిగర్‌ని నొక్కాడు.
క్లిక్!
అతని కనుబొమలు తక్షణం పైకి లేచాయి.
‘తెలివే’
అతను రివాల్వర్‌ని కింద పడేసి పేంట్ వెనక నించి కత్తిని అందుకుని టామ్ వైపు వేగంగా విసరబోయాడు. అప్పటికే టామ్ చేతిలో స్పియర్ గన్ ప్రత్యక్షం అయ్యింది. ఇద్దరూ ఆయుధాలని ప్రయోగించకుండా ఒకరి వంక మరొకరు చూసుకుంటూండిపోయారు.
‘నువ్వు ఎంత వేగంగా ఆ కత్తిని విసిరినా నేను పేల్చే శూలం ఇంకా వేగంగా వచ్చి నిన్ను తాకుతుంది’ టామ్ హెచ్చరికగా చెప్పాడు.
‘ఏం చేద్దామంటావు?’
‘నీకో అవకాశం ఇస్తాను. నువ్వు వేగంగా కత్తిని విసరగలనని అనుకుంటే ఆ ప్రయత్నం చేయి. తర్వాత కేమన్‌కి వెళ్లు’
‘నువ్వు జోక్ చేస్తున్నావు. విసరలేను’ అంటూనే అతను కత్తి పాస్‌పోర్ట్‌లకి విసిరాడు. కాని తుపాకీ నించి శూలం వెళ్లి డైగో ఛాతీలో గుచ్చుకోవడంతో కత్తి అతని కాళ్ల దగ్గరే పడిపోయింది. ఆ తాకిడికి అతను వెనక్కి అడుగులు వేశాడు. అతని రెండు చేతులూ గాల్లోకి లేచి, పిట్టగోడ మీంచి కరీబియన్ సముద్రంలోకి పడిపోయాడు.
టామ్ వెళ్లి నేల మీది అతని రివాల్వర్, కత్తిని తీసుకుని సముద్రంలోకి విసిరేసాడు. తర్వాత జేబులోంచి గుళ్లని కూడా తీసి సముద్రంలోకి విసిరాడు. మెట్ల మీద కిందకి దిగి సీసాలోంచి రమ్‌ని వంచుకుని గ్లాస్‌లోంచి దాన్ని ఒక్క గుక్కలో తాగాడు.
కేమన్! అతను అక్కడ డబ్బు దాచాడు. ఓ బేంక్‌లో తన పేర తెరచిన అకౌంట్‌లో అది వేచి ఉంది. తన పాస్‌పోర్ట్‌లో తన పేరు, తన ఫొటో కూడా ఉన్నాయి కాబట్టి ఐడెంటిటీ సమస్య ఉండదు. మేప్ చూసి గ్రాండ్ కేమన్‌కి ఓ మార్గాన్ని ఎన్నుకుని మరో పెగ్ పోసుకుని దాన్ని తాగసాగాడు. తను చేసిన సాహసంలో గెలిచానని అనుకున్నాడు.
***
(టాం బెయిలీ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి